అదృశ్యం కాదిక!
♦ ఎన్నికల కార్యకలాపాలపై పోలీసుల డేగ కన్ను
♦ కీలక ఘట్టాలన్నీ వీడియో రికార్డింగ్
♦ ‘ఫీడ్’తో పక్కా ఆధారాల సేకరణ
♦ ఉల్లంఘనులపై చర్యలకు ఉపయుక్తంగా పోలీసుల ప్రణాళిక
ప్రతి దృశ్యం నిక్షిప్తం. కాదిక అ‘దృశ్యం’. ఎన్నికల కార్యకలాపాల్లోని ప్రతి ఘట్టాన్ని పోలీసులు రికార్డు చేస్తున్నారు. జీపీఎస్, సర్వైలెన్స్ కెమెరాలతో కమాండ్ అండ్ కంట్రోల్ రూం అభ్యర్థులను అనునిత్యం ‘వాచ్’ చేస్తోంది. ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘిస్తే ఊచలు లెక్కింపజేసేందుకు పక్కా ఆధారాలు సేకరిస్తోంది.
- సాక్షి, సిటీబ్యూరో
గ్రేటర్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు జంట కమిషనరేట్ల పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు హైదరాబాద్, అటు సైబరాబాద్ పోలీసులు ఈ కోణంలోనే దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా హైటెక్ పద్ధతిలో జీపీఎస్, సర్వైలెన్స్ కెమెరాలతో పాటు పెద్ద ఎత్తున ప్రైవేట్ కెమెరాలనూ అద్దెకు తీసుకోవాలని నిర్ణరుుంచారు.
పాతబస్తీతో పాటు కొన్ని సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఘర్షణలు, గొడవలు జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో ప్రత్యేక మొబైల్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. మరోపక్క స్పెషల్ బ్రాంచ్‌లకు చెందిన సిబ్బంది సైతం ఎప్పటికప్పుడు పరిస్థితులను అధ్యయనం చేసి, నివేదికలు తయూరు చేస్తున్నారు. వీటన్నింటినీ బేరీజు వేసిన యంత్రాంగం పక్కా రక్షణ చర్యలకు సన్నాహాలు ప్రారంభించింది. వీటిలో భాగంగా అత్యంత సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు. వీటిలో పోలింగ్ పూర్తయ్యే వరకు అదనపు బలగాలను మోహరిస్తున్నారు.
ప్రతి ఘట్టమూ రికార్డు..
సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటుకు జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) వాహనాలను విసృ్తతంగా వినియోగించాలని నిర్ణరుుంచారు. మరోపక్క ప్రస్తుతం పోలీసు, కమ్యూనిటీల అధీనంలో ఉన్న సర్వైలెన్స్ కెమెరాలు వినియోగించి కార్యకర్తలు, అభ్యర్థుల కదలికలను గమనించడానికి సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేశారు. దీనిని ప్రధాన కమిషరేట్లలోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లలో రికార్డు చేస్తున్నారు. ప్రచార సరళి ప్రభావం ట్రాఫిక్‌పై పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. జంట కమిషనరేట్లలోని శాంతి భద్రతల, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలోని డిజిటల్, వీడియో కెమెరాలు కొన్ని అందుబాటులో ఉన్నారుు. వీటిని వినియోగించి ఎన్నికల్లోని ప్రతి ఘట్టాన్ని రికార్డు చేయూలని నిర్ణరుుంచారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రచారం మొదలుకొని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి దృశ్యాన్ని నిక్షిప్తం చేస్తున్నారు. ఏ దశలోనూ ఉల్లంఘనలకు తావు లేకుండా, అలాంటి వాటికి పాల్పడిన వారిని గుర్తించడం, చర్యలు తీసుకోవడానికి ఆధారాలుగా వినియోగించడం కోసం ఈ ఫీడ్‌ను వాడనున్నారు.
‘ముద్ర’లుండాల్సిందే..
ఈసీ నిబంధనల్ని పక్కాగా అమలు చేస్తున్న పోలీసులు ప్రింటింగ్ ప్రెస్‌లపైనా దృష్టి పెట్టారు. జోన్లు, డివిజన్ల వారీగా ఆయా ప్రెస్‌ల యజమానులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రచారానికి సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీల ముద్రణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దృష్టి పెట్టాల్సిన అంశాలను వారికి వివరిస్తున్నారు. ముద్రించే ప్రతి దానిపైనా ప్రింటర్స్ అండ్ పబ్లిషర్స్ పేరు, ఏ పార్టీ/అభ్యర్థి కోసం ముద్రిస్తున్నారో వారికి సంబంధించిన పూర్తి వివరాలు తప్పక ముద్రించాలని స్పష్టం చే శారు. ప్రతి ప్రింటింగ్ ప్రెస్ యజమాని ఓ రికార్డు ఏర్పాటు చేసి వివరాలు నమోదు చేయూలన్నారు. వీటిని ఉల్లంఘించే ప్రింటింగ్ ప్రెస్ యజమానులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
‘హద్దులు’ తేలుస్తున్న ఎలక్షన్ సెల్...
జంట కమిషనరేట్లలో పనిచేస్తున్న ప్రత్యేక ఎలక్షన్ సెల్‌కు ఇప్పుడు ఓ చిక్కు వచ్చి పడింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, శాంతి భద్రతల సమస్యలకు తావు లేకుండా అన్ని పోలింగ్ బూత్‌ల్లో బందోబస్తు ఏర్పాటు చేయడానికి ఇది కసరత్తు చేస్తోంది. అరుుతే వివిధ పోలీసు స్టేషన్ల పరిధుల సరిహద్దుల్లో ఉన్న పోలింగ్ బూత్‌లతోనే ఇప్పుడు సమస్య. ఇవి తమ పరిధిలోకి రావంటే తమ పరిధిలోకి రావంటూ ఎవరికి వారు చేతులు దులుపుకుంటున్నారు. సమస్యాత్మక బూత్‌లు ఉన్న చోట్ల ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. దీన్ని పరిగణలోకి తీసుకున్న ఎలక్షన్ సెల్ జోన్ల వారీగా పోలీసుస్టేషన్ల పరిధులు, వాటిలో ఉన్న పోలింగ్ బూత్‌లను గుర్తించే పనిలో పడింది. దీని కోసం పోలీసు అధికారులను పోలీస్ స్టేషన్ల సరిహద్దుల్లో ఉన్న పోలింగ్ బూత్‌లకు పంపిస్తూ అవి ఏ స్టేషన్ కిందికి వస్తాయో తేలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తర్వాతే పూర్తిస్థారుు బందోబస్తు స్కీమ్‌లు రూపొందించనున్నారు.