అత్యధిక పోలింగే లక్ష్యం... | The goal of the highest poling | Sakshi
Sakshi News home page

అత్యధిక పోలింగే లక్ష్యం...

Published Mon, Jan 25 2016 1:04 AM | Last Updated on Sun, Sep 3 2017 4:15 PM

అత్యధిక పోలింగే లక్ష్యం...

అత్యధిక పోలింగే లక్ష్యం...

♦ ఓటర్లలో చైతన్యానికి జీహెచ్‌ఎంసీ వినూత్న ప్రచారం  
♦ నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ర్యాలీలు, ప్రదర్శనలు
 
 సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అత్యధిక పోలింగే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. నేడు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి అధికారులకు సూచించారు.

ఇందులో భాగంగా సర్కిల్ కార్యాలయాల పరిధిలోని విద్యార్థులతో ర్యాలీలు చేపట్టనున్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు. ఓటర్ చైతన్యంపై పెద్ద ఎత్తున హోర్డింగులు ఏర్పాటు చేశారు. సర్కిళ్ల స్థాయిలో రెసిడెన్షియల్ వెల్పేర్ అసోసియేషన్ల సమావేశాలు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా స్లైడ్ ద్వారా థియేటర్లలోనూ ప్రదర్శన నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement