
వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ జూనియర్ ఆర్టిస్ట్
హైదరాబాద్: నగరంలో మరో వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. వనస్థలిపురంలో గుట్టుగా సాగుతున్న వ్యభిచార గృహాలపై పోలీసులు దాడి నిర్వహించారు.
నలుగురు మహిళలు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన మహిళల్లో జూనియర్ ఆర్టిస్ట్ ఒకరు ఉన్నారు. వీరిపై కేసు నమోదు చేసి సంరక్షణాలయానికి తరలించారు.