
క్యా బాత్ హై
గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి బీజేపీ-టీడీపీతోనే సాధ్యమవుతుంది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక చేసిన పనుల కంటే ప్రచారం ఎక్కువగా ఉంది. ఉత్తుత్తి ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు.
- వెంకటాపురం డివిజన్ ఎన్నికల సభలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
తెలంగాణపై మాటకు కట్టుబడింది ఒక్క సోనియా గాంధీనే. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆమె ఎన్నో అడ్డంకులను అధిగమించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకే ఓటు వేయాలి.
- కార్వాన్ ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఎన్నికల ‘గద’!
టీపీసీసీ సారథి ఉత్తమ్‌కుమార్ రెడ్డి గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో నిర్విరామంగా పాల్గొంటున్నారు. రోడ్డు షోలు, పాదయాత్రలు, ప్రచార సభలతో దాదాపు డివిజన్లన్నీ చుట్టేస్తున్నారు. కార్వాన్‌లో శనివారం పార్టీ కార్యకర్తలు బహూకరించిన గదను ధరించి రోడ్డు షోలో పాల్గొన్నారు. ఉత్తేజభరిత ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
- కార్వాన్