
‘బేగం’ సే ఆయా..
రెండో అసఫ్‌జాహీగా సుప్రసిద్ధుడైన మీర్ నిజాం అలీఖాన్ బహదూర్ (1762-1803) తన కూతురు బషీర్ ఉల్ ఉన్నీసా బేగంను..
సాక్షి, సిటీబ్యూరో: రెండో అసఫ్‌జాహీగా సుప్రసిద్ధుడైన మీర్ నిజాం అలీఖాన్ బహదూర్ (1762-1803) తన కూతురు బషీర్ ఉల్ ఉన్నీసా బేగంను.. నవాబు ఫక్రుద్దీన్‌ఖాన్ షంషుల్ ఉమ్రా అమీన్ కబీర్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి సందర్భంగా విలువైన కట్నకానుకలు, బంగారు ఆభరణాలతో పాటు నగర శివారులోని ఓ చిన్న గ్రామాన్ని జాగీర్‌గా వారికిచ్చారు. ఈ ప్రాంతం నుంచి వచ్చే రెవెన్యూ అప్పటి నుంచి బేగం సొంత ఖాతాలోకి చేరేది. నిజాం నవాబు తన కూతురు బేగంకు కానుకగా ఇచ్చిన ప్రాంతం కావడంతో ‘బేగంపేట’ అనే పేరొచ్చింది.