‘‘కొండా సురేఖా.. నోరు అదుపులో పెట్టుకో’’ | BRS Leaders Warning To Minister Konda Surekha Over Her Controversial Comments, Tweets Inside | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌పై వ్యాఖ్యలకుగానూ.. హరీష్‌రావు సహా బీఆర్‌ఎస్‌ నేతల వార్నింగ్‌

Published Wed, Oct 2 2024 7:28 PM | Last Updated on Thu, Oct 3 2024 11:26 AM

 BRS Leaders Warning To Minister Konda Surekha

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రాజకీయం మరోసారి పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. అధికార కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో మంత్రి సురేఖపై బీఆర్‌ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోరు అదుపులోకి పెట్టుకోవాలని హితవు పలుకుతున్నారు.

ట్విట్టర్‌ వేదికగా మాజీ మంత్రి హరీష్‌ రావు స్పందిస్తూ.. కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ వాదనల్లో పసలేకే వ్యక్తిగత దూషణలకు దిగుతారన్న మార్గరెట్‌ థాచర్‌ కోట్‌ను షేర్‌ చేశారు.

 

 

కొండా సురేఖ వ్యాఖ్యలపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందిస్తూ..‘కాంగ్రెస్ పాలన వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకే మహిళా మంత్రులను శిఖండి లాగా పెట్టుకుని చిల్లర రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డి. కొండా సురేఖ బజారు మాటలను అందరూ అసహ్యించుకుంటున్నారు. ఖబడ్ధార్.. నోరు అదుపులో పెట్టుకోకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతా అంటే ఊరుకునేది లేదు అంటూ హెచ్చరించారు.

సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..‘బాధ్యతగల మంత్రిగా దిగజారి మాట్లాడటం మంచిది కాదు. కొండా సురేఖపై జరిగిన ట్రోలింగ్‌ను ఒక మహిళగా ఖండించాం. కానీ, ఇవాళ సినీ పరిశ్రమలో ఉన్న మహిళలపై చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవి. ఒక మహిళగా మరో మహిళను కించపరిచేలా మాట్లాడడం బాధాకరం. తనపై ఎవరో ట్రోల్ చేస్తే కేటీఆర్‌కు ఆపాదించడం, వ్యక్తిగతంగా దూషించడం సరైంది కాదు. సీఎం రేవంత్ రెడ్డి మమ్మల్ని కామెంట్ చేసినప్పుడు తాము మహిళలమన్న విషయాన్ని కొండా సురేఖ మరిచారా’అని ప్రశ్నించారు.

మాజీ ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ.. అనవసరంగా కేటీఆర్ గారి పరువుకు నష్టం కలిగే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదు. కొండా సురేఖ నోరు అదుపులో పెట్టుకో.. లేకపోతే నాలుక చీరుతాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. కొండా సురేఖతో అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సంయమనంతో వ్యవహరిస్తున్నారు. మేం పాటించే సంయమనం మా బలహీనత కాదు.. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. కేటీఆర్ కాన్వాయ్‌పై దాడి జరిగి 26 గంటలు అయినా నిందితులను పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదు?. హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొతా రోహిత్ అనే అతను కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్నట్లు అతని ట్విట్టర్లో పెట్టుకున్నాడు. ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీదే దాడులు జరుగుతుంటే మీరు ప్రజలకేం రక్షణ కల్పిస్తారు అని ప్రశ్నించారు.  

 

ఇది కూడా చదవండి: సినీ నటులంటే అంత చిన్న చూపా.. కొండా సురేఖకు ప్రకాశ్‌ రాజ్‌ కౌంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement