టీఆర్‌ఎస్‌లోకి జోరుగా వలసలు | bjp party leaders joins in trs party | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లోకి జోరుగా వలసలు

Published Sun, Jan 24 2016 2:17 AM | Last Updated on Sun, Sep 3 2017 4:10 PM

టీఆర్‌ఎస్‌లోకి జోరుగా వలసలు

టీఆర్‌ఎస్‌లోకి జోరుగా వలసలు

సాక్షి, సిటీబ్యూరో: బల్దియా ఎన్నికల వేళ అధికార టీఆర్‌ఎస్ పార్టీలోకి ఇతర పార్టీల నేతల చేరికలు జోరుగా సాగుతున్నాయి. శనివారం తెలంగాణ  భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రేంసింగ్ రాథోడ్‌తో పాటు కొలను శ్రీనివాస్‌రెడ్డి, బండి రమేష్, శంకర్ యాదవ్, అశోక్ గౌడ్, విమల్ కుమార్, నార్నే శ్రీనివాస్‌రావు, రాఘవరావు తదితరులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బల్దియా ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం ఖాయమైందని వారు పేర్కొన్నారు.
 
టీఆర్‌ఎస్‌లోకి నైషధం
టీడీపీకి రాజీనామా చేసిన ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన నైషధం సత్యనారాయణ మూర్తి శనివారం మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. హోమ్‌మంత్రి నాయిని నరసింహారెడ్డిని కలిసిన అనంతరం.. తన అనుచరులతో కలసి టీఆర్‌ఎస్‌లో చేరారు. గత కొద్ది రోజులుగా ఆయన టీడీపీ తీరుపై నిరసన ప్రదర్శనలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement