భాగ్యనగరి తొలి పోస్టాఫీస్
హైద్రాబాద్ నగరంలో మొట్టమొదటి పోస్టాఫీస్‌ను 1866 మార్చి 14న సికింద్రాబాద్‌లోని బొల్లారంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అల్వాల్ రైతుబజార్‌కు ఎదురుగా రాష్ట్రపతి నిలయం పక్కనే ఉందీ పోస్టాఫీస్. శతాబ్దిన్నరకు పైగా స్థానికులకు విశిష్ట సేవలందించిన ఘనత ఈ పోస్టాఫీస్‌ది. నిజాం హయాంలో బ్రిటీష్ పాలకులు తమ సమాచార సౌకర్యార్థం దీనిని ఏర్పాటు చేశారు. తొలిసారిగా టెలిగ్రాఫ్ సౌకర్యం కూడా ఇక్కడే నెలకొల్పారు. స్వాతంత్య్రం అనంతరం ఈ పోస్టాఫీస్ శాఖ భారత ప్రభుత్వ అధీనంలోకి వచ్చింది. ఘన చరిత్ర గల ఈ పోస్టాఫీస్‌కు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ డాక్ సేవా అవార్డు కూడా లభించింది. - బన్సీలాల్‌పేట్