BN Reddy Nagar
-
హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం
-
టీఆర్ఎస్ కొంపముంచిన డమ్మీ అభ్యర్థి!
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల ఫలితాలు చివరి దశకు చేరుకున్నాయి. రెండు చోట్ల ఫలితం వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్-56, బీజేపీ-47, ఎంఐఎం-43, కాంగ్రెస్-2 చోట్ల విజయం సాధించగా, మరో రెండుచోట్ల బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇకపోతే, బీఎన్ రెడ్డి నగర్లో రీ కౌంటింగ్ జరిగింది. తొలుత టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మీ ప్రసన్నపై బీజేపీ అభ్యర్థి లచ్చిరెడ్డి 10 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే దీనిపై టీఆర్ఎస్ అభ్యర్థి రీకౌంటింగ్ కోసం డిమాండ్ చేయడంతో అక్కడ రీకౌంటింగ్ జరిపారు. రీకౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి 32 ఓట్లతో విజయం సాధించినట్టు ప్రకటించారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే టీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వ్యక్తికి 39 ఓట్లు పడ్డాయి. టీఆర్ఎస్ అసలు అభ్యర్థికి రావాల్సిన ఓట్లు డమ్మి అభ్యర్థికి పడటంతో ఇక్కడ బీజేపీ విజయం సాధించింది. ఓ రకంగా చెప్పాలంటే డమ్మీ అభ్యర్థి కారణంగా టీఆర్ఎస్ అసలు అభ్యర్థి ఓడిపోయినట్టయింది. -
టీఆర్ఎస్లో చేరేముందు హామీయిచ్చా..
సాక్షి, హైదరాబాద్: ‘నేను టీఆర్ఎస్లో చేరేముందు బీఎన్‌రెడ్డినగర్ రిజిస్ట్రేషన్స్, ఆస్తిపన్ను తగ్గింపు తదితర సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చాను. లేని పక్షంలో శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించాను. నేను చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాన’ని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా మాట్లాడారు. జూన్ 7 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో సమస్యలపై చర్చించేందుకు వీలుకాలేదన్నారు. కోడ్ ముగిసిన తర్వాత సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచానన్నారు. ఈ ఆరు నెలల్లో సమస్యలు పరిష్కారం కాని పక్షంలో రాజీనామాకు వెనుకాడబోనన్నారు. ఇప్పటికే ఈ సమస్యలపై అధికారులతో పలుసార్లు చర్చించానని, ఈ నెల 16న మంత్రి కేటీఆర్ సమక్షంలో మరోసారి సమీక్ష సమావేశం జరగనుందని చెప్పారు. దాదాపు 90శాతం సమస్యలు పరిష్కార దశలో ఉన్నాయని పేర్కొన్నారు. -
బీఎన్‌రెడ్డి నగర్లో దారుణం
సాక్షి, హైదరాబాద్ : బీఎన్‌రెడ్డి నగర్లో దారుణం చోటుచేసుకుంది. నడి రోడ్డుపై స్థిరాస్తి వ్యాపారి శ్రీనివాస్ గౌడ్‌ను కొందరు దుండగులు దారుణంగా వేట కొడవళ్ళతో నరికి చంపారు. ఈ సంఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీడీరెడ్డి గార్డెన్ సమీపంలో చోటుచేసుకుంది. మృతుడు మరో వ్యక్తితో కలిసి ఇండికా కారులో వచ్చారని, ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో వేటకొడవలితో నరికి చంపినట్లు సమాచారం. వివాహేతర సంబంధం కారణంగా శ్రీనివాస్ గౌడ్‌ను చంపినట్లు తెలుస్తోంది. మృతుడు కల్వకుర్తి తాలూకా తిమ్మరాసి పల్లి గ్రామానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. -
బీఎన్‌రెడ్డి నగర్లో ప్రమాదం..ఇద్దరి మృతి
హైదరాబాద్ : కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చర్లపల్లి బీఎన్‌రెడ్డి నగర్లో ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిని ఐచర్ వాహనం ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు నెహ్రూనగర్‌కు చెందిన చెరుకు రవి(50), రవళి(20)గా గుర్తించారు. మృతులిద్దరూ తండ్రీకూతుళ్లు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
మళ్లీ రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు.
-
మళ్లీ రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు
హైదరాబాద్ : నగరంలో చైన్‌స్నాచర్లు మళ్లీ రెచ్చిపోయారు. బీఎన్‌రెడ్డి నగర్లో బుధవారం శాంతమ్మ అనే మహిళ మెడలోని గొలుసును తెంపుకుని వ్యక్తి.. సమీపంలో బైక్‌పై ఆగి ఉన్న వ్యక్తితో కలసి పరారైయ్యాడు. దీంతో తెరుకున్న శాంతమ్మ బిగ్గరగా కేకలు వేసింది. దాంతో స్థానికులు వారిని వెంబడించిన... ఫలితం లేకపోయింది. బాధితురాలు వెంటనే వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. -
టైర్ల షోరూంలో భారీ చోరీ
హైదరాబాద్ : వనస్థలిపురం బీఎన్‌రెడ్డినగర్‌లోని ఓ టైర్ షోరూంలో శుక్రవారం ఆర్థరాత్రి చోరీ జరిగింది. ఈ విషయాన్ని శనివారం ఉదయం షోరూం యజమాని గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు షోరూంకు చేరుకుని... చోరీ జరిగిన తీరును పరిశీలించారు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రూ. 10 లక్షలు విలువ చేసే టైర్లతోపాటు రూ. లక్ష నగదు చోరీ అయిందని షోరూం యజమాని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
బీఎన్‌రెడ్డి నగర్లో భారీ దోపిడీ
హైదరాబాద్ : వనస్థలిపురంలోని బీఎన్‌రెడ్డి నగర్లో శుక్రవారం రాత్రి భారీ దోపిడీ జరిగింది. ఓ ఇంట్లో మహిళ ఒంటరిగా ఉండటం చూసి గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి ప్రవేశించారు. యువతి కాళ్లు చేతులను గుడ్డలతో కట్టి దొంగతనానికి తెగబడ్డారు. ఈ దోపిడీలో సుమారు 20 తులాల బంగారం, రూ.లక్ష నగదును ఆగంతకులు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెట్రోల్ ట్యాంకర్-కారు ఢీ; ఒకరు మృతి
హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ బీఎన్‌రెడ్డి నగర్లో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతిచెందారు. పెట్రోల్ ట్యాంకర్ కారు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. దాంతో నాగార్జున సాగర్ హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
వ్యభిచార గహంపై దాడి.. ఐదుగురి అరెస్టు
హైదరాబాద్: అద్దెకు ఉంటున్నవారు గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్న సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వనస్థలిపురం బీఎన్‌రెడ్డి నగర్లో కంచికట్ల కృష్ణ ఓ ఇంటిని అద్దెకు తీసుకొని వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణమూర్తి ఎస్ఐ సైదులు, ఇతర సిబ్బందితో ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో శక్తినగర్కాలనీకి చెందిన కొండూరి మహేందర్, ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌కు చెందిన వరికుప్పల జంగయ్య, నల్లగొండ జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన ఓ మహిళ, ఘట్కేసర్ మండలం ఫిర్జాదీగూడ ఆర్టీసీకాలనీకి చెందిన మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు సెల్ఫోన్లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.