![KTR defamation petition hearing in nampally special court updates](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/10/23/ktr.jpg.webp?itok=QEOUqf95)
హైదరాబాద్, సాక్షి: మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇవాళ (బుధవారం) నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ జరిపింది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువునష్టం దావా పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
ఈనెల 30న కౌంటర్ ఫైల్ చేస్తామని మంత్రి కొండా సురేఖ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం వకాలత్ దాఖలు చేశారు. దీంతో తదుపరి విచారణను కోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది. మరోవైపు నాగార్జున.. కొండా సురేఖపై వేసిన పరువు నష్టం కేసు వేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే నాగార్జున స్టేట్‌మెంట్‌ను కోర్టు రికార్డు చేసింది.
చదవండి: కొండా సురేఖపై పరువు నష్టం కేసు.. ఇదొక గుణపాఠం కావాలి: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment