
శ్రీనివాస్ గౌడ్(ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : బీఎన్‌రెడ్డి నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. నడి రోడ్డుపై స్థిరాస్తి వ్యాపారి శ్రీనివాస్ గౌడ్‌ను కొందరు దుండగులు దారుణంగా వేట కొడవళ్ళతో నరికి చంపారు. ఈ సంఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీడీరెడ్డి గార్డెన్ సమీపంలో చోటుచేసుకుంది. మృతుడు మరో వ్యక్తితో కలిసి ఇండికా కారులో వచ్చారని, ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో వేటకొడవలితో నరికి చంపినట్లు సమాచారం.
వివాహేతర సంబంధం కారణంగా శ్రీనివాస్ గౌడ్‌ను చంపినట్లు తెలుస్తోంది. మృతుడు కల్వకుర్తి తాలూకా తిమ్మరాసి పల్లి గ్రామానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment