టీఆర్‌ఎస్ అసంతృప్తి నేతపై కాంగ్రెస్ కన్ను
Published Sat, Jan 16 2016 11:07 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ నేత సురేష్‌రెడ్డిని రంగంలోకి దించే అవకాశాలున్నాయని సమాచారం. కార్పొరేటర్ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ అధిష్టానం అడుసుమిల్లి వెంకటేశ్వరరావుకు ప్రకటించటంతో జనగామ సురేష్‌రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తనకంటూ సురేష్‌రెడ్డి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తన సేవలను గుర్తించకపోటంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇదే అదనుగా ఆయనకు తమ పార్టీ తరపున టికెట్ ఇచ్చి రంగంలోకి దించేందుకు కాంగ్రెస్ పెద్దలు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
Advertisement
Advertisement