భావోద్వేగానికి గురై మురళిని హత్తుకున్న సురేఖ
హన్మకొండ: గత ఎన్నికల్లో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆస్పత్రిలో చేరి సానుభూతి పొంది గెలిచారని, ఈసారి నిజంగానే ఆయన ఆస్పత్రి పాలు కావడం ఖాయమని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు అన్నారు. బుధవారం హనుమకొండలో కొండా చిత్రం ట్రైలర్ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను నిశ్శబ్ధంగా ఉంటే తట్టి లేపారని, ఇకనుంచి ప్రజల్లో తిరుగుతానని చెప్పారు.
కొన్నేళ్ల కిందట తనపై కాల్పులు జరిపారని, 47 బుల్లెట్లు దూసుకొచ్చాయని గుర్తుచేసుకున్నారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడంతో ప్రాణాలతో బయటపడ్డానన్నారు. వచ్చే ఎన్నికల్లో కొండా సురేఖ వరంగల్ తూర్పునుంచి పోటీ చేస్తుందని, త్వరలో డివిజన్లవారీగా పాదయాత్ర చేపడుతామని ప్రకటించారు. వరంగల్ నగరంలో ఎవరైనా భూ కబ్జాలకు పాల్పడితే బాధితులు తన దృష్టికి తీసుకొస్తే వారికి న్యాయం జరిగేలా చూస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment