challa dharma reddy
-
పరకాలలో విజయం బీఆర్ఎస్ దే..
-
పరకాలలో జరిగిన అభివృద్ధే మళ్లీ నన్ను గెలిపిస్తుంది: చల్ల ధర్మారెడ్డి
-
పరకాల నియోజకవర్గం అభ్యర్థికి హ్యాట్రిక్ అవకాశం...మరి నెక్స్ట్ ఎవరు..?
పరకాల నియోజకవర్గం పరకాల నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన చల్లా దర్మారెడ్డి రెండోసారి విజయం సాదించారు. 2014లో ధర్మారెడ్డి టిడిపి తరపున గెలిచి, తదుపరి పరిణామాలలో టిఆర్ఎస్లో చేరిపోయారు. 2018లో టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, మాజీ మంత్రి కొండా సురేఖపై 46519 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. 2014 ఎన్నికలలో వరంగల్ తూర్పు నుంచి టిఆర్ఎస్ తరపున గెలిచిన కొండా సురేఖ 2018 ఎన్నికల ముందు పార్టీ నాయకత్వంపై అలిగి పార్టీని వీడి కాంగ్రెస్ ఐలో చేరి పరకాల నుంచి పోటీచేశారు. అయినా ఫలితం దక్కలేదు. దర్మారెడ్డికి 105903 ఓట్లు రాగా, కొండా సురేఖకు 59384 ఓట్లు వచ్చాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసిన యు.శ్రీనివాస్‌కు సుమారు నాలుగువేల ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికలలో చల్లా దర్మారెడ్డి తన సమీప ప్రత్యర్ధి టిఆర్ఎస్ నేత సహోదర రెడ్డిపై 9108 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్ధి ఇ. వెంకట్రామిరెడ్డికి 30283 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత దర్మారెడ్డి టిఆర్ఎస్ లో చేరిపోయారు. నియోజకవర్గాల పునర్విభజనలో సొంత నియోజకవర్గం అయిన శాయంపేట రద్దు కావడంతో 2009లో కొండా సురేఖ పరకాల నియోజకవర్గం నుంచి మూడోసారి విజయం సాధించారు. అంతేకాక డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో మంత్రి పదవిని కూడా పొందగలిగారు. వైఎస్ మరణం తర్వాత కొండాసురేఖ కొంతకాలం రోశయ్య క్యాబినెట్లో కొనసాగి రాజీనామా చేశారు. కొండా సురేఖ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్‌లో ముఖ్యనేతగా కొనసాగి, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి అనర్హత వేటుకు గురి అయ్యారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలలో 1562 ఓట్ల తేడాతో టిఆర్ఎస్ అభ్యర్ధి బిక్షమయ్య చేతిలో సురేఖ ఓడిపోయారు. అనంతరం జరిగిన పరిణామాలలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ సమైక్యవాదానికి అనుకూలంగా మొగ్గు చూపుతోందని విమర్శిస్తూ, సురేఖ పార్టీకి గుడ్ బై చెప్పారు. తిరిగి కాంగ్రెస్ ఐలో చేరారు. తదుపరి ఆమె టిఆర్ఎస్లో చేరి 2014 లో వరంగల్ తూర్పులో గెలుపొందారు. 2018 ఎన్నికల సమయానికి తిరిగి కాంగ్రెస్ ఐలో చేరి ఓటమి చెందారు. కొండా సురేఖ భర్త మురళి కూడా ఎమ్మెల్సీగా పనిచేశారు. పరకాల నియోజకవర్గం నుంచి 1952 నుంచి 1972 వరకు జనరల్‌గాను, ఆ తర్వాత 2004 వరకు రిజర్వుడుగాను, 2009 నుంచి మళ్ళీ జనరల్‌గా మారింది. పరకాలలో పిడిఎఫ్ ఒకసారి, కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఆరుసార్లు, భారతీ యజనసంఫ్ు, భారతీయ జనతాపార్టీ కలిసి మూడుసార్లు, టిడిపి రెండుసార్లు, సిపిఐ ఒకసారి, టిఆర్ఎస్ రెండుసార్లు గెలిచాయి. బిజెపి సీనియర్ నాయకుడు సి. జంగారెడ్డి ఇక్కడ ఒకసారి, శాయంపేటలో రెండుసార్లు గెలుపొందారు. ఆయన హన్మకొండ లోక్‌సభ స్థానంలో మాజీప్రధాని పి.వి నరసింహారావును ఓడిరచి చరిత్ర సృష్టించారు. ఆర్. నరసింహరామయ్య ఇక్కడ ఒకసారి హసన్‌పర్తిలో రెండుసార్లు గెలిచారు. రెండుసార్లు గెలిచిన బచ్చు సమ్మయ్య ఒకసారి, హసన్‌పర్తిలో మరోసారి గెలిచారు. బిజెపి అభ్యర్ధి అయిన జయపాల్ ఇక్కడ రెండుసార్లు, బి. రాజయ్య ఇక్కడ ఒకసారి, స్టేషన్‌ఘన్‌పూర్‌లో మరోసారి గెలిచారు. 2004లో టిఆర్ఎస్ పక్షాన గెలిచిన శారారాణి ఆ తర్వాత అసమ్మతిలో చేరారు. ఎమ్మెల్సీ ఎన్నికలో పార్టీ విఫ్‌కు విరుద్ధంగా కాసాని జ్ఞానేశ్వర్ మద్దతు ఇచ్చినందుకుగాను పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఈమెను అనర్హురాలిని చేస్తూ అప్పటి స్పీకర్ సురేష్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. మొత్తం తొమ్మిదిమంది ఈ విధంగా అనర్హతకు గురి అయితే వారిలో ఈమె ఒకరు. అయితే ఈమె తీర్పు రావడానికి ఒకరోజు ముందే పదవికి రాజీనామా చేశారు. ఇక్కడ నుంచి గెలిచిన సమ్మయ్య గతంలో భవనం, కోట్ల మంత్రి వర్గాలలో ఉంటే, సి. ధర్మారెడ్డి అప్పట్లో జలగం క్యాబినెట్లో ఉన్నారు.పరకాలలో ఐదుసార్లు రెడ్లు, రెండుసార్లు బిసిలు, తొమ్మిదిసార్లు ఎస్.సిలు, ఒకసారి ఇతరులు గెలిచారు. పరకాల నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ఎమ్మెల్యే ‘చల్లా’ మోసం చేశారు.. సీఎం మంజూరు చేసిన రూ.5 కోట్లు మళ్లించారు
గీసుకొండ: వంచనగిరికి సీఎం కేసీఆర్ మంజూరు చేసిన నిధులను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు మళ్లించి తమకు అన్యాయం చేశారని వంచనగిరి గ్రామస్తులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆరోపించారు. మండలంలోని కోటగండి వద్ద వారు బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. 2017లో అప్పటి ఎమ్మెల్సీ కొండా మురళి వినతి మేరకు సీఎం కేసీఆర్ వంచనగిరికి రూ.9.50 కోట్లు అభివృద్ధి పనులకు మంజూరు చేశారని తెలిపారు. ఆ నిధుల్లో కేవలం రూ.3.38 కోట్ల పనులు చేశారని, మరో రూ.1.29 కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కొండా మురళి పార్టీ మారాడనే అక్కసుతోనే ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గ్రామానికి మంజూరైన రూ.5 కోట్ల బ్యాలెన్స్ నిధులను ఇతర గ్రామాలకు మళ్లించారన్నారు. దీంతో గ్రామంలో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేకు తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. సర్పంచ్, ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కావడంతో ఈజీఎస్ నిధుల మంజూరులోనూ వివక్ష కొనసాగుతోందని పేర్కొన్నారు. మొరం, మట్టి తరలించే వాహనాలు, టెక్స్టైల్ పార్కు నుంచి వచ్చిపోయే వాహనాలతో శాయంపేట–స్తంభంపల్లి రోడ్డు శిథిలమైందన్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే మళ్లించిన నిధులను గ్రామానికి కేటాయించి అభివృద్ధి పనులు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ భీమగాని సౌజన్య, సర్పంచ్ అమిరిశెట్టి అనసూర్య, ఎంపీటీసీ నాగరబోయిన రజితసారంగం, మండల కోఆప్షన్ సభ్యుడు రహీం, వార్డు సభ్యులు కరుణాకర్, అమిరిశెట్టి రాజు, నల్ల సురేశ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
ధర్మారెడ్డి.. తరిమికొట్టడం నీకేం తెలుసు.. తరిమికొట్టడమంటే కొండా మురళీకి తెలుసు..
వరంగల్ : ‘ధర్మారెడ్డి.. తరిమికొట్టడం నీకేం తెలుసు.. తరిమికొట్టడమంటే కొండా మురళీకి తెలుసు.. మా కార్యకర్తలు నిన్ను ఉరికిస్తరు.. మైసమ్మ సాక్షిగా చెబుతున్నా.. పరకాలలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నిలుచున్నా నిన్ను ఓడిస్తా’ ఖబర్దార్ అంటూ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు చల్లాపై మండిపడ్డారు. మంత్రి కేటీఆర్‌పై కొండామురళి వ్యాఖ్యలను ఖండిస్తూ చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. దీనిపై స్పందిస్తూ మంగళవారం వరంగల్ రత్నహోటల్లో కొండామురళి విలేకరుల సమావేశంలో ప్రతి విమర్శలు చేశారు. ‘ధర్మారెడ్డి నువ్వు నా ఇంటికి వచ్చి బతిమిలాడి రూ. 14 కోట్ల విలువైన ప్రగతి సింగారం బ్రిడ్జి పనులు తీసుకోలేదా’ అని గుర్తు చేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో చలివాగు ప్రాజెక్టు, శాయంపేట మండల కేంద్రంలో 14 ఎకరాల్లో మోడల్ కాలేజీ, ఆత్మకూర్ పోలీస్‌స్టేషన్‌కు స్థలం ఈ పనులన్నీ తానే చేశానని, ఎమ్మెల్యే చేసింది ఏమిటని ప్రశ్నించారు. అక్రమాలను వెలికితీసే జర్నలిస్టులకే ఈ ప్రభుత్వంలో రక్షణ కరువైతే.. సామాన్యుల పరిస్థితి ఏమిటో అర్థమవుతుందన్నారు. మహిళలను అవమానించి కేసులు నమోదు చేయించే సంస్కృతి ధర్మారెడ్డి అయితే.. వారికి అండగా నిలిచే సంస్కృతి తనదన్నారు. ‘పరకాల ప్రజలకు నీ గురించి గొప్పగా తెలుసు.. నువ్వో మట్టి దొంగవు’ అని ఎద్దేవా చేశారు. మట్టి తీయడం, మొరం తీసి అమ్మడం, కాంట్రాక్టు పనుల్లో పర్సంటేజీ నొక్కడం ఇది ఎమ్మెల్యే సంస్కృతి అని మండిపడ్డారు. తూర్పులో కొండా సురేఖను, పరకాలలో కాంగ్రెస్ అభ్యర్థి తానే గెలిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తూర్పు, పరకాల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘చల్లా ఆస్పత్రి పాలు కావడం ఖాయం’
హన్మకొండ: గత ఎన్నికల్లో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆస్పత్రిలో చేరి సానుభూతి పొంది గెలిచారని, ఈసారి నిజంగానే ఆయన ఆస్పత్రి పాలు కావడం ఖాయమని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు అన్నారు. బుధవారం హనుమకొండలో కొండా చిత్రం ట్రైలర్ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను నిశ్శబ్ధంగా ఉంటే తట్టి లేపారని, ఇకనుంచి ప్రజల్లో తిరుగుతానని చెప్పారు. కొన్నేళ్ల కిందట తనపై కాల్పులు జరిపారని, 47 బుల్లెట్లు దూసుకొచ్చాయని గుర్తుచేసుకున్నారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడంతో ప్రాణాలతో బయటపడ్డానన్నారు. వచ్చే ఎన్నికల్లో కొండా సురేఖ వరంగల్ తూర్పునుంచి పోటీ చేస్తుందని, త్వరలో డివిజన్లవారీగా పాదయాత్ర చేపడుతామని ప్రకటించారు. వరంగల్ నగరంలో ఎవరైనా భూ కబ్జాలకు పాల్పడితే బాధితులు తన దృష్టికి తీసుకొస్తే వారికి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. -
బతుకమ్మల పైనుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు?.. మండిపడ్డ వీహెచ్
సాక్షి, వరంగల్: తెలంగాణలో బతుకమ్మ పండుగ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రంగు రంగు పూలను పేర్చి, ఆట పాటలతో అమ్మను కొలిచే ఈ పండగకు తెలంగాణ యావత్తూ పూలవనంలా మారిపోయింది. అలాంటి బతుకమ్మ పట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అమానుషంగా ప్రవర్తించారని కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. మహిళలంతా బతుకమ్మలతో వచ్చి బతుకమ్మ ఆడుతుండగా వాటిపైనుంచి ఎమ్మెల్యే కారు పోనిచ్చారని మండిపడ్డారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. మాట్లాడుతున్న ఏఐసీసీ మెంబర్ హన్మంతరావు మహిళలు బతుకమ్మ ఆడుతుండగా తన వాహనంతో తొక్కించి మహిళలను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అవమానపరిచిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై చర్య తీసుకోవాలని ఏఐసీసీ మెంబర్, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు డిమాండ్ చేశారు. మండలకేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళలు బతుకమ్మ ఆడుకుంటుండగా బతుకమ్మలపై నుంచి తన వాహనాన్ని తీసుకెళ్లిన ధర్మారెడ్డి.. మహిళలకు క్షమాపణలు చెప్పాలన్నారు. గతంలో ఎస్సీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అగ్రకుల అహంకారాన్ని ప్రదర్శించారని గుర్తుచేశారు. ఆత్మకూరు సర్పంచ్ రాజు బీసీ కావడం వల్లే ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇలా వ్యవహరిస్తున్నాడన్నారు. చదవండి: గర్భం దాల్చిన బాలిక.. అబార్షన్‌పై టీఎస్ హైకోర్టు కీలక తీర్పు సలేం జరిగింది ఆత్మకూరు పోచమ్మ సెంటర్ వద్ద ఉన్న వేణుగోపాలస్వామి దేవాలయం ఎదుట మహిళలు బతుకమ్మలు పెట్టుకొని ఆడుకుంటున్నారు. అదే సమయంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వస్తున్నారని, రోడ్డుపై నుంచి బతుకమ్మలు తీసివేయాలని మహిళలను ధర్మారెడ్డి అనుచరులు కోరారు. ఎంతో భక్తితో ఆడుకుంటున్న బతుకమ్మలను మధ్యలో తీసివేయలేమని మహిళలు చెప్పారు. దీంతో బతుకమ్మ ఆడుతున్న మహిళలను తోసేసి ఎమ్మెల్యే కారును బతుకమ్మల మీదుగా ముందుకు పోనిచ్చారని స్థానికులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చదవండి: పెద్దమనసు చాటుకున్న కేటీఆర్ -
చల్లా వ్యాఖ్యలు.. ‘సారీ’తో ఆగని ఆందోళనలు
సాక్షి, వరంగల్ : పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై నెలకొన్న వివాదం సద్దుమణగడం లేదు. కొన్ని కులాల ఉద్యోగులపై ఆయన వాడిన పదాలు మంటలు రేపుతున్నాయి. ఓసీ జేఏసీ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం విదితమే. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఉద్యోగ సంఘాలు భగ్గుమంటుండగా, నిన్నటి వరకు ఉమ్మడి వరంగల్‌కే పరిమితమైన ఆందోళనలు బుధవారం తెలంగాణలోని పలు జిల్లాలను తాకాయి. ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనం వరకు వెళ్లగా, బుధవారం ఇచ్చిన పిలుపు మేరకు పరకాల బంద్ ప్రశాంతంగా జరిగింది. కాగా, చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీసీ సంఘాల బాధ్యులు మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయగా, వరంగల్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. మార్చి 1వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. (వివాదాస్పద వ్యాఖ్యలపై ధర్మారెడ్డి క్షమాపణ) శాంతించని సంఘాలు వరుస వివాదాలు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలో రెండు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు వేదికలుగా మారాయి. పరకాలలో జరిగిన ఓ సమావేశంలో అయోధ్యలో రామాలయ నిర్మాణం పేరిట నిధుల సేకరణకు సంబంధించి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తొలుత వివాదాస్పదమయ్యాయి. రాముడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని, విరాళాలు సేకరిస్తున్న నేతలే జేబులు నింపుకుంటున్నారని అన్నారు. దీనిపై భగ్గుమన్న బీజేపీ నేతలు హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దాడులు, ప్రతిదాడులతో వరంగల్ నగరం అట్టుడికిపోగా, హన్మకొండలో ఆదివారం జరిగిన ఓసీ మహాగర్జన సభలోనూ మాట్లాడిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి మరో వివాదానికి తెరలేపారు. ‘ఆ కులాల అధికారులకు అక్షరం ముక్క రాదు’ అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఏ ఆఫీసుకు వెళ్లినా వాళ్లే ఉన్నతాధికారులుగా ఉన్నారు, ఇలాంటి వాళ్ల వల్లే రాష్ట్రం నాశనమవుతోంది’ అనడంపై బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నాయకులు ఆందోళనలకు దిగారు. ‘సారీ’తో ఆగని ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన కుల సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నేతలు ఆందోళనలకు పిలుపునివ్వడంతో పాటు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో దిగొచ్చిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి ‘ఆ సమావేశంలో నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు, ఆ మాటలు ఎవరి మనసునైనా నొప్పించినట్లయితే వెనక్కి తీసుకుంటూ క్షమాపణ చెబుతున్నా’ అని అన్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజాప్రతినిధులతో కలిసి హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. దీంతో వివాదం ఇక సద్దుమణిగినట్లేనని అంతా భావించారు. కానీ తమ మనోభావాలకు సంబంధించిన అంశంగా భావించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, కుల, ఉద్యోగసంఘాలు ఆందోళనలను కొనసాగిçస్తున్నాయి. కాగా, రామమందిరం నిర్మాణంపై వ్యాఖ్యల వివాదం సమయంలో స్పందించిన టీఆర్ఎస్ వర్గాలు ఈ విషయంలో స్తబ్ధంగా ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా బీసీ, దళిత వర్గాల ఉద్యోగులను అవమానపరిచేలా పరకాల ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఉన్నాయంటూ జాతీయ బీసీ అధికార ప్రతినిధి దాసు సురేష్ మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)కు ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ మార్చి 1వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. -
ఓరుగల్లులో హోరాహోరీ..
సాక్షి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోమవారం కూడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బంద్, అరెస్టులు, పోటాపోటీ కార్యక్రమాలతో టీఆర్ఎస్, బీజేపీ నేతలు హోరెత్తించారు. ఆదివారం అర్ధరాత్రి పరకాలలో బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టడం.. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడికి నిరసనగా టీఆర్ఎస్ పరకాల బంద్‌కు పిలుపునివ్వడం.. మరోవైపు బీజేపీ నేతల అరెస్టులతో హైటెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే చల్లా వ్యాఖ్యలకు నిరసనగా హన్మకొండలోని ఆయన ఇంటిపై ఆదివారం బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం.. ప్రతిగా టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి దాడికి దిగిన విషయం విదితమే. దీనికి కొనసాగింపుగా బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు విమర్శలు, ప్రతివిమర్శలు, పోటాపోటీగా దిష్టిబొమ్మలను దహనం చేశారు. చదవండి: గ్రామ సింహాలు.. పరుగో పరుగు రాముడిని అవమానపరుస్తూ మాట్లాడిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ డిమాండ్ చేయగా.. రాముని పేరుతో రాక్షస పనులు చేస్తే తమ కేడర్ చూస్తూ ఊరుకోదని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరించారు. అంతకుముందు వారు ఎమ్మెల్యే చల్లా ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. కాగా, హన్మకొండకు వస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు వద్ద, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డిని ఆలేరులో, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణను జనగామ బైపాస్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకుల ఇళ్లు, రెండు పార్టీల కార్యాలయాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. చదవండి: ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. కేటీఆర్ ఆగ్రహం 44 మందికి రిమాండ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడి చేసిన ఘటనలో 57 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో 44 మందిని అదుపులోకి తీసుకున్నారు. తమ నాయకులను వదిలిపెట్టాలని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు భారీ భద్రత మధ్య హన్మకొండ కోర్టుకు తీసుకెళ్లారు. బీజేపీ వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్ సహా 44 మందిని సోమవారం కోర్టులో పరచగా.. న్యాయమూర్తి ఈనెల 15 వరకు రిమాండ్‌కు అదేశించారు. కాగా, ఈ కేసులో మరో 13 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
వివాదాస్పద వ్యాఖ్యలపై ధర్మారెడ్డి క్షమాపణ
సాక్షి ప్రతినిధి, వరంగల్: పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. రాముడి పేరిట బీజేపీ నేతలు దొంగ బుక్కులు తయారుచేసి చందాలు వసూలు చేస్తున్నారని చేసిన వ్యాఖ్యల దుమారం చల్లారక ముందే మరోసారి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘ఆ కులం ఆఫీసర్లకు అక్షరం ముక్కరాదు.. ఎక్కడ చూసినా వాళ్లే.. మొత్తం నాశనం చేస్తున్నారు’ అంటూ హన్మకొండలో ఆదివారం జరిగిన ఓసీ జేఏసీ సభలో కొన్ని కులాలను ఉద్దేశించి ధర్మారెడ్డి వ్యా ఖ్యానించారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ సంఘాలు భగ్గుమన్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం ధర్మారెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశాయి. కుల సంఘాల ఆగ్రహంతో ఎమ్మెల్యే.. యూ టర్న్ తీసుకున్నారు. తాను చేసి న వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవి కావని, ఒకవేళ ఎవరి మనసునైనా నొప్పిస్తే వెనక్కి తీసుకుంటూ క్షమాపణ చెబుతున్నానని ధర్మారెడ్డి అన్నారు. (ఎమ్మెల్యే ఇంటిపై దాడి కేసులో 43 మందికి రిమాండ్) ధర్మారెడ్డి తీరు సరికాదు చిన్న కులాలను అవమానించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీరు గర్హనీయమని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్, ఎమ్మార్పీఎస్ నేత పుట్ట రవి, లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్‌సింగ్ నాయక్ పేర్కొన్నారు. (మా ఓపిక నశిస్తే.. బయట తిరగలేరు: కేటీఆర్) -
మా ఓపిక నశిస్తే.. బయట తిరగలేరు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘టీఆర్ఎస్ శ్రేణులను, పార్టీ కార్యకర్తలను కాపాడుకునే శక్తి, బలం, బలగం మాకు ఉన్నాయన్న విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలి. టీఆర్ఎస్ కార్యకర్తల ఓపిక నశిస్తే, బీజేపీ నేతలు కనీసం బయట తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి’అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు హెచ్చరించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ శ్రేణులు చేసిన దాడిని ఖండిస్తూ ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బీజేపీ భౌతిక దాడులను ఎదుర్కొనే శక్తి టీఆర్ఎస్ పార్టీకి ఉందని స్పష్టం చేశారు. చదవండి: (ఎమ్మెల్యే చల్లా ఇంటిపై దాడి.. అట్టుడికిన వరంగల్) ‘మా ఓపికకూ ఒక హద్దు ఉంటుందని ఇప్పటికే బీజేపీని హెచ్చరించినం. అయినా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా సంయమనంతో, ఓపికతో ముందుకుపోతున్నం. టీఆర్ఎస్ ఒక ఉద్యమ పార్టీ అన్న విషయాన్ని బీజేపీ మర్చిపోవద్దు’అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు ఏ మాత్రం చోటు లేదని స్పష్టం చేశారు. తమ వాదనతో ప్రజలను ఒప్పించడం చేతకాక, ఇతర పార్టీలపై భౌతిక దాడులకు పాల్పడుతున్న బీజేపీ తీరును ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాల్సిన అవసరముందని తెలిపారు. గతంలోనూ బీజేపీ భౌతిక దాడులకు పాల్పడిందని గుర్తు చేశారు. రాజకీయాల్లో హేతుబద్ధమైన విమర్శల పరిధిని దాటి, బీజేపీ పదేపదే భౌతిక దాడులకు పాల్పడుతుండటం రాష్ట్ర రాజకీయాలకు ఏ మాత్రం శ్రేయస్కరం కాదన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు తెలంగాణలో కొనసాగాలని టీఆర్ఎస్ కోరుకుంటోందని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెట్టేలా బీజేపీ చేస్తున్న కుటిల ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు గమనించి, బీజేపీని ఎక్కడికక్కడ నిలదీయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. -
ఎమ్మెల్యే చల్లా ఇంటిపై దాడి.. అట్టుడికిన వరంగల్
సాక్షి, హన్మకొండ: బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణలతో వరంగల్ నగరం ఆదివారం అట్టుడికిపోయింది. హన్మకొండ నక్కలగుట్టలోని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిని బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆదివారం ముట్టడించి దాడి చేయగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలోనే హంటర్‌రోడ్డులోని బీజేపీ కార్యాలయంపై టీఆర్ఎస్ నేతలు దాడి చేశారు. ఇటు సుబేదారి పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని స్టేషన్ ఎదుట ఉన్న బీజేపీ నేతల వాహనాలను ధ్వంసం చేశారు. చల్లా వ్యాఖ్యలతో దుమారం.. ఇటీవల రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు బీజేపీ శ్రేణులు దొంగ బుక్కులు తయారు చేసుకుని చందాలు వసూలు చేస్తున్నారంటూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం హన్మకొండ నక్కలగుట్టలోని ఆయన ఇంటిని ముట్టడించారు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు రోప్‌పార్టీతో అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నా ప్రతిఘటించి దూసుకుపోయారు. ఈ క్రమంలో పోలీసులు బలవంతంగా నెట్టేయడంతో కొందరు అక్కడే బైఠాయించారు. వెనుక వైపు నుంచి కొందరు ధర్మారెడ్డి ఇంటిపైకి కోడిగుడ్లు, రాళ్లు, చెప్పులు విసిరారు. దీంతో ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన బీజేపీ కార్యాలయ సామగ్రి పోలీసులు అడ్డుకోగా వారి లాఠీలను లాక్కొని ఇంటిపైకి విసిరారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో దాడికి పాల్పడిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి హన్మకొండలోని సుబేదారి, కాకతీయ యూనివర్సిటీ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఇటు బీజేపీ దాడులకు ప్రతిగా టీఆర్ఎస్ నేతలు హన్మకొండ హంటర్‌రోడ్డులోని బీజేపీ కార్యాలయంపై కర్రలు, రాళ్లతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా వేద బాంక్వెట్ హాల్ ఎదుట ఉన్న తోరణాన్ని ధ్వంసం చేశారు. ఇటు సుబేదారి పోలీసుస్టేషన్ వద్దకు చేరుకుని స్టేషన్ ఎదుట ఉన్న బీజేపీ నేతల వాహనాలపై దాడులు చేశారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సిద్ధం నరేశ్ కారు అద్దాలు పగులకొట్టారు. దీక్ష చేపట్టిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు.. టీఆర్ఎస్ నేతల చర్యను నిరసిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో దీక్ష చేపట్టారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధిగా ఉండి క్షుద్ర పూజలు చేసే మీకు అవతార పురుషుడైన రాముడి గురించి ఏమి తెలుసని ధర్మారెడ్డిని ప్రశ్నించారు. రామ మందిర నిర్మాణానికి భక్తులు సమర్పించే ప్రతి పైసకూ లెక్క ఉందని చెప్పారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న బీజేపీ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సుబేదారి పోలీసు స్టేషన్ ఎదుట బీజేపీ శ్రేణులు ధర్నా చేశారు. ఆదివారం రాత్రి పెద్ద ఎత్తున స్టేషన్‌కు చేరుకున్న నాయకులు, కార్యకర్తలు అక్కడే బైఠాయించారు. రాత్రి 10.20 గంటల వరకు కూడా ధర్నా కొనసాగింది. ఇటు ఎమ్మెల్యే చల్లా ఇంటిపై జరిగిన దాడి ఘనటనపై సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మతో పాటు ఇతర నేతలపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నేతల పరామర్శ చల్లా ఇంటిపై బీజేపీ దాడి ఘటన సమాచారం తెలుసుకున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, మేయర్ గుండా ప్రకాశ్‌రావు తదితరులు ఆయన ఇంటికి చేరుకుని పరిశీలించారు. చల్లా కుటుంబ సభ్యులను పరామర్శించారు. దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇదిలాఉండగా.. వరంగల్ పోలీసు కమిషనర్ ప్రమోద్‌కుమార్ చల్లా ఇంటికి చేరుకుని పరిశీలించారు. పోలీసు ఏసీపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. -
ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. కేటీఆర్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ పరకాల ఎమ్మెల్యే చల్లాధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండిచారు. ఈ మేరకు కేటీఆర్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘మా పార్టీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ శ్రేణులు చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు ఏ మాత్రం చోటు లేదు. ప్రజాస్వామ్యంలో తమ వాదనతో ప్రజలను ఒప్పించడం చేతకాక, ఇతర పార్టీలపైన భౌతిక దాడులు చేస్తూ తమ వాదన వినిపించాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ తీరుని ప్రజాస్వామ్యవాదులు అంతా ఖండించాల్సిన అవసరం ఉన్నది. గతంలోనూ బీజేపీ భౌతిక దాడులకు ప్రయత్నించింది. రాజకీయాల్లో హేతుబద్ధమైన విమర్శలను దాటి, భౌతిక దాడులకు పదే పదే దిగడం తెలంగాణ రాజకీయాలకు ఏ మాత్రం వాంఛనీయం కాదు. (టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు) విలువలతో కూడిన రాజకీయాలు తెలంగాణలో కొనసాగాలని టిఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులను, ప్రతి కార్యకర్తను కాపాడుకునే శక్తి, బలం, బలగం మాకు ఉన్నాయన్న విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఓపిక నశిస్తే, బీజేపీ కనీసం బయట తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుతున్నా. బీజేపీ భౌతిక దాడులను ఎదుర్కొనే శక్తి టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. మా ఓపిక కి ఒక హద్దు ఉంటుందని ఇప్పటికే బీజేపీని హెచ్చరించాం. అయినా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా సంయమనంతో, ఓపికతో ముందుకు పోతున్నాం. టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ అన్న విషయాన్ని బీజేపీ మర్చిపోకూడదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ సమాజంలో చిచ్చు పెట్టేలా బీజేపీ చేస్తున్న కుటిల ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు, సమాజంలోని బుద్ధిజీవులు గమనించి, ఎక్కడికక్కడ నిలదీయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.’ అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. కాగా అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయానికి వసూలు చేసే చందాలను బీజేపీ వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటోందంటూ ధర్మారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ కార్యకర్తలు హన్మకొండలోని ధర్మారెడ్డి ఇంటిపై దాడికి దిగారు. రాళ్లుతో ఇంటి పరిసర ప్రాంతాలను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎమ్మెల్యే నివాసం వద్ద భద్రతను ఏర్పాటు చేశారు. నిరసన కారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి ఘటనను మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండిస్తున్నారు. -
ఇంజనీర్లతో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మీటింగ్
సాక్షి, వరంగల్ : ‘పట్టణ ప్రగతి ద్వారా ఇప్పటి వరకు రూ. 32కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ నిధులతో పాటు సీఎం ప్రత్యేక నిధుల ద్వారా ఎక్కడ పనులు జరుగుతున్నాయి, ఏయే పనులు పూర్తి చేశారు.. మిగతావి ఏ స్థాయిలో ఉన్నాయో బల్దియా ఇంజినీర్లు వెల్లడించాలి. టెండర్లు జరిగి రెండేళ్లు పూర్తయినా కొన్ని పనులు ప్రారంభించడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎందరు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకున్నారు. ఏ వివరాలు అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదు. ఈ పైసలేమైనా మీ అయ్య సొమ్మా?’ అంటూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బల్దియా ఇంజనీర్లపై నిప్పులు చెరిగారు. హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో శుక్రవారం జరిగిన గ్రేటర్ కౌన్సిల్ సమావేశం వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గరంగరంగా సమావేశం వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్‌రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశం వాడీవేడిగా సాగింది. తొలుత ఇటీవల మృతి చెందిన మాజీ కౌన్సిలర్లు వీరస్వామి, ఈశ్వరయ్య, జర్నలిస్టు ప్రవీణ్, టీఆర్ఎస్ నాయకుడు, కార్పొరేటర్ కావేటి కవిత భర్త రాజుకు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్పొరేటర్ల ఒక నెల వేతనాన్ని కార్పొరేటర్ కావేటి కవితకు అందించేందుకు కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం అజెండాలోని 30 అంశాలతో పాటు టేబుల్ అజెండాగా 32 అంశాలను తీసుకుని చర్చించి ఆమోదముద్ర వేశారు. అర్బన్ మలేరియా ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలపై కార్పొరేటర్ బయ్య స్వామి, బోడ డిన్నా మాట్లాడగా, బొంది వాగు నాలా మార్కింగ్‌పై ఎంబాడి రవీందర్ విమర్శించారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష కార్పొరేటర్లు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నారు. ఇంకా ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ ఖాజా సిరాజుద్దీన్‌తో పాటు కోఆప్షన్ సభ్యులు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. 45 డివిజన్లకు రూ. 30కోట్లు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, డ్రెయినేజీల మరమ్మతు కోసం 45 డివిజన్లకు రూ.30కోట్ల జనరల్ ఫండ్ నిధులు కేటాయిస్తూ మేయర్ ప్రకాశ్‌రావు చేసిన ప్రతిపాదనకు సభ్యులు ఆమోదముద్ర వేశారు. దేశంలోనే వరంగల్‌లో అత్యధికంగా వర్షపాతం నమోదు కాగా, పరిహారం కింద రూ. 500కోట్ల మంజూరుకు మంత్రి కేటీఆర్‌కు నివేదించాలనే తీర్మానాన్ని కూడా ఆమోదించా రు. అంతేకాకుండా ప్రతీ డివిజన్‌కు రూ.5లక్షలు నామినేషన్ కింద నిధులు మంజూరు చేస్తున్నట్లు మేయర్ వెల్లడించారు. ఇక నెలకు రెండుసార్లు కౌన్సిల్ సమావేశం ఏర్పాటుచేస్తామని, ఇందులో భాగంగా వచ్చే నెల 16న కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. -
‘చల్ల’గా చరిత్ర తిరగరాశారు..
సాక్షి, వరంగల్ రూరల్: పోరాటాల గడ్డగా పేరుగాంచిన పరకాల నియోజకవర్గం సంచనాలకు కేంద్ర బిందువు. నియోజకవర్గ ప్రజల తీర్పు 29 యేళ్ల తరువాత మళ్లీ రెండో సారి ఒకే వ్యక్తికి పట్టంకట్టారు. 1952లో ఏర్పడిన పరకాల నియోజకవర్గంలో నాటి నుంచి నేటి వరకు ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రమే రెండు సార్లు గెలిచే అవకాశం దక్కింది. 2018 ఎన్నికల్లో 46,519 ఓట్ల మెజార్టీతో చల్లా ధర్మారెడ్డి గెలుచి మూడో వ్యక్తిగా నిలిచాడు. 2014లో పరకాల ఎమ్మెల్యేగా చల్లా ధర్మారెడ్డి గెలుపొందారు. 1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బొచ్చు సమ్మయ్య విజయం సాధించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో సమ్మయ్య రెండోసారి విజయం సాధించి మంత్రి పదవిని దక్కించుకున్నారు. 1985లో బీజేపీ నుంచి ఒంటేరు జయపాల్ గెలుపొందగా 1989లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి జయపాల్‌ను విజయం వరించింది. నియోజకవర్గ ఆవిర్భావం నుంచి ఒక్కొక్కరు ఒకేసారి ప్రాతినిధ్యం వహించగా సమ్మయ్య, జయపాల్, చల్లా ధర్మారెడ్డిలే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. భారీ మెజార్టీ సాధించిన ధర్మారెడ్డి.. పరకాల నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి 46వేల మెజార్టీతో గెలుపొందడం ఇదే తొలి సారి. గతంలో రెండో సారి గెలుపొందిన ఎమ్మెల్యేల్లో సైతం చల్లా ధర్మారెడ్డికి వచ్చిన మెజార్టీ ఎవరికి రాలేదు. 1989లో 1600, 1985లో 17,132 ఓట్లతో జయపాల్ గెలుపొందారు. 1978లో 8,787, 1983లో 7,295 ఓట్లతో సమ్మయ్య గెలుపొందారు. 2014లో 9,108, 2018లో 46,519 ఓట్ల మెజార్టీతో చల్లా ధర్మారెడ్డి గెలుపొందారు. పరకాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు.. పరకాల నియోజకవర్గ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 13 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారు. 1952లో గోపాల్‌రావు (పీడీఎఫ్), 1957లో కె.ప్రకాష్‌రెడ్డి (కాంగ్రెస్), 1962లో ఆర్.నర్సింహరామయ్య (కాంగ్రెస్), 1967లో సీహెచ్. జంగారెడ్డి (బీజేపీ), 1972లో పి. ధర్మారెడ్డి (కాంగ్రెస్), 1978లో బొచ్చు సమ్మయ్య (కాంగ్రెస్), 1983లో బి.సమ్మయ్య (కాంగ్రెస్), 1985లో ఒంటేరు జయపాల్ (బీజేపీ), 1989లో ఒంటేరు జయపాల్ (బీజేపీ), 1994లో పోతరాజు సారయ్య (సీపీఐ), 1999లో బొజ్జపెల్లి రాజయ్య (టీడీపీ), 2004లో బండారి శారారాణి (టీఆర్ఎస్), 2009లో కొండా సురేఖ (కాంగ్రెస్), 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో మొలుగూరి బిక్షపతి (టీఆర్ఎస్) తరపున గెలిచిన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో చల్లా ధర్మారెడ్డి (టీడీపీ), 2018లో చల్లా ధర్మారెడ్డి(టీఆర్ఎస్) విజయం సాధించారు. -
చల్లా ధర్మా రెడ్డితో లీడర్
-
చంద్రబాబు తెలంగాణ ద్రోహి: చల్లా ధర్మా రెడ్డి
-
బాత్రూమ్లో జారిపడిన తాజా మాజీ ఎమ్మెల్యే
సాక్షి, పరకాల : బాత్ రూమ్‌లో స్నానం చేస్తుండగా పరకాల తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కింద పడిపోయారు. తలకి గాయం అవ్వడంతో వెంటనే కుటుంబ సభ్యులు హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచనతో హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. -
‘కేసీఆర్ సింహం.. విపక్ష నేతలు పందులు!’
గీసుకొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ సింహమని, ప్రతిపక్ష పార్టీల నాయకులు పందులు అని పరకాల తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం రెడ్డిపాలెంలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. పరకాల నుంచి పోటీ చేయడానికి ఎవరో వస్తున్నారని చెబుతున్నారని, వారికి దమ్ము, ధైర్యం ఉంటే ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఆయన పరోక్షంగా కొండా దంపతులకు సవాల్ విసిరారు. అన్ని సర్వేల్లోనూ తానే గెలుస్తానని టాప్ ర్యాంకుల్లో ఉన్నట్లు వివరించారు. -
పరకాల మునిసిపల్ చైర్మన్‌పై వీగిన అవిశ్వాసం
సాక్షి, వరంగల్ రూరల్: పరకాల పురపాలక సంఘ చైర్మన్, వైస్ చైర్మన్లపై అధికార పార్టీ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. ఈ నెల 5వ తేదీన 14 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు కలెక్టర్‌కు అందజేశారు. అయితే.. అదేరోజు చైర్మన్ రాజభద్రయ్య టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరారు. కాగా, గురువారం అవిశ్వాస పరీక్ష కోసం నిర్వహించిన సమావేశంలో అధికార పార్టీ కౌన్సిలర్లు సైతం హాజరు కాలేదు. కోరం లేని కారణంగా పరకాల పురపాలక సంఘం చైర్మన్ రాజభద్రయ్యపై అవిశ్వాసం వీగినట్లు ఆర్డీఓ మహేందర్‌జీ ప్రకటించారు. ఇదే తరహాలో వైస్‌చైర్మన్ రమ్యకృష్ణపై పెట్టిన అవిశ్వాస తీర్మానం కూడా వీగిపోయింది. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి షాక్ ఇచ్చినట్లయింది. -
ఎమ్మెల్యే ‘చల్లా’ క్షమాపణ చెప్పాలి
వరంగల్ రూరల్ : కలెక్టరేట్ సూపరింటెండెట్, తహసీల్దార్ జి.సదానందం, నర్సంపేట తహసీల్దార్ పూల్ సింగ్‌పై అనుచితంగా ప్రవర్తించిన పరకాల ఎమ్యెల్యే చల్లా ధర్మారెడ్డి వారికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని గెజిటెడ్ అధికారుల సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు జగన్మోహన్రావు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. భవిష్యత్ ఉద్యమ కార్యచరణను శనివారం ప్రకటిస్తామని స్పష్టం చేశారు. సదానందం, పూల్ సింగ్‌పై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, అతడి గన్‌మెన్, పరకాల జెడ్పీటీసీ పాడి కల్పానాదేవి భర్త పాడి ప్రతాప్‌రెడ్డి అనుచితంగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు తహసీల్ కార్యాలయాల ఎదుట మధ్యాహ్న భోజన సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళనలు నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట జిల్లాలోని తహసీల్దార్లు, కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులు, ట్రెస్సా నాయకులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా ఈ-సెక్షన్ సూపరింటెండెంట్, తహసీల్దార్ జి.సదానందం మాట్లాడుతూ తాను లంచం అడిగినట్టు ఎమ్మెల్యే చేసిన ఆరోపణలో నిజం లేదని, కావాలని తాను ఫైల్ విషయంలో జాప్యం చేయలేదన్నారు. నర్సంపేట తహసీల్దార్ పూల్ సింగ్ మాట్లాడుతూ సదానందంతోపాటు తనపై ఎమ్మెల్యే ధర్మారెడ్డి, ఆయన ఇద్దరు గన్మెన్లు, పరకాల జెడ్పీటీసీ సభ్యురాలు పాడికల్పనా దేవి, ఆమె భర్త పాడి ప్రతాపరెడ్డి, ఇద్దరు ఎమ్యేల్యే గన్మెన్లు దాడి చేశారని ఆరోపించారు. నిరసన ప్రదర్శనలో ట్రెస్సా జిల్లా అధ్యక్షుడు పి.సత్యనారాయణ, అసోసియేట్ ప్రెసిడెంట్ కె.సత్యనారాయణ, కార్యదర్శి కె.విక్రమ్‌కుమార్, టీఎన్జీఓల సంఘం కార్యదర్శి షఫీ, రత్నవీరాచారి, టీఈఏ అధ్యక్షుడు కె.యాదగిరి, టీఎస్ఎస్ఏ అధ్యక్షుడు కె.రమేష్, టీజీటీఏ అధ్యక్షులు రాంమూర్తి, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షుడు రమేష్, జిల్లా అధ్యక్షురాలు సుహసిని, టీఆర్ఈఎస్ఏ ఆర్గనైజింగ్ రాష్ట్ర కార్యదర్శి జగన్మోహన్రెడ్డి, టీఆర్ఈఎస్ఏ నాయకులు ఫణికుమార్, టీజీటీఏ అసిస్టెంట్ ప్రెసిడెంట్ పూల్ సింగ్, టీఈఏ అధ్యక్షుడు వేణుగోపాల్, ఎంఈడబ్ల్యూఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ.రియాజ్, ఆఫీస్ సబార్డినేట్ యాకుబ్ తదితరులు పాల్గొన్నారు. -
తహసీల్దార్లపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు
వరంగల్ రూరల్ : ఇద్దరు తహసీల్దార్లపై పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెస్సా) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరితకు ఫిర్యాదు చేశారు. ఒక ఫైల్ విషయంలో చర్చించడానికి వచ్చిన ఎమ్మెల్యే.. కలెక్టరేట్ ఈ-సెక్షన్ సూపరింటెండెంట్, తహసీల్దార్ జి.సదానందం, నర్సంపేట తహసీల్దారు ఫూల్‌సింగ్‌ను దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నర్సంపేట తహసీల్దారు ఈ మొత్తం సంఘటనను వీడియో తీసినందుకు అతడిపై పరకాల జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పానాదేవి భర్త పాడి ప్రతాపరెడ్డి, ఎమ్మెల్యే గన్‌మెన్ చేయి చేసుకున్నారని తెలిపారు. ఈ విషయంలో కలెక్టరేట్ జీ-సెక్షన్ ఉద్యోగులు, సిబ్బంది సాక్షులుగా ఉన్నారని, సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో నెక్కొండ తహసీల్దార్ విశ్వనారాయణ, రాయపర్తి తహసీల్దార్, ట్రెస్సా ఉపాధ్యక్షుడు రాంమూర్తి, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ పీఎస్.ఫణికుమార్ ఉన్నారు. కాగా, కలెక్టర్ హరితపై ఇటీవల నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. -
పరకాల ఎమ్మెల్యే కుటుంబానికి కోయదొరల టోకరా
-
లైన్ క్లియర్
► స్టోరేజ్ ట్యాంకు లేకుండానే కోనాయమాకుల ఎత్తిపోతల పథకం ► రైతులకు ఇబ్బందులు రాకుండా ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు ► అన్నీ కుదిరితే నవంబర్‌లో పంటచేలకు నీరు ► పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వెల్లడి గీసుకొండ(పరకాల): పెండింగ్‌లో ఉన్న కోనాయమాకుల ఎత్తిపోతల పథకాన్ని త్వరలో పూర్తి చేయడానికి లైన్ క్లియర్ అయినట్లు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. సోమవారం హన్మకొండలోని తన నివాసంలో మండలంలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధలు, నాయకులతో కలిసి విలేకర్ల సమావేశంలో ఎత్తిపోతల పథకంలో చేపట్టిన మార్పుల గురించి వివరించారు. 2008లో అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిన కోనాయమాకుల ఎత్తిపోతల పథకంలో అనేక లోపాలు ఉన్నాయన్నారు. వాటిని సరిచేసి రైతులకు ఇబ్బం ది లేకుండా పలు మార్పులు చేసి త్వరగా పూర్తి చేసేలా మంత్రి హరీష్‌రావు, సీఎం కేసీఆర్‌ను ఒప్పించామన్నారు. అన్నీ కుదిరితే నవంబర్ నాటికి ప్రాజెక్టు పనులను పూర్తి చేసి కాల్వ ద్వారా చేలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ముందుగా అనుకున్న విధంగా మనుగొండ నర్సింహ చెరువును స్టోరేజ్ ట్యాంకుగా మార్చి అక్కడి నుంచి నీటిని విడుదల చేయాలని అప్పటి అధికారులు డిజైన్ చేశారని పేర్కొన్నారు. వాస్తవాలను పరిశీలిస్తే నర్సింహ చెరువులో కేవలం 0.067 టీఎంసీల నీరు నిల్వచేసే వీలుందని, అ నీటిని నాలుగున్నర రోజుల్లోనే పంప్ చేయవచ్చని తెలిపారు. మండలంతో పాటు సంగెం, దుగ్గొండి, చెన్నారావుపేట మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన 14,500 ఎకరాలకు సాగు నీరు అందించడానికి నర్సింహచెరువులో నిల్వ చేసే నీరు సరిపోదని గుర్తించి త్రిసభ్య కమిటీ ద్వారా ప్రభుత్వానికి విషయాలను నివేదించామని వివరించారు. నివేదిక ఆధారంగా ప్రాజెక్టులో మార్పులు చేసి కాకతీయ ప్రధాన కాల్వ నుంచి నీటిని లిఫ్ట్ చేసి పంటచేలకు తరిలించేలా డిజైన్ చేశామని, దీని ద్వారా ప్రభుత్వానికి రూ.30 కోట్ల ఆదా అవుతుందన్నారు. కొనాయమాకుల వద్ద ఉన్న కాకతీయ ప్రధాన కాల్వ రోడ్డు బ్రిడ్జి సమీప విద్యుత్ సబ్‌స్టేషన్ వెనక 6 ఎకరాల స్థలంలో పంప్‌హౌస్ నిర్మించి, కాల్వ నీటిని అందులోకి లిఫ్ట్ చేస్తారని వివరించారు. ఇప్పటికే కొంత మేర తవ్విన కాల్వ పనులను పూర్తిచేసి దాని ద్వారా నేరుగా పంట చేలకు నీరందిస్తామన్నారు. నర్సింహచెరువు ఆయకట్టు రైతులు తమ భూములు పోతాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి ఇబ్బందులు రాకుండానే ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు చేసినట్లు చెప్పారు. కేవలం రూ.34 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని, కాల్వ భూసేకరణ విషయంలో తాజా భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారం అందిస్తామన్నారు. కాకతీయ ప్రధాన కాల్వ 234 కిలోమీటరు నుంచి 248 కిలోమీటరు వరకు సుమారు 14 కిలోమీటర్ల మేర పూడికతీత, మరమ్మతుల కోసం రూ.8 కోట్ల అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఆయన వెంటన జెడ్పీటీసీ ఆంగోతు కవిత, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోలీస్ ధర్మారావు, నాయకులు ముంత రాజయ్యయాదవ్, సుంకరి శివ, మాధవరెడ్డి, రాంబాబు, మహబూబ్‌నాయక్ తదితర నాయకులు పాల్గొన్నారు. -
అభివృద్ధి కోసమే పార్టీ మారాం
సంగెం : తమను నమ్ముకున్న క్యాడర్, నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారామని పాలకుర్తి, పరకాల ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని ఎల్గూర్‌స్టేçÙన్ మాజీ సర్పంచ్ జీజుల సమ్మయ్య తల్లి లక్ష్మి, కొత్తగూడెం సర్పంచ్ వాసం సాంబయ్య తండ్రి వాసం వీరస్వామి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. బుధవారం ఇద ్దరు ఎమ్మెల్యేలు వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. కేసీఆర్ సారథ్యం లో నియోజకవర్గాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ఉండేలా కృషి చేస్తామని అన్నారు. ఎమ్మెల్యేల వెంట సర్పంచ్‌లు రంగరాజు నర్సింహస్వామి, మాదినేని రాంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కిషన్‌నాయక్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, సుదర్శన్‌రెడ్డి, నరహరి, ఉండీల రాజు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
పరకాల ఎమ్మెల్యేకు ‘కొత్త’ కష్టాలు
టీఆర్ఎస్లో ఆదరణపై సందేహాలు చేరిక కార్యక్రమానికి ముఖ్యనేతలు డుమ్మా ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షుడు గైర్హాజరు సాక్షి ప్రతినిధి, వరంగల్ : అధికార పార్టీలో చేరిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి ప్రాధాన్యత పరంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలందరూ ధర్మారెడ్డికి దూరంగానే ఉంటున్నారు. నెల రోజుల క్రితమే టీడీపీకి దూరమైన ధర్మారెడ్డి మూడు రోజుల క్రితం టీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖరరావు స్వయంగా ధర్మారెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ధర్మారెడ్డి చేరిక కార్యక్రమానికి జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఒక్కరు కూడా హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, పరకాలకు చెందిన పార్టీ ముఖ్యనేతలు మొలుగూరి భిక్షపతి, ముద్దసాని సహోదర్‌రెడ్డి మాత్రమే ధర్మారెడ్డి చేరిక కార్యక్రమంలో పాల్గొన్నారు. సహోదర్‌రెడ్డి కూడా ఆఖరి నిమిషంలో హాజరుకావాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వీరు ముగ్గురు తప్పా జిల్లాలోని ప్రజాప్రతినిధుల్లో ఏ ఒక్కరూ చేరిక కార్యక్రమానికి వెళ్లలేదు. ప్రాధాన్యతపై సందేహాలు ప్రస్తుతం జిల్లాలో టీఆర్ఎస్ తరుఫున ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఇటీవలే టీఆర్ఎస్లో చేరారు. భూపాలపల్లి ఎమ్మెల్యే మధుసూదనచారి స్పీకర్ పదవిలో ఉండడంతో రాజకీయ కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం లేదు. స్పీకర్‌ను మినహాయిస్తే మిగిలిన వారు హాజరుకావాల్సి ఉంది. ప్రజాప్రతినిధులతోపాటు జిల్లాకు చెందిన ముఖ్య నేతలు ధర్మారెడ్డికి టీఆర్ఎస్లో ప్రాధాన్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఈ కార్యక్రమానికి రాకపోవడానికి కారణాలు ఏమిటనేది ధర్మారెడ్డి వర్గీయులు చర్చించుకుంటున్నారు. ‘డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఈ నెల 4న టీఆర్ఎస్లో చేరినప్పుడు ఎ.చందులాల్, కొండా సురేఖ మినహా మిగిలిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ధర్మారెడ్డి చేరికకు మాత్రం ఒక్క ఎమ్మెల్యే రాలేదు. మేం భారీగా జనసమీకరణతో వెళ్లినా.. అక్కడ జరిగిన కార్యక్రమం సంతృప్తికరంగా లేదు’ అని ధర్మారెడ్డికి సన్నిహితంగా ఉండే పరకాల నేతలు చర్చించుకుంటున్నారు.చేరిక సమయంలోనే ఇలా ఉంటే భవిష్యత్తులో ఎలా ఉంటుం దని వీరు అనుకుంటున్నారు. సొంత నియోజకవర్గాల్లో కార్యక్రమాలతో జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి కార్యక్రమానికి రాలేదని ధర్మారెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. చివరకు చేరిక.. సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవాను ఎదుర్కొని ధర్మారెడ్డి పరకాల ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం మారిన పరిణామాలతో టీడీపీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌తో కలిసి ధర్మారెడ్డి అక్టోబరు 9న సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. వీరు ముగ్గురు టీఆర్ఎస్లో చేరడం ఖరారైంది. ధర్మారెడ్డి మరుసటి రోజు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రకటన చేసిన వారంలోపే ఆయన టీఆర్ఎస్లో చేరుతారని భావించారు. పరకాలకు చెందిన టీఆర్ఎస్ ముఖ్యనేతలు కొందరు ఆయన చేరికపై అసంతృప్తి వ్యక్తం చేయడం, ఇతర రాజకీయ కారణాలతో కార్యక్రమం వాయిదా పడింది. శ్రీనివాస్‌యాదవ్, తీగల కృష్ణారెడ్డి, గంగాధర్‌గౌడ్‌లు అక్టోబరు 29న కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. తీగల కృష్ణారెడ్డి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత ధర్మారెడ్డి కూడా పరకాలలో సభను నిర్వహించి కేసీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరాలని భావించారు. జిల్లాలోని టీఆర్ఎస్ నేతలు కొందరు దీనిని అడ్డుకున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే చేరిక కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ఇంత దూరం రావాల్సిన అవసరంలేదని చెప్పడంతో పరకాల సభ ప్రతిపాదన అంతటితో ఆగింది. ఆ తర్వాత ధర్మారెడ్డి నవంబర్ 2న టీఆర్ఎస్లో చేరుతారని ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఛత్తీస్‌గఢ్ పర్యటనతో ఇది వాయిదా పడింది. చివరికి ఈ నెల 9న ధర్మారెడ్డి టీఆర్ఎస్లో చేరారు. సాధారణ ఎన్నికల్లో పరకాలలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సహోధర్రెడ్డిని ఒక్క రోజు ముందే ధర్మారెడ్డి కలిశారు. ఇది జరగకుంటే సహోదర్‌రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉండేవారని పరకాల టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. పరకాలకు గతంలో ప్రాతినిథ్యం వహించిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ దంపతులు కూడా ధర్మారెడ్డి చేరిక కార్యక్రమానికి వెళ్లలేదు. ధర్మారెడ్డి మిగిలిన వారితో సమన్వయం చేసుకోలేకపోవడం వల్లే ఆయన టీఆర్ఎస్లో చేరిక కార్యక్రమానికి ప్రాధాన్యత లేకుండా పోయిందని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. అందరిని కలుపుకునిపోతే బాగుండేదని ధర్మారెడ్డి వర్గీయులూ అంటున్నారు. -
టీఆర్ఎస్లో చల్లా చేరిక నేడే..
పరకాల : ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి లాంఛనప్రాయంగా ఆదివార ం టీఆర్ఎస్లో చేరనున్నారు. టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో తరలివెళ్లి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల 2వ తేదీనే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించినప్పటికీ సీఎం ఛత్తీస్‌గఢ్ పర్యటన నేపథ్యంలో చేరిక తేదీ 9కి వాయిదా పడింది. దీంతో జనసమీకరణ కోసం టీడీపీ, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీలు వేసి నాయకులు, కార్యకర్తల మధ్య సర్ధుబాటు చేశారు. నియోజకవర్గం నుంచి 15 వేల మందితో హైదరాబాద్‌కు కాన్వాయ్‌గా వెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరకాల, ఆత్మకూరు, గీసుకొండ, సంగెం మండలాల్లో 103 గ్రామాలుండగా 200 వాహనాలను సమకూర్చారు. టీడీపీ చెందిన ఒక జెడ్పీటీసీ సభ్యుడు, ఇద్దరు ఎంపీపీలు, 33మంది ఎంపీటీసీ సభ్యులు, 41మంది సర్పంచ్‌లతో పార్టీలో చేరుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పరకాలకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్లోకి వచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేసినప్పటికీ ఇటు టీడీపీ, అటు టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిసింది. ఆ ఇద్దరు నాయకులు తరచూ పార్టీ మారే అలవాటు ఉందని తమతో వచ్చి ఇందులో ఉంటారనే నమ్మకం లేదనే వాదనను ఎమ్మెల్యేకు వివరించారు. దీంతో ఆయన వారి విషయంలో వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా ఎమ్మెల్యే వెంట నడిచేదెవరు..సొంతగూటిలోనే ఉండిపోయేది ఎవరో ఆదివారం మధ్యాహ్న కల్లా తేలిపోనుంది. -
చల్లగా సర్దుకుని..
టీఆర్ఎస్లోకి ఎమ్మెల్యే ధర్మారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ వారం లోపు చేరే అవకాశం పరకాల కేడర్ అంతా ఆయన వెంటే.. జిల్లాలో టీడీపీకి గట్టి దెబ్బ ఇక ఆ పార్టీకి మిగిలింది ఒక్కరే.. సాక్షి ప్రతినిధి, వరంగల్ : సాధారణ ఎన్నికల్లో జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి కొంతవరకు పట్టు నిలుపుకున్న టీడీపీకి నాలుగు నెలల్లోనే గట్టి దెబ్బ పడుతోంది. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి టీడీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వారంలోపే అధికార పార్టీ టీఆర్ఎస్లో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, టి.ప్రకాశ్‌గౌడ్, తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌తో కలిసి ఆయన గురువారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. అనంతరం వీరి తరఫున శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటిం చారు. అక్కడే ఉన్న చల్లా ధర్మారెడ్డి ఈ విషయాన్ని ఖండించ లేదు. దీన్నిబట్టి ధర్మారెడ్డి సైతం తలసానితోనే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గురువారం సాయంత్రం చల్లా ధర్మారెడ్డితో మాట్లాడారు. ఆ తర్వాత కూడా ధర్మారెడ్డి పార్టీ మారబోనని చెప్పలేదు. ఈ మేరకు ధర్మారెడ్డి టీఆర్ఎస్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. పరకాల నియోజకవర్గంలోని మెజారిటీ టీడీపీ కేడర్ ఆయనతో వెళ్లే పరిస్థితి ఉంది. స్వతహాగా కాంట్రాక్టర్ అయిన చల్లా ధర్మారెడ్డి అధికార పార్టీలోకి మారుతాడని ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. ధర్మారెడ్డి మాత్రం దీన్ని ఖండిస్తూ వస్తున్నారు. ‘టీడీపీని వీడే ప్రసక్తేలేదు. టీడీపీని వదిలి టీఆర్ఎస్లో చేరుతున్న వారు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరా చేయలేని కేసీఆర్... చంద్రబాబును తప్పుబట్టడం సరికాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలలైనా ఒక్క సమస్యను పరిష్కరించలేదు. తెలంగాణ సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ గుప్పించిన కేసీఆర్ సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారు’ అని హన్మకొండలోని తన నివాసంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అన్నారు. పరకాల నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఇదే రకంగా మాట్లాడారు. ఇంతగా మాట్లాడి ఒక్క రోజులోనే టీఆర్ఎస్లో చేరేందుకు సన్నద్ధమవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక చల్లా ధర్మారెడ్డిది శాయంపేట మండలం ప్రగతి సింగారం. 2008లో టీడీపీలో క్రీయాశీలక పాత్ర వహించారు. 2009లో టీడీపీ పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు చేపట్టారు. 2012 జూన్‌లో పరకాల నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో 30 వేల ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ముద్దసాని సహోదర్‌రెడ్డిపై 9,225 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్‌గా ఉన్నారు. అప్పుడు, ఇప్పుడు అధికార పార్టీ వారికి దగ్గరగా ఉండే తత్వం ధర్మారెడ్డిది అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. -
మండల పరిషత్‌లో పై‘చేయి’
సాక్షి ప్రతినిధి, వరంగల్ : మండల ప్రజా పరిషత్ పోరు ముగిసింది. చెదురుమదురు సంఘటనలు మినహా 42 మండలాల్లో ఎంపీపీ పదవులకు శుక్రవారం ఎన్నికలు పూర్తయ్యాయి. కాంగ్రెస్ అత్యధికంగా 17 మండల ప్రజాపరిషత్ పీఠాలను కైవసం చేసుకుంది. జిల్లాలో 50 మండలాలు ఉండగా... రిజర్వేషన్ విషయంలో హైకోర్టు ఆదేశాలతో మంగపేట ఎంపీపీ ఎన్నిక వారుుదా పడింది. మిగిలిన 49 మండల ప్రజాపరిషత్‌లకు గాను.. శుక్రవారం 42 మండలాల్లో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్- 17, టీఆర్ఎస్-14, టీడీపీ-7, స్వతంత్ర అభ్యర్థులు-3, న్యూడెమోక్రసీ ఒక ఎంపీపీ పదవిని కైవసం చేసుకుంది. స్వతంత్రులుగా గెలిచిన ఎంపీపీల్లో ఒకరు టీఆర్ఎస్, మరొకరు టీడీపీలో చేరే పరిస్థితి ఉంది. వరుస ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలతో నిర్వేదంలో ఉన్న కాంగ్రెస్‌కు ఎంపీపీ ఎన్నికలు ఊరటనిచ్చారుు. మెజారిటీ సీట్లు దక్కడంతో ఆ పార్టీ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఎన్నికలు వాయిదా పడిన 8 మండలాల్లో మెజారిటీ ఎవరికి వస్తుందనే దాన్ని బట్టి జిల్లా లో పార్టీల ఆధిక్యంపై స్పష్టత రానుంది. కాగా, ఎంపీపీ ఎన్నిక క్రమంలో లింగాలఘణపురంలో పోలీసులు, సర్పంచ్ మధ్య ఘర్షణ జరిగింది. గీసుగొండలో సైతం పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఎంపీడీఓ కార్యాలయ సమీపంలోని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వాహనంపై టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగాయి. అక్కడ ఉన్న గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయూల్సి వచ్చింది. ఏడు మండలాల్లో వారుుదా... కో ఆప్టెడ్ సభ్యుడి ఎన్నిక జరిగితేనే మరుసటి రోజు ఎంపీపీ పదవికి ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంటుంది. వివిధ కారణాలతో జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్, హన్మకొండ, వెంకటాపురం, జనగామ, మహబూబాబాద్, నల్లబెల్లి మండలాల్లో కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక జరగలేదు. ఈ ఆరు మండలాల్లో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది ఎన్నికల సంఘం ప్రకటించనుంది. * స్టేషన్‌ఘన్‌పూర్‌లో కో ఆప్టెడ్ సభ్యుడి ఎన్నిక కోసం దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో సంతకాలు లేవు. అధికారులు తిరస్కరించడంతో ఇక్కడ ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. * హన్మకొండలో ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. ఒకరు టీఆర్ఎస్, మరొకరు కాంగ్రెస్ తరఫున గెలిచారు. కో ఆప్టెడ్ సభ్యుడి ఎన్నిక కోసం దాఖలు చేసిన నామినేషన్‌కు ఒక ఎంపీటీసీ సభ్యుడు ప్రతిపాదిస్తే, మరొకర సభ్యుడు బలపరచాల్సి ఉంటుంది. ఇక్కడ దాఖలైన ఒక నామినేషన్లో ఒకే ఎంపీటీసీ సభ్యుడి సంతకం ఉండగా... అధికారులు తిరస్కరించడంతో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. * వెంకటాపురంలో కో ఆప్టెడ్ సభ్యుడి ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు కాకపోవడంతో ఎంపీపీ ఎన్నిక జరగలేదు. * జనగామలో ఎంపీటీసీ సభ్యులు వచ్చినప్పటికీ వారి మధ్య వాగ్వాదం జరగడంతో ఎన్నిక జరగలేదు.సమావేశానికి వచ్చిన సభ్యులు రెండు గం టల వరకు సంతకాలు చేయలేదు. స్వతంత్ర స భ్యుడిని తీసుకువెళ్లేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రయత్నించడంతో కార్యకర్తలు గుమిగూడారు. పోలీసుల లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. * మహబూబాబాద్‌లో కో ఆప్టెడ్ సభ్యుడి ఎన్నిక కోసం నామినేషన్ దాఖలైనా... ఎంపీటీసీ సభ్యు లు సమావేశానికి రాకపోవడంతో ఎన్నిక వాయి దా పడింది. * నల్లబెల్లిలో కో ఆప్టెడ్ సభ్యుడి ఎన్నికకు దాఖలైన రెండు నామినేషన్లు తిరస్కరణకు గురవడంతో ఎన్నిక జరగలేదు. * కో ఆప్టెడ్ సభ్యుడి ఎన్నిక జరిగిన దుగ్గొండిలో ఎంపీటీసీల కోరం లేక ఎంపీపీ ఎన్నిక శనివారానికి వాయిదా పడింది.