క్యా బాత్ హై
ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే లక్ష్యంతో టీఆర్‌ఎస్ పార్టీ అడ్డదారులు తొక్కుతోంది. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ప్రజలకు అబద్ధాలు చెబుతూ పబ్బం గడుపుకోవాలని చూస్తోంది.
- అడిక్‌మెట్ డివిజన్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ
గత పాలకులు నగరాన్ని ‘ఊపర్ షేర్వానీ- అందర్ పరేషానీ’ చందంగా మార్చేశారు. నగర సమస్యలకు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలే కారణం. ఈ పార్టీలకు ఓటేస్తే మోరీలో వేసినట్లే. ప్రజలు
అప్రమత్తంగా ఉండాలి.
- జాంబాగ్ డివిజన్ రోడ్ షోలో మంత్రి కేటీఆర్
ఎవరెన్ని చెప్పినా గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ఘనతే. మేం చేసిన అభివృద్ధి పనులను టీఆర్‌ఎస్ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కాలని చూస్తున్న టీఆర్‌ఎస్‌కు ప్రజలే బుద్ధిచెబుతారు.
- రామంతాపూర్ ప్రచార ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి