
‘వంద’ గెలవకుంటే రాజీనామా చేస్తావా?
‘గ్రేటర్’ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వందసీట్లు గెలిస్తే తాను ఎమ్మెల్సీగా, ప్రతిపక్ష నేత పదవులకు రాజీనామా చేస్తానని, టీఆర్‌ఎస్ గెలవకుంటే మంత్రి కేటీఆర్ వైదొలుగుతారా
మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ సవాల్
సాక్షి, హైదరాబాద్: ‘గ్రేటర్’ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వందసీట్లు గెలిస్తే తాను ఎమ్మెల్సీగా, ప్రతిపక్ష నేత పదవులకు రాజీనామా చేస్తానని, టీఆర్‌ఎస్ గెలవకుంటే మంత్రి కేటీఆర్ వైదొలుగుతారా అని శాసనమండలిలో కాంగ్రెస్‌పక్ష నేత షబ్బీర్ అలీ సవాల్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వందసీట్లు గెలుస్తామని కేటీఆర్ చేసిన సవాల్‌కు కట్టుబడి ఉండాలన్నారు.
అడ్డదారిలో గెలవడానికి టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగం చేస్తోందని, పోటీ నుంచి తప్పుకోవాలంటూ అభ్యర్థులను పోలీసులు బెదిరిస్తున్నారన్నారు. పోలీసుల అధికార దుర్వినియోగంపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. దళిత విద్యా ర్థి రోహిత్ ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించే తీరిక కూడా కేసీఆర్‌కు లేన్నారు.