అభివృద్ధితోనే ‘గ్రేటర్’ విజయం : నరేందర్‌రెడ్డి | ghmc elections to win trs | Sakshi
Sakshi News home page

అభివృద్ధితోనే ‘గ్రేటర్’ విజయం : నరేందర్‌రెడ్డి

Published Sat, Feb 6 2016 4:32 AM | Last Updated on Mon, Aug 13 2018 3:55 PM

అభివృద్ధితోనే ‘గ్రేటర్’ విజయం : నరేందర్‌రెడ్డి - Sakshi

అభివృద్ధితోనే ‘గ్రేటర్’ విజయం : నరేందర్‌రెడ్డి

 నల్లగొండ రూరల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న అభివృద్ధి ని చూసి గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఆదరించారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ పాతబస్తీ కూడా గులాబీ మయమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఒక విజన్‌తో ముందుకు వెళ్లడం వలనే గ్రేటర్ ప్రజలు బ్రహ్మరథం పట్టార న్నారు.

ఈ ఎన్నికల విజయంతో పార్టీపైన గురుతరమైన బాధ్యత పెరిగిందని చెప్పారు. అంతకు ముందు టీఆర్‌ఎస్ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు బాణ సంచా కాల్చి, స్వీట్లు పంచారు. స్థానిక క్లాక్‌టవర్ సెంట ర్‌లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బక్క పిచ్చ య్య, మైనం శ్రీనివాస్, అభిమన్యు శ్రీని వాస్, సుంకరి మల్లేశ్‌గౌడ్, రేకల భద్రాద్రి, బొర్ర సుధాకర్, మాలే శరణ్యారెడ్డి, బొమ్మరబోయిన నాగార్జున, మహేందర్, రామేశ్వరిు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement