నిజామాబాద్లో వైఎస్ షర్మిల రెండో విడత పరామర్శ యాత్ర | Second phase paramarsa yatra has started in Nizamabad district | Sakshi

నిజామాబాద్లో వైఎస్ షర్మిల రెండో విడత పరామర్శ యాత్ర

Jan 7 2016 5:39 PM | Updated on Aug 31 2018 9:02 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల రెండో విడత పరామర్శయాత్ర గురువారం నిజామాబాద్ జిల్లాలో ప్రారంభమైంది.

నిజామాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల రెండో విడత పరామర్శయాత్ర గురువారం నిజామాబాద్ జిల్లాలో ప్రారంభమైంది. జిల్లాలోని పిట్లం వద్ద షర్మిలకు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ యాత్రలో భాగంగా పిట్లం మండలం చిల్లర్గిలో భట్టు చిన్నబాలయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అనంతరం జుక్కల్ మండలకేంద్రంలో నేదరి శిఖామణి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. రాజన్నపాలనను తిరిగి తెచ్చుకోవాలని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంది ఒక్క వైఎస్సారేనని షర్మిల గుర్తు చేశారు.


కాగా,  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర మూడు రోజులపాటు కొనసాగిన సంగతి తెలిసిందే. మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణవార్త విని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి వైఎస్ షర్మిల భరోసా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement