
షెహర్ హమారా.. ఓట్ హమారా!!
గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచాలనే లక్ష్యంతో ఈ-ప్రచారం నిర్వహించనున్నట్లు రీఫార్మర్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా
సుల్తాన్‌బజార్: గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచాలనే లక్ష్యంతో ఈ-ప్రచారం నిర్వహించనున్నట్లు రీఫార్మర్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు మహ్మద్ ఇలియాస్ శాంషీ తెలిపారు. ఇందుకోసం ఓటు ప్రాధాన్యంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ‘షెహర్ హమారా.. ఓట్ హమారా’ పేరుతో సోషల్ మీడియాలో అవగాహనా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సరైన అభ్యర్థులను ఎన్నుకోవడంలో ప్రజలు తప్పటడుగు వేస్తున్నారని, ఈసారి ఉత్తమ నాయకులను ఎన్నుకునేలా సోషల్ మీడియా ద్వారా తమ వంతు కృషి చేస్తామన్నారు. 30 వరకు ప్రచారం నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో సంస్థ ప్రతినిధులు అసీర్ సుల్తాన్ , అక్తర్ పర్వీన్ పాల్గొన్నారు.