హైదరాబాద్: అద్దెకు ఉంటున్నవారు గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్న సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వనస్థలిపురం బీఎన్‌రెడ్డి నగర్‌లో కంచికట్ల కృష్ణ ఓ ఇంటిని అద్దెకు తీసుకొని వ్యభిచారం నిర్వహిస్తున్నాడు.
సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్ గోపాలకృష్ణమూర్తి ఎస్‌ఐ సైదులు, ఇతర సిబ్బందితో ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో శక్తినగర్‌కాలనీకి చెందిన కొండూరి మహేందర్, ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌కు చెందిన వరికుప్పల జంగయ్య, నల్లగొండ జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన ఓ మహిళ, ఘట్‌కేసర్ మండలం ఫిర్జాదీగూడ ఆర్టీసీకాలనీకి చెందిన మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
వ్యభిచార గహంపై దాడి.. ఐదుగురి అరెస్టు
Published Wed, Jul 2 2014 10:30 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement