టీఆర్‌ఎస్‌లో చేరేముందు హామీయిచ్చా.. | Devireddy Sudheer Reddy Says Stick to Resignation Decision | Sakshi
Sakshi News home page

రాజీనామాకు కట్టుబడి ఉన్నాను

Published Sat, Sep 14 2019 10:44 AM | Last Updated on Sat, Sep 14 2019 10:52 AM

Devireddy Sudheer Reddy Says Stick to Resignation Decision - Sakshi

ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ‘నేను టీఆర్‌ఎస్‌లో చేరేముందు బీఎన్‌రెడ్డినగర్‌ రిజిస్ట్రేషన్స్, ఆస్తిపన్ను తగ్గింపు తదితర సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చాను. లేని పక్షంలో శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించాను. నేను చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాన’ని ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా మాట్లాడారు.

జూన్‌ 7 వరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో సమస్యలపై చర్చించేందుకు వీలుకాలేదన్నారు. కోడ్‌ ముగిసిన తర్వాత సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచానన్నారు. ఈ ఆరు నెలల్లో సమస్యలు పరిష్కారం కాని పక్షంలో రాజీనామాకు వెనుకాడబోనన్నారు. ఇప్పటికే ఈ సమస్యలపై అధికారులతో పలుసార్లు చర్చించానని, ఈ నెల 16న మంత్రి కేటీఆర్‌ సమక్షంలో మరోసారి సమీక్ష సమావేశం జరగనుందని చెప్పారు. దాదాపు 90శాతం సమస్యలు పరిష్కార దశలో ఉన్నాయని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement