గ్రేటర్‌ ఎన్నికల కౌంటింగ్ వాయిదా | greater elections counting postponed | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌ ఎన్నికల కౌంటింగ్ వాయిదా

Published Thu, Feb 4 2016 9:02 AM | Last Updated on Sun, Sep 3 2017 4:57 PM

గ్రేటర్‌ ఎన్నికల కౌంటింగ్ వాయిదా

గ్రేటర్‌ ఎన్నికల కౌంటింగ్ వాయిదా

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. పాతబస్తీ పురానాపూల్ 52వ డివిజన్లో రీ పోలింగ్ వల్ల కౌంటింగ్ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్- ఎంఐఎం పార్టీల మధ్య ఘర్షణల కారణంగా పురానాపూల్‌ డివిజన్‌లో రీపోలింగ్‌ జరగనుంది. ఈ సందర్భంగా గ్రేటర్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు సాయంత్రం 4 నుంచి ప్రారంభం కానుంది.

 

మరికాసేపట్లో ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించనుంది. మరోవైపు రీ పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ పురానాపూల్లోని 36 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement