టీఆర్‌ఎస్‌ కొంపముంచిన డమ్మీ అభ్యర్థి! | GHMC Elections 2020 Results BN Reddy Recounting | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ కొంపముంచిన డమ్మీ అభ్యర్థి!

Published Fri, Dec 4 2020 7:58 PM | Last Updated on Sat, Dec 5 2020 5:45 AM

GHMC Elections 2020 Results BN Reddy Recounting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలు చివరి దశకు చేరుకున్నాయి. రెండు చోట్ల ఫలితం వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌-56, బీజేపీ-47, ఎంఐఎం-43, కాంగ్రెస్‌-2 చోట్ల విజయం సాధించగా, మరో రెండుచోట్ల బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇకపోతే, బీఎన్‌ రెడ్డి నగర్‌లో రీ కౌంటింగ్‌ జరిగింది. తొలుత టీఆర్‌ఎస్‌ అభ్యర్థి లక్ష్మీ ప్రసన్నపై బీజేపీ అభ్యర్థి లచ్చిరెడ్డి 10 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే దీనిపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రీకౌంటింగ్ కోసం డిమాండ్ చేయడంతో అక్కడ రీకౌంటింగ్‌‌ జరిపారు. రీకౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి 32 ఓట్లతో విజయం సాధించినట్టు ప్రకటించారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే టీఆర్‌ఎస్‌ డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వ్యక్తికి 39 ఓట్లు పడ్డాయి. టీఆర్‌ఎస్‌ అసలు అభ్యర్థికి రావాల్సిన ఓట్లు డమ్మి అభ్యర్థికి పడటంతో ఇక్కడ బీజేపీ విజయం సాధించింది. ఓ రకంగా చెప్పాలంటే డమ్మీ అభ్యర్థి కారణంగా ‌టీఆర్‌ఎస్ అసలు అభ్యర్థి ఓడిపోయినట్టయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement