'రూ. 450 కోట్లు ఎక్కడివి?' | congress leader sreedhar babu slams TRS | Sakshi
Sakshi News home page

'రూ. 450 కోట్లు ఎక్కడివి?'

Published Wed, Jan 20 2016 2:42 PM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM

congress leader sreedhar babu slams TRS

పెద్దపల్లి: జీహెచ్‌ఎంసీ పీఠాన్ని అక్రమంగా దక్కించుకునేందుకు అధికార పార్టీ రూ. 450 కోట్లు ఖర్చుపెడుతోందని మాజీ మంత్రి శ్రీధర్‌ బాబు ఆరోపించారు. ఆయన బుధవారం మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో విలేకరులతో మాట్లాడారు. భారీ ఎత్తున ప్రచారం చేసుకుంటున్న టీఆర్‌ఎస్ పార్టీ విచ్చలవిడిగా డబ్బువెదజల్లుతోందన్నారు. అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారని ఆయన ప్రశ్నించారు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఏమాత్రం బలం లేకుండానే ఇతర పార్టీలకు చెందిన వారిని మభ్యపెట్టి, డబ్బు ఆశచూపారన్నారు. టీఆర్‌ఎస్ దొడ్డిదారిన సీట్లు దక్కించు కుందని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement