
‘కోటి’ రూట్లు
సేవ ప్రశ్నార్థకం..
ఇప్పుడు భారీ మొత్తంలో ఖర్చు చేసి ఎన్నికయ్యే కార్పొరేటర్లు ఎంతమేరకు అందుబాటులో ఉంటారనేది ప్రశ్నార్థకం. తమ వ్యాపారాల్లో కార్పొరే షన్ పరంగా ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు కొంతమంది అభ్యర్థులు ఎన్నికలను వినియోగించు కుంటున్నారన్నది బహిరంగ రహస్యమే. అనేక మంది మాజీలు, తాజాలు తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు పోటీలో నిలుస్తున్నారు.
* గెలుపు కోసం పాట్లు
* విచ్చల విడిగా ధన ప్రవాహం
* శివాలెత్తుతున్న శివారులు
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారింది. ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో అభ్యర్థులు ‘కోటి’మార్గాలు వెదుకుతున్నారు. డబ్బును విచ్చల విడిగా వెదజల్లుతున్నారు. ఖర్చెంతైనా ఫర్వాలేదు..గెలిస్తే చాలునన్న ధోరణిలో ముందుకెళుతున్నారు. ఈ విషయంలో నగరం కంటే శివారు ప్రాంతాలే ముందున్నాయి. ఉప్పల్, హయత్‌నగర్, నాచారం, మాదాపూర్ డివిజన్లలో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావించిన పలువురు అభ్యర్థులు ధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నట్లు వినికిడి.
బౌద్ధనగర్, బేగంపేట, తార్నాక, అమీర్‌పేట, కూకట్‌పల్లి వంటి చోట్ల కూడా ఒక్కో డివిజన్‌కు రూ.కోటి నుంచి రూ.కోటిన్నర వరకు వెచ్చించడానికి వెనుకాడడం లేదు. వందలాది మంది కిరాయి కార్యకర్తలు, వాహనాలు, బాజాభజంత్రీలకు రోజూవారీ కూలీ, భోజనం, ప్రచార సామగ్రి ఖర్చు రోజుకు రూ.6-10 లక్షలకు మించిపోతోంది. ప్రచారం సంగతి పక్కన పెడితే... ఎన్నికల పుణ్యమా అని అడ్డాకూలీలకు ఆధారం దొరికింది. నిత్యం పక్కాగా కూలీ గిట్టుబాటవుతుండటంతో యువకులతో పాటు మహిళలు, వృద్ధులు సైతం ప్రచారంలో పాల్గొని నాలుగురాళ్లు సంపాదించుకుంటున్నారు.
‘మొత్తం’ తేడా!
గ్రేటర్ హైదరాబాద్ వుున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అసెంబ్లీని తలపిస్తున్నాయి. 150 వార్డులకు మొత్తం 1,333 వుంది పోటీ పడుతున్నారు. నువ్వా...నేనా అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికలను అన్ని పార్టీల కార్పొరేటర్‌అభ్యర్థులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితిల్లోనూ గెలిచి తీరాలనే పట్టుదలతో పరిమితులను అతిక్రమిస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం రూ.ఐదు లక్షలకు మించి ఖర్చు చేయకూడదు. ఈ ‘మొత్తం’ ఏ మూలకూ సరిపోదని స్వయుంగా అభ్యర్థులే వెల్లడిస్తున్నారు.
పార్టీల కార్యాలయాల్లో బీ ఫారాలు తీసుకున్నప్పటి నుంచి ఎన్నికలు ముగిసే వరకు ఒక్కో అభ్యర్థి ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రయుతిస్తే... వారు చెబుతున్నదానికీ...వాస్తవానికీ మధ్య ఎంత తేడా ఉందో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు వుంచినీళ్ల ప్రాయుంగా డబ్బు ఖర్చు చేస్తున్నారనే విషయుం అందరికీ తెలిసిందే. వివిధ ప్రాంతాలు, పార్టీల బలాబలాలు, అభ్యర్థుల ఎన్నికల ఖర్చును ప్రభావితం చేస్తున్నారుు. ఉ దాహరణకు పాతబస్తీ అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ నిబంధనలకు అటు ఇటుగా ఖర్చవుతుండగా... మిగిలిన వార్డుల్లో ఈ మొత్తం రూ.రెండు నుంచి మూడు కోట్లకు పైనే ఉంటుందని అంచనా.