రేవంత్ ను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సోమవారం అమీర్‌పేట సత్యం థియేటర్ వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రేవంత్‌రెడ్డిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరు వర్గాలను అడ్డుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 2వ తేదీన గ్రేటర్ ఎన్నికల పోలింగ్ జరగనుంది.