ఎన్నికల కిక్కు! | Elections kick! | Sakshi
Sakshi News home page

ఎన్నికల కిక్కు!

Published Thu, Jan 28 2016 1:33 AM | Last Updated on Mon, Aug 20 2018 2:21 PM

ఎన్నికల కిక్కు! - Sakshi

ఎన్నికల కిక్కు!

15 రోజుల్లో రూ.247 కోట్ల మద్యం అమ్మకాలు
 మరో మూడు రోజుల్లో భారీగా పెరిగే అవకాశం  
 అక్రమ అమ్మకాలపై ఆబ్కారీ శాఖ నిఘా

 
 సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. అదే తరహాలో మద్యం అమ్మకాలూ పెరిగాయి. ‘మూడు ఫుల్లు.. ఆరు క్వార్టర్లు’ అన్న చందంగా సిటీలో లిక్కర్ సేల్స్ జోరందుకున్నాయి. ఎన్నికల హడావిడి మొదలైనప్పటి నుంచి 15 రోజుల్లో సుమారు రూ.247 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయంటే అతిశయోక్తి కాదు. ఇక మరో నాలుగు రోజుల్లో అమ్మకాలు మరింత ఊపందుకోనున్నట్లు ఆబ్కారీ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎలక్షన్ జోష్‌లో సిటీలోని వైన్స్, బార్లు, రెస్టారెంట్లకు గిరాకీ అమాంతంగా పెరిగింది.

 మందు.. చిందు
 ఓట్ల కోసం కోటి తిప్పలు పడుతున్న అభ్యర్థులు.. మందు కోసం మంచినీళ్ల ప్రాయంలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ప్రచార పర్వంలో చుక్క లేనిదే జోష్ రాదని భావిస్తున్న అభ్యర్థులు.. మందును ‘ఫుల్లు’ కొనుగోలు చేసి కార్యకర్తలను ఖుషీ చేస్తున్నారు. 15 రోజుల్లో ఐఎంఎల్ మద్యం ఐదు లక్షల లీటర్లు, నాలుగు లక్షల లీటర్ల బీరు తాగేశారు మందుబాబులు. చలికాలం కావడంతో ఐఎంఎల్ మద్యానికే మందుబాబులు ఓటేస్తున్నారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అమ్మకాల్లో మరింత వృద్ధి ఖాయమని వ్యాపారులు, ఆబ్కారీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రోజు వారీగా గ్రేటర్‌లో సుమారు రూ.10 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతాయి. కానీ ఎన్నికలు రావడంతో అమ్మకాలు రూ.15 కోట్లకు పైగానే జరుగుతున్నట్లు అంచనా. రానున్న మూడు రోజుల్లో రోజు వారీ అమ్మకాలు రూ.25 కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.  

 అక్రమ మద్యంపై నజర్
 ఎన్నికల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున నకిలీ మద్యం, చీప్ లిక్కర్ దిగుమతి అయ్యే అవకాశముంది. దీనిపై ఆబ్కారీ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. మరోవైపు గుడంబా అడ్డాలపై నిఘా పెట్టింది. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి అక్రమ మద్యం విక్రయించే అవకాశమున్న ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. నాంపల్లిలోని ఆబ్కారీ భవన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.
 
 మోత.. రోత
 ఎన్నికల ఎస్సెమ్మెస్‌లతో సిటీజనుల ఫోన్లు మోత మోగుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అని అభ్యర్థులు బల్క్ ఎస్సెమ్మెస్‌లు, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం(ఐవీఆర్‌ఎస్) కాల్స్‌ను తెగ వినియోగించుకుంటున్నారు. ఈ న్యూసెన్స్‌తో సిటీజనులు విసిగిపోతున్నారు. మరో పక్క ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారికి రోమింగ్‌తో ఆర్థికంగానూ భారం పడుతోంది. మొన్నటి వరకు ‘మీ డివిజన్‌లో మా పార్టీ తరఫున ఏ అభ్యర్థిని బలపరుస్తారం’టూ ఎస్సెమ్మెస్‌ల పర్వం కొనసాగించిన పార్టీలు.. ఇప్పుడు ‘మా పార్టీకే ఓటేయండి’ అంటూ అభ్యర్థిస్తున్నాయి. ఓ పక్క ఎస్సెమ్మెస్‌లు.. మరోపక్క కాల్స్‌తో సిటీజనులు తలలు పట్టుకుంటున్నారు. కొందరికి వారి డివిజన్ పరిధి అభ్యర్థులవే వస్తుండగా.. మరికొందరికి సంబంధం లేని డివిజన్ల అభ్యర్థుల నుంచీ వస్తున్నాయి. రోమింగ్‌లో ఉన్న వారికి కాల్స్‌తో ఆర్థిక భారం తప్పట్లేదు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement