
సాక్షి,హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం నేపథ్యంలో సినీ ప్రముఖులకు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని కోరారు.
మంత్రి సురేఖ భేషరతుగా వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు. ఇరు వైపులా మహిళలు ఉన్నారు..కావునా ఈ విషయాన్ని ఇంతటితో ముగింపు పలకాలని అన్నారు. మహిళల మనోభావాలను కించపరచాలని ఆమె ఉద్దేశం కాదు.
కొండా సురేఖ ట్వీట్‌లో వారు హీరోయిన్‌గా ఎదిగిన తీరు కేవలం అభిమానం మాత్రమే కాదు నాకు ఆదర్శమని స్పష్టం చేశారు. ఒక సోదరుడు సోదరికి నూలు దండ వేస్తే ఆమెపై సోషల్ మీడియాలో చేసిన ట్రోల్ చూశాము. సమాజంలో ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడకండి. మా కాంగ్రెస్ నాయకులు మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా.. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment