
‘అన్న’ఫొటో లేదని తమ్ముళ్ల ఆగ్రహం
గ్రేటర్ ఎన్నికల్లో గెలుపుకోసం ఏర్పాటు చేసి న టీడీపీ విస్తృతస్థాయి సమావేశం పార్టీలోని విభేదాలను బట్టబయలు చేసింది.
- దేశం సమావేశంలో వాగ్వాదం
కవాడిగూడ : గ్రేటర్ ఎన్నికల్లో గెలుపుకోసం ఏర్పాటు చేసి న టీడీపీ విస్తృతస్థాయి సమావేశం పార్టీలోని విభేదాలను బట్టబయలు చేసింది. సమావేశం వేదికపై ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ ఫొటో లేకపోవడంపై కొందరు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన స్ఫూర్తితోనే తమలాంటి వాళ్లెందరో రాజ కీయాల్లోకి వచ్చారని, ఆయననే ఎలా విస్మరిస్తారని ప్రశ్నించారు.
ఇటీవల పార్టీనేతలు పక్షపాతం ప్రదర్శిస్తూ, పార్టీ కార్యక్రమాలపై తమకు కనీస సమాచారం ఇవ్వడం లేద ని సనత్‌నగర్ నియోజకవర్గానికి చెందిన బీసీ సెల్ నాయకుడు గంగాధర్‌గౌడ్, ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన నైషధం సత్యనారాయణమూర్తి నాయకులను నిల దీశారు. మాట్లాడేందుకు తమకు మైకు ఇవ్వాల్సిం దిగా కోరగా, నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన గంగాధర్‌గౌడ్ మైకు లాక్కునేందుకు ప్రయత్నించగా తోపులాట జరిగింది. దీంతో గంగాధర్, గోపీనాథ్ వర్గీయులు పోటీపోటీగా నినాదాలు చేయడంతో గందరగోళ ం నెలకొంది. వేదికపైనే ఉన్న పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈ విషయంలో నోరు మెదపకపోవడం గమనార్హం.
అక్కడ కేటీఆర్ ఉంటే.. ఇక్కడ నేనుంటా.. !
‘‘ఆ పక్కన కేటీఆర్ ఉంటే .. ఈ పక్కన నేనొస్తా, అక్కడ కేసీఆర్ ఉంటే .. ఇక్కడ చంద్రబాబును తీసుకొస్తా, అంతకంటే పెద్ద వాళ్లు అక్కడుంటే... నేను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని రప్పిస్తా. సవాల్‌కు సవాల్... ఇక గ్రేటర్ ఎన్నికల్లో చూసుకుందాం’’అని రేవంత్‌రెడ్డి అన్నారు. గ్రేట ర్ మేయర్ పీఠం టీడీపీదే అన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల ను సెంటిమెంట్‌తో రెచ్చగొట్టి, సీమాంధ్ర ప్రజలను తీవ్ర పదజాలంతో దుర్భలాషలాడిన కేసీఆర్ ఎన్నికల కోసం కడుపులో కత్తులు పెట్టుకొని పైకి కౌగిలించుకుంటే ఎవరూ నమ్మరన్నారు. నగరానివృద్ధి టీడీపీ హయూంలోనే జరిగిందని పేర్కొన్నారు.
మన సంసారం పెద్దలు కుదిర్చిన పెళ్లి...
మనది ప్రేమ వివాహం కాదనీ, మన సంసారం పెద్దలు చంద్రబాబు, నరేంద్ర మోదీలు కుదిర్చిన పెళ్లని టీడీపీ, బీజేపీ పొత్తులపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు దీనిని గుర్తుంచుకుని నడుచుకోవాలని సూచించారు. కష్టమైనా, నష్టమైనా మన పెద్దలను గౌరవించాలని, మేయర్ పదవిని కైవసం చేసుకొని నరేం ద్ర మోదీ, చంద్రబాబులను తల ఎత్తుకునేలా చేయాలన్నారు.
తిరగబడితేనే నాయకులు : ఎర్రబెల్లి
ఉప్పల్‌లో మంత్రి కేటీఆర్‌పై మన నాయకులు రమణా రెడ్డి, అశోక్ తిరగబడ్డట్లుగానే మిగతా ప్రాంతాల్లోనూ టీడీ పీ నాయకులు మంత్రులపై తిరగబడాలని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడును ఎవరు విమర్శించినా తక్షణమే నిలదీయాలన్నారు. లేకపోతే మీరు నాయకులుగా ఎదగలేరని పరోక్షంగా రెచ్చగొట్టారు. సమావేశానికి గోపీనాథ్ అధ్యక్షత వహించారు.