జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.
చైతన్యపురిలో రూ.12.40 లక్షల స్వాధీనం
Published Mon, Jan 25 2016 2:16 PM | Last Updated on Sun, Sep 3 2017 4:18 PM
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. సోమవారం ఉదయం చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న రూ.12.40 లక్షల నగదు పట్టుబడింది. ఈ మేరకు కారును సీజ్ చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Advertisement
Advertisement