
గీసుకొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ సింహమని, ప్రతిపక్ష పార్టీల నాయకులు పందులు అని పరకాల తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం రెడ్డిపాలెంలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు.
పరకాల నుంచి పోటీ చేయడానికి ఎవరో వస్తున్నారని చెబుతున్నారని, వారికి దమ్ము, ధైర్యం ఉంటే ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఆయన పరోక్షంగా కొండా దంపతులకు సవాల్ విసిరారు. అన్ని సర్వేల్లోనూ తానే గెలుస్తానని టాప్ ర్యాంకుల్లో ఉన్నట్లు వివరించారు.