Illegal alcohol
-
మద్యం కేసులో టీడీపీ నేత ‘ఉమా’ అనుచరుడు
రెడ్డిగూడెం: తెలుగుదేశం నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అనుచరుడు అయ్యంకి బాలస్వామి అక్రమ మద్యం కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించి, విక్రయిస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారన్న సమాచారం మేరకు ఓ టీడీపీ నాయకుడిని రెడ్డిగూడెం పోలీసులు సోమవారం వలపన్ని పట్టుకున్నారు. రెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు సోమవారం వివరాలు వెల్లడించారు. రెడ్డిగూడెం మండలంలోని బూరుగగూడెం గ్రామంలో తెలంగాణ నుంచి అక్రమంగా తరలించిన మద్యంను నిల్వ ఉంచారని అందిన సమాచారం మేరకు రెడ్డిగూడెం ఎస్ఐ డి.ఆనంద్‌కుమార్ తన సిబ్బందితో కలసి దాడి చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమా అనుచరుడు, బూరుగగూడెం గ్రామానికి చెందిన నిందితుడు అయ్యంకి బాలస్వామి తన ఇంటికి సమీపంలో నిల్వ చేసిన రూ.68,120 విలువ చేసే 524 తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కాగా భారీగా తెలంగాణ మద్యాన్ని పట్టుకుంటున్న పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ అభినందించారని డీఎస్పీ తెలిపారు. -
సరిహద్దుల్లో నిఘా పెంచండి
సాక్షి, కర్నూలు: అక్రమ మద్యం, నాటుసారా తయారీపై సరిహద్దుల్లో నిఘా పెంచాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి అన్ని జిల్లాల ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. నూతన మద్యం విధానం అమల్లో భాగంగా అక్టోబర్ 1 నుంచి ప్రారంభించనున్న ప్రభుత్వం మద్యం దుకాణాల ఏర్పాట్లపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాంబశివరావు, ఎక్సైజ్ కమిషనర్ ఎంఎం నాయక్‌తో కలిసి గురువారం జిల్లాల వారీగా డిప్యూటీ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కర్నూలు డిప్యూటీ కమిషనర్ చెన్నకేశవరావు, ఎక్సైజ్ సూపరింంటెండెంట్లు ఆర్.సుధాకర్, మధుసూదన్ రెడ్డి, కర్నూలు, నంద్యాల డిపో మేనేజర్లు వేణుగోపాల్, సుధాకర్‌రెడ్డిలతో పాటు అన్ని స్టేషన్ల ఎస్హెచ్ఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ స్వామి మాట్లాడుతూ మద్యం నియంత్రణ, నిషేధం అమలుకు ఎక్సైజ్ అధికారులు మరింత పటిష్టంగా పని చేయాలన్నారు. జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాట్లపై తీసుకున్న చర్యల గురించి డిప్యూటీ కమిషనర్ చెన్నకేశవరావును అగిడి తెలుసుకున్నారు. ఫైలెల్ ప్రాజెక్టు కింద మొదటి విడత సెప్టెంబర్ 1 నుంచి జిల్లాలో 21 ప్రభుత్వం మద్యం దుకాణాలు ప్రారంభించనున్నట్లు చెన్నకేశవరావు మంత్రి దృష్టికి తెచ్చారు. అద్దె భవనాలు, డిపో నుంచి దుకాణాలకు మద్యం రవాణా ఫర్నిఛర్ ఏర్పాటు తదితర వాటికి కోసం టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, అద్దె దుకాణాలను స్వాధీనం చేసుకున్నట్లు డీసీ.. మంత్రికి వివరించారు. మొదటి ఏడాది 20 శాతం మద్యం దుకాణాలు తగ్గించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న 205 దుకాణాలను 164కు కుదించినట్లు వివరించారు. అక్టోబర్ 1 నుంచి రెండో విడత 143 దుకాణాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు డీసీ వెల్లడించారు. దుకాణాల ఏర్పాటు, నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏపీలోకి ఇతర రాష్ట్రాల మద్యం రవాణా కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
నాటుసారా తరలిస్తున్న టీడీపీ నేత అరెస్ట్
సాక్షి, కాకినాడ : సముద్రం మీదుగా బోటులో నాటుసారా తరలిస్తుండగా నేమాంకు చెందిన టీడీపీ నేత మేడిశెట్టి బుజ్జి ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ నేపథ్యంలో బుజ్జి నుంచి పెద్ద ఎత్తున సారాయి, బోటు, ఆటోను స్వాధీనం పరుచుకున్నట్లు ఎక్సైజ్ సిబ్బంది వెల్లడించింది. కాకినాడకి చెందిన ఓ టీడీపీ నేత అండదండలతో బుజ్జి నాటుసారా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. గత మార్చిలోనూ ఇదే విధంగా నాటుసారా తరలిస్తుండగా కాకినాడ రూరల్ పోలీసులకు చిక్కినట్లు అధికారులు వెల్లడించారు. -
తరతరాలుగా తండాల్లో ఇదే పరిస్థితి
సాక్షి, ఆత్మకూరు(కర్నూలు): ఆదిమానవుడి ఆనవాలుగా భావించే ఆదిమ గిరిజన చెంచులు ఆంత్రోపాలజీ నేపథ్యంలో అమూల్యమైనవారు. జన్యువైవిధ్య లేమివల్ల వారి సగటు జీవన ప్రమాణమే 45 ఏళ్లు. అయితే వారిలో ఉన్న విపరీతమైన మద్యపాన వ్యసనం కారణంగా అది మరింతగా తగ్గిపో యింది. ఫలితంగా ఏ గూడెం చూసినా ఈ వ్యసనంతో మృతి చెందిన వారే అధికం. తద్వారా పాతికేళ్లు నిండకుండానే వారి భార్యలు వితం తువులుగా మారుతున్నారు. వీరంతా ఆ జాబితాలో పింఛన్ కోసం ప్రతి నెలా గ్రామ సచివాలయాల వద్ద బారులు తీరి కనిపిస్తుంటారు. ఇటీవలే జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న వీర పాండియన్ కొత్తగా పంచాయతీగా మారిన బైర్లూటి చెంచుగూడెం సందర్శన సందర్భంగా 91 మంది(బైర్లూటి, నాగలూటిలో) వితంతు పింఛన్ తీసుకుంటున్నట్లు తెలుసుకుని విస్తుపోయారు. స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో కూడా ఒక చెంచు కుటుంబం 5 లీటర్లలోపు నాటుసారా కలిగి ఉండడం ఆమోదయోగ్యమే. అయితే క్రమేపి చెంచులను పునరావాసం పేరిట అడవికి దూరం చేయడం, బైర్లూటి లాంటి ప్రధాన రహదారికి ఆనుకుని ఉండే గూడేల్లో బయటి ప్రపంచ విష సంస్కృతి నేరుగా ప్రవేశించడం వంటి కారణాలతో ఆహారపు అలవాటులో భాగంగా నాటుసారా కాసుకునే చెంచులు.. లిక్కర్ వ్యాపారుల దొంగదందాతో తయారయ్యే అత్యంత విషతుల్యమైన సారా సేవనానికి అలవాటు పడిపోయారు. బెల్లం ఊట, తుమ్మ చెక్కతో మురగబెట్టి నాటు సారా తయారు చేసుకునే చెంచులు అసలు తుమ్మ చెట్టన్నది నల్లమల అటవీ సమీప గ్రామాల్లో విలుప్తమై పోవడంతో యూరియా, పాత ప్లాస్టిక్ చెప్పులు, నవాసగ్రం(రసాయనం) వినియోగిస్తున్నారు. ఇలాంటి సారా తాగి జీవశ్చవాలుగా మారి చివరకు చిన్నవయసులోనే మరణిస్తున్నారు. ప్రాణాంతకంగా చెంచుల ఆహారపు అలవాటు.. నాటుసారా సేవనం అనాదిగా చెంచుల ఆహారపు అలవాటులో భాగంగా మారింది. సారా కాసే పద్ధతి వారికి వంశపారంపర్యంగా అలవడింది. ఔషధయుతమైన వన అవశేషాల నుంచి సారా కాసుకునేవారు. తీయని .. మత్తెక్కించే వాసనతో ఉండే విప్పలను సేకరించి సారా తయారు చేసుకునేవారు. తీయదనం కోసం తునికి పండ్లు, చిటిమిటి పండ్ల గుజ్జు వినియోగించేవారు. చెంచులు నాటుసారా కాయడం, తమ వద్ద ఉంచుకోవడాన్ని బ్రిటీష్ వారి హయాంలో నేరంగా పరిగణించేవారు కాదు. గిరిజనుల పాలిట మృత్యుపాశం.. అమాయకపు ఆదిమ చెంచు గిరిజనుల పాలిట నాటుసారా.. మృత్యుపాశంగా మారింది. మితిమీరి తాగుతుండడంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. క్రమంగా శరీరం శుష్కించి చిన్న వయసులోనే పురుషులు మరణిస్తుంటే వారి భార్యలు అంతకంటే చిన్న వయసులో వితంతువులుగా మారుతున్నారు. ఫలితంగా గూడేల్లో ఎక్కడ చూసినా ఇలాంటి వారే కనిపిస్తుండడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. చెంచుల మనుగడకే ఆటంకంగా మారిన నాటుసారా తయారీ, రవాణాను అరికట్టడంలో దశాబ్దాలుగా ప్రభుత్వ శాఖల సమష్టి కృషి కనిపించడంలేదు. 14 ఏళ్లకే పెళ్లి.. 17 ఏళ్లకే వైదవ్యం.. సాంస్కృతిక వెనుకబాటు కారణంగా చెంచులు తమ పిల్లలకు అతిపిన్న వయసులోనే పెళ్లిళ్లు చేస్తున్నారు. 13 ఏళ్లు నిండక ముందే చెంచు బాలికలకు వివాహ యత్నాలు మొదలవుతాయి. 14 ఏళ్లకే పెళ్లిళ్లవుతాయి. 16ఏళ్లలోపే గర్భవతులయ్యే చెంచు బాలికలు రక్తహీనత కారణంగా ప్రసవంలో మరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రసవాల్లో చచ్చి బతికే చెంచు బాలికలకు విపరీతమైన మద్యపాన వ్యసనపరులైన భర్తల అనారోగ్యం పెద్ద సమస్యగా మారుతోంది. తీవ్ర మద్యపాన సేవనంతో పెళ్లయిన నాలుగేళ్లకే మరణించే చెంచులు ఎందరో ఉన్నారు. ఈ కారణంగా కనీసం ఇరవై ఏళ్లు నిండకుండానే వారి భార్యలు వైదవ్యానికి గురవుతున్నారు. గూడెంలో మా బతుకులు మారాలి.. సారాయి తాగితాగి గూడెంలో చిన్న వయసులో మొగోళ్లు సచ్చి పోతున్నారు. వాళ్ల పెండ్లాలు ఇరవై ఏళ్లు నిండకుండానే విధవలై చంటిపిల్లలతో నానాయాతన పడుతున్నారు. గూడెంలో సారా కాయొద్దని ఎంత సెప్పినా వినడం లేదు. గూడేల నుంచి సారా పోయినప్పుడే మా బతుకులు మారేది. – గొలుసమ్మ, గూడెం పెద్ద, బైర్లూటి ఆరో తరగతిలోనే పెళ్లయింది.. మా పెద్దలు ఆరోతరగతిలోనే బడి మాన్పించి పెళ్లి సేసినారు. పెళ్లయిన నాలుగేళ్లకే నా మొగుడు నాగన్న సారాయి తాగితాగి అనారోగ్యంతో సచ్చిపోయినాడు. ఒక బిడ్డతో బతుకు నెట్టుకొస్తున్నాను. మా గూడెంలో ఎక్కడ చూసినా నాలాంటోళ్లే ఉన్నారు. – అర్తి నాగమ్మ, వితంతు పింఛన్‌దారు, బైర్లూటి కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరోగ్య ఉప కేంద్రాన్ని హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రంగా మార్చబోతోంది. ఈ కేంద్రాల్లో డీ –అడిక్షన్ సెంటర్లు కూడా ఉంటాయి. చెంచులను సారా మాన్పించేందుకు ఈ కేంద్రాలు కృషి చేస్తాయి. – డాక్టర్ సి.గోపాల్ ,బైర్లూటి -
ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి, అమరావతి: అక్రమ మద్యం విక్రయాల నియంత్రణంతోపాటు నిర్ణీత ధర కన్నా అధికంగా విక్రయించకుండా అడ్డుపడుతున్న ఎక్సైజ్ కమిషనర్ పి.లక్ష్మీనర్సింహంపై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. రాష్ట్రంలో ఇద్దరు కలెక్టర్లు, పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. లిక్కర్ లాబీ ఒత్తిళ్లతోనే... ఎన్నికల ముందు మద్యం ఏరులై పారకుండా, ఇష్టానుసారంగా విక్రయించకుండా అడ్డుపడుతున్న లక్ష్మీనర్సింహంను ఆ పదవి నుంచి తప్పించాలని అధికార పార్టీ నేతలతో పాటు లిక్కర్ లాబీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎప్పటి నుంచో తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తెస్తోంది. అయితే ఆయన ఒక్కరినే బదిలీ చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని గ్రహించి ఇప్పుడు మిగతా ఐఏఎస్‌లతోపాటు ఎక్సైజ్ కమిషనర్ లక్ష్మీనర్సింహంను కూడా బదిలీ చేశారు. పి.లక్ష్మీనర్సింహంను తాజాగా చేనేత– జౌళి శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. పర్యాటక, యువజన సర్వీసుల కార్యదర్శిగా ఉన్న ముఖేశ్‌కుమార్ మీనాను ఎక్సైజ్ కమిషనర్‌గా బదిలీ చేశారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు పర్యాటక, యువజన సర్వీసుల బాధ్యతలను కూడా ఆయనే నిర్వహిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శ్రీకాకుళం, కృష్ణా కలెక్టర్ల బదిలీ.. శ్రీకాకుళం, కృష్ణా జిల్లా కలెక్టర్లతో పాటు పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. చేనేత–జౌళి శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీనివాస శ్రీనరేశ్‌ను గనులశాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. శ్రీనివాస శ్రీ నరేశ్‌కు గనుల శాఖ డైరెక్టర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గనుల శాఖ కార్యదర్శి బి.శ్రీధర్‌ను పశు సంవర్ధక శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డిని పర్యాటక అధారిటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం.రామారావును శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతంను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బదిలీ చేశారు. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మహ్మద్ ఇంతియాజ్‌ను కృష్ణా జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పి, భాస్కర్‌ను సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ కె.విజయను సాధారణ పరిపాలన శాఖ డిప్యూటీ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న క్రితికా శుక్లాను కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. పర్యాటక శాఖ డైరెక్టర్‌గా పని చేస్తున్న హిమాన్షు శుక్లాను గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. ముగ్గురు ఐపీఎస్‌ల బదిలీ సాక్షి, అమరావతి: ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు రేంజ్ ఐజీపీగా పనిచేస్తున్న కె.వి.వి.గోపాలరావును ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీపీగా బదిలీ చేశారు. ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీపీ రాజీవ్ కుమార్ మీనాను గుంటూరు రేంజ్ ఐజీపీగా బదిలీ చేశారు. విజయవాడ సిటీ డీసీపీగా పనిచేస్తున్న గజరావు భూపాల్‌ను మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ కమాండెంట్‌గా బదిలీ చేశారు. -
మద్యం స్వాధీనం
సాక్షి, ఖిలా వరంగల్: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురు మహిళలపై కేసు నమోదు చేసి 18లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ చంద్రమోహన్ తెలిపారు. ఖిలా వరంగల్ ఎక్సైజ్ స్టేషన్ ఎస్సై సరిత ఆధ్వర్యంలో శుక్రవారం పడమర, తూర్పు, మధ్య కోటతోపాటు ఉర్సు, రంగశాయిపేట, కరీమాబాద్ ఎస్‌ఆర్‌ఆర్‌తోట ప్రాంతంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. రంగశాయిపేట ప్రాంతానికి చెందిన పత్తి మనెమ్మ, తూర్పుకోటకు చెందిన కనుకుంట్ల లావణ్య, ఉర్సు బీఆర్‌నగర్‌కు చెందిన చంద యాకమ్మ ఇంట్లో తనిఖీ చేయగా వారి వద్ద లభించిన 18లీటర్ల మద్యం స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేశారు. -
అక్రమ మద్యం పట్టివేత
-
అక్రమ మద్యం నిల్వల పట్టివేత
మంచిర్యాల: మండలంలోని కర్ణమామిడి గ్రామంలో ఆదివారం రాత్రి పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించగా అక్రమంగా నిల్వ ఉంచి మద్యంను పట్టుకున్నారు. ఈ సందర్భంగా హాజీపూన్ ఎస్సై తహసీనుద్దీన్ మాట్లాడుతూ, జనమైత్రి పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో జనమైత్రిపై ప్రజలకు అవగాహన కలిపిస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా చైతన్యంతో గ్రామాల్లో జరిగే అక్రమాలు, అన్యాయాలపై సమాచారం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. తనకు వచ్చిన సమాచారం మేరకు కర్ణమామిడిలోని లగిశెట్టి తిరుపతి దుకాణంలో తనిఖీలు నిర్వహించగా 37 బీర్లు, 3 విస్కీ బాటిళ్లు లభించగా వాటిని స్వాధీనం చేసుకుని అతని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. తనిఖీల్లో కర్ణమామిడి జనమైత్రి పోలీస్ అధికారి సంపత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఘనాపాటి.. బూదాటి
ఆది నుంచి రాధాకృష్ణయ్య వివాదాస్పదుడే నెల్లూరు(క్రైమ్): అక్రమ మద్యం కేసులో ఐఎన్టీయూసీ నేత, మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధాకృష్ణయ్యను శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జిల్లాలో చర్చనీయాంశమైంది. కొడవలూరు మండలం రామన్నపాళేనికి చెందిన బూదాటి రాధాకృష్ణయ్య కార్మిక నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. కార్మికుల సమస్యలను పరిష్కరిస్తూ ఐఎన్టీయూసీ జిల్లా నేతగా ఎదిగాడు. ఐఎన్టీయూసీ రాష్ట్ర నేతలతో తనకున్న పరిచయాలను వినియోగించుకొని గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీలోని ఓ వర్గానికి దగ్గరయ్యాడు. ఆర్టీసీ పాలవకర్గ సభ్యుడిగా సైతం విధులు నిర్వహించాడు. అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర నేతల అండదండలతో నామినెటెడ్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆది నుంచి వివాదాస్పదుడు రాధాకృష్ణయ్య ఆది నుంచే వివిదాస్పదుడు. అనేక అవినీతి ఆరోపణలు కూడా మూటగట్టుకున్నాడు. వెంకటాచలంలోని ఎఫ్‌సీఐ గోడౌన్, ఆర్టీసీ, విద్యుత్‌శాఖలో షిఫ్ట్టు ఆపరేటర్లు, వాచ్మెన్లుగా ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.2 కోట్లు వసూలు చేశాడని కార్మికులు నెలల తరబడి ఆందోళనలు సైతం చేశారు. పలువురు బాధితులు వివిధ పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం సంచలనం రేకెత్తించింది. కొందరు కార్మిక నేతలు సైతం ఆయన వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహం సైతం అప్పట్లో వ్యక్తం చేశారు. దీంతో ఆయన నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చాడు. 2009లో సాఫల్య బేవరేజెస్ అండ్ డిస్టిలరీస్ ప్రైవేటు లిమిటెడ్‌ను స్థాపించాడు. ఉక్రెయిన్‌లోని ఓ సంస్థతో ఒప్పందం చేసుకొని 10,800 వోడ్కా బాటిళ్లను దిగుమతి చేసుకున్నాడు. వాటిని గాంధీనగర్‌లోని ప్రైవేటు గోడౌన్లలో పెట్టాడు. అదే క్రమంలో స్కాట్‌ల్యాండ్‌లోని స్విస్కో లిమిటెడ్ సంస్థ నుంచి విస్కీ డీలర్ షిప్ తీసుకుని 1250 కేసులను దిగుమతి చేసుకున్నాడు. వాటిని బాలానగర్‌లోని ప్రభుత్వ గోడౌన్లో పెట్టాడు. 2014లో అతని లెసైన్సు పీరియడ్ ముగిసింది. అప్పటి నుంచి అనధికారికంగా మద్యం బాటిళ్లను విక్రయించసాగాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న హైదరాబాద్ ఎక్సైజ్ అధికారులు శుక్రవారం అర్ధరాత్రి బూదాటి ఇంటితో పాటు గోదాములపై దాడులు చేశారు. దాడుల్లో 455కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకుని సునీల్‌కుమార్, అభిన వకుమార్, హర్వీందర్సింగ్తో పాటు బూదాటిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ రూ.1.75కోట్లు, అనధికారికంగా విక్రయించిన మద్యం విలువ రూ.90లక్షలు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. -
నవదీప్ గెస్ట్‌హౌస్‌పై పోలీసుల దాడి
అక్రమ మద్యం పట్టివేత, ఒకరి అరెస్టు మోమిన్‌పేట: సినీహీరో నవదీప్‌కు చెందిన గెస్ట్‌హౌస్‌పై ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారు. అక్రమంగా వినియోగిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకొని ఒకరిని అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండలం చక్రంపల్లిలో ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకొంది. ఎక్సైజ్ సీఐ అశోక్, లా అండ్ ఆర్డర్ ఎస్ఐ రాజు కథనం ప్రకారం.. చక్రంపల్లిలోని ధరణి వెంచర్స్‌లో హీరో నవదీప్ ఎకరం భూమి కొనుగోలు చేసి గెస్ట్‌హౌస్ నిర్మించుకున్నారు. శుక్రవారం రాత్రి ఆయన కుటుంబీకులు, స్నేహితులు దాదాపు 30 మంది అందులో విందు చేసుకున్నారు. విదేశీ మద్యం వినియోగిస్తున్నారనే సమాచారంతో మర్పల్లి ఎక్సైజ్ సీఐ అశోక్ ఆధ్వర్యంలో ఎస్ఐ రాజు సిబ్బందితో దాడులు చేశారు. అక్కడ ఉన్న 26 కింగ్‌ఫిషర్ బీర్లు, అబ్సలూట్ వోడ్కా బాటిల్ ఒకటి, జానీవాకర్ బ్లాక్‌లేబుల్, బాకాడి బ్లాక్ రమ్, బ్లూ రిబైన్డ్ జిన్లు ఒక్కోటి చొప్పున స్వాధీనం చేసుకున్నారు. విందులో మద్యం వినియోగించేందుకు అనుమతి తీసుకోలేదని సీఐ తెలిపారు. గెస్ట్‌హౌస్ నిర్వాహకుడు సాయి సూర్యనారాయణరాజును అదుపులోకి తీసుకొని శనివారం రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. దీంతోపాటు ధరణి వెంచర్ యజమానిపైనా కేసు పెట్టి విచారణ జరుపుతున్నామన్నారు. భవనాలకు అనుమతి లేదు.. ధరణి వెంచర్లో భవనాల నిర్మాణానికి అనుమతులు లేవని చక్రంపల్లి గ్రామ కార్యదర్శి మల్లేశ్ పేర్కొన్నారు. ఎన్వోసీ మాత్రమే ఇచ్చామన్నారు. అక్రమంగా నిర్మించిన గెస్ట్‌హౌస్ విషయంలో ఇప్పటికే మూడుసార్లు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. -
కలెక్షన్.. అటెన్షన్.. మధ్యలో టార్గెట్
* ఓవైపు మద్యం అమ్మకాల పెంపు.. మరోవైపు కల్తీ, గుడుంబాల నియంత్రణ * జిల్లాల్లో ఎక్సైజ్ కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ల * విస్తృత పర్యటనలు సాక్షి, హైదరాబాద్: అక్రమ మద్యాన్ని అరికట్టడంతోపాటు వార్షిక ఆదాయాన్ని పెంచుకునేందుకు ఆబ్కారీ శాఖ తంటాలు పడుతోంది. ఆబ్కారీ శాఖ ఫిబ్రవరి నెల వరకు సాగించిన మద్యం అమ్మకాలు, లెసైన్స్ ఫీజు, ప్రివిలేజ్ ఫీజు తదితరాల ద్వారా వచ్చిన మొత్తంలో ఖర్చులు, చెల్లింపులు పోగా వచ్చిన రెవెన్యూ రూ.10, 238 కోట్లు. ఇందులో వాణిజ్యపన్నుల శాఖకు వ్యాట్, సీఎంఆర్ఎఫ్ చెల్లింపులుపోగా రూ.3,484 కోట్లు ఆదాయంగా సమకూరింది. అయితే, కేవలం రెవెన్యూ రూపంలోనే రూ.12,500 కోట్ల మేర వార్షికాదాయం సమకూర్చుకోవాలన్న లక్ష్యంతో ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ తనవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు సాగే మద్యం అమ్మకాలు, డిస్టిలరీలు, బ్రూవరీలు చెల్లించే ఫీజుల రూపంలో ఈ లక్ష్యం చేరుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. కఠిన చర్యలు... అదే సమయంలో గుడుంబా రహిత జిల్లాలుగా ప్రకటించిన 8 జిల్లాల్లో మళ్లీ నాటుసారా తయారీ జరగకుండా కఠినంగా వ్యవహరించాలని కూడా ఆబ్కారీ శాఖ భావిస్తోంది. ఈ బాధ్యత ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ అకున్ సబర్వాల్ తీసుకున్నారు. 8 జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లను అప్రమత్తం చేసి, ఆయా సర్కిళ్ల ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లను బాధ్యులను చేస్తున్నారు. హైదరాబాద్, వరంగల్ మినహా మిగతా ఎనిమిదింటిని గుడుంబా రహిత జిల్లాలుగా ప్రకటించారు. గుడుంబాను నిర్మూలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటనలోనే నిర్ణయానికి వచ్చి, ఆ దిశగా చర్యలకు ఆదేశించినా వరంగల్‌లో ఇంకా గుడుంబా పేదలను పట్టి పీడిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో గుడుంబాను నిర్మూలించే పనిని అకున్‌సబర్వాల్ భుజానికి ఎత్తుకున్నారు. ఈ నేపథ్యంలో కమిషనర్ చంద్రవదన్, అకున్ సబర్వాల్ విడివిడిగా జిల్లా పర్యటనలు నిర్వహిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మెదక్ వంటి జిల్లాల్లో ఈనెలాఖరు వరకు లక్ష్యాలకు అనుగుణంగా మద్యం అమ్మకాలు జరిపేలా ఒత్తిళ్లు తెస్తున్నారు. రాష్ట్రానికి ప్రధాన ఆదాయవనరుగా మారిన ఆబ్కారీ శాఖ నుంచి భారీ రెవెన్యూ సాధించాలన్న ఆలోచనతో ఉన్న ఇద్దరు అధికారులు ఎంత వరకు సఫలీకృతులవుతారో చూడాలి. -
ఎన్నికల కిక్కు!
15 రోజుల్లో రూ.247 కోట్ల మద్యం అమ్మకాలు మరో మూడు రోజుల్లో భారీగా పెరిగే అవకాశం అక్రమ అమ్మకాలపై ఆబ్కారీ శాఖ నిఘా సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. అదే తరహాలో మద్యం అమ్మకాలూ పెరిగాయి. ‘మూడు ఫుల్లు.. ఆరు క్వార్టర్లు’ అన్న చందంగా సిటీలో లిక్కర్ సేల్స్ జోరందుకున్నాయి. ఎన్నికల హడావిడి మొదలైనప్పటి నుంచి 15 రోజుల్లో సుమారు రూ.247 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయంటే అతిశయోక్తి కాదు. ఇక మరో నాలుగు రోజుల్లో అమ్మకాలు మరింత ఊపందుకోనున్నట్లు ఆబ్కారీ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎలక్షన్ జోష్‌లో సిటీలోని వైన్స్, బార్లు, రెస్టారెంట్లకు గిరాకీ అమాంతంగా పెరిగింది. మందు.. చిందు ఓట్ల కోసం కోటి తిప్పలు పడుతున్న అభ్యర్థులు.. మందు కోసం మంచినీళ్ల ప్రాయంలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ప్రచార పర్వంలో చుక్క లేనిదే జోష్ రాదని భావిస్తున్న అభ్యర్థులు.. మందును ‘ఫుల్లు’ కొనుగోలు చేసి కార్యకర్తలను ఖుషీ చేస్తున్నారు. 15 రోజుల్లో ఐఎంఎల్ మద్యం ఐదు లక్షల లీటర్లు, నాలుగు లక్షల లీటర్ల బీరు తాగేశారు మందుబాబులు. చలికాలం కావడంతో ఐఎంఎల్ మద్యానికే మందుబాబులు ఓటేస్తున్నారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అమ్మకాల్లో మరింత వృద్ధి ఖాయమని వ్యాపారులు, ఆబ్కారీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రోజు వారీగా గ్రేటర్లో సుమారు రూ.10 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతాయి. కానీ ఎన్నికలు రావడంతో అమ్మకాలు రూ.15 కోట్లకు పైగానే జరుగుతున్నట్లు అంచనా. రానున్న మూడు రోజుల్లో రోజు వారీ అమ్మకాలు రూ.25 కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అక్రమ మద్యంపై నజర్ ఎన్నికల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున నకిలీ మద్యం, చీప్ లిక్కర్ దిగుమతి అయ్యే అవకాశముంది. దీనిపై ఆబ్కారీ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. మరోవైపు గుడంబా అడ్డాలపై నిఘా పెట్టింది. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి అక్రమ మద్యం విక్రయించే అవకాశమున్న ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. నాంపల్లిలోని ఆబ్కారీ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. మోత.. రోత ఎన్నికల ఎస్సెమ్మెస్‌లతో సిటీజనుల ఫోన్లు మోత మోగుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అని అభ్యర్థులు బల్క్ ఎస్సెమ్మెస్‌లు, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం(ఐవీఆర్ఎస్) కాల్స్‌ను తెగ వినియోగించుకుంటున్నారు. ఈ న్యూసెన్స్‌తో సిటీజనులు విసిగిపోతున్నారు. మరో పక్క ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారికి రోమింగ్‌తో ఆర్థికంగానూ భారం పడుతోంది. మొన్నటి వరకు ‘మీ డివిజన్లో మా పార్టీ తరఫున ఏ అభ్యర్థిని బలపరుస్తారం’టూ ఎస్సెమ్మెస్‌ల పర్వం కొనసాగించిన పార్టీలు.. ఇప్పుడు ‘మా పార్టీకే ఓటేయండి’ అంటూ అభ్యర్థిస్తున్నాయి. ఓ పక్క ఎస్సెమ్మెస్‌లు.. మరోపక్క కాల్స్‌తో సిటీజనులు తలలు పట్టుకుంటున్నారు. కొందరికి వారి డివిజన్ పరిధి అభ్యర్థులవే వస్తుండగా.. మరికొందరికి సంబంధం లేని డివిజన్ల అభ్యర్థుల నుంచీ వస్తున్నాయి. రోమింగ్‌లో ఉన్న వారికి కాల్స్‌తో ఆర్థిక భారం తప్పట్లేదు. -
ఆటకట్టించే మందేది?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఒడిశాలో తయారైన అక్రమ మద్యం మూలాలు జిల్లాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. నెలరోజుల వ్యవధిలోనే జిల్లాలోని పలు చోట్ల లక్షలాది రూపాయల విలువైన పన్ను చెల్లించని, నకిలీ మద్యం లభించడం అధికారులను విస్తుపోయేలా చేస్తున్నా.. దీన్ని అరికట్టేందుకు ఏం చేయాలన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. నకిలీ మద్యం (ఎన్డీపీఎల్), బిల్లులు లేకుండా సరఫరా అవుతున్న సరకు వివరాలు తెలుసుకునేందుకు, గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయించినా కనుగొనేందుకు ఎక్సైజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్‌ను రంగంలోకి దించినా సిండికేట్ వ్యాపారులు ఏమాత్రం వెరవకుండా రహస్య మార్గాల్లో మద్యం అక్రమ రవాణా, అమ్మకాలకు పాల్పడుతూనే ఉన్నారు. అధికారులకు తెలియనది కాదు జిల్లా వ్యాప్తంగా నకిలీ మద్యం ఏరులా పారుతున్న విషయం ఎక్సైజ్ శాఖలోని కొంతమంది అధికారులకు స్పష్టంగా తెలుసు. నెలవారీ వసూళ్లకు అలవాటు పడిన ఈ అధికారులు తెరవెనుక వ్యాపారులకు సహకరిస్తున్నారు. ఇచ్ఛాపురం పరిధిలో గత నెల 9, 10 తేదీల్లో పట్టుబడిన ఒడిశా మద్యం రాకెట్ వ్యవహారాలు స్థానిక సీఐ కనుసన్నల్లోనే సాగిందన్న ప్రచారం ఉంది. ఆ కేసు ఒడిశాకు బదిలీ కావడం, సెప్టెంబర్ 16న అరకభద్రలోని ఓ చెరువులో అక్రమ మద్యం బాటిళ్లు లభ్యం కావడం వెనుకా పెద్ద కుట్రే దాగి ఉంది. లారీ లోడు సరుకు సరిహద్దు దాటి జిల్లాకు వస్తోందన్న సమాచారంతోనే భారీ ఎత్తున ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగినా.. ఈ దాడి విషయాన్ని అదే శాఖలోని కొంతమంది సీఐలు లీక్ చేయడం వల్లే ఆపరేషన్ ఫెయిల్ అయిందని సిబ్బందే చెబుతున్నారు. మద్యం వేలం పాటల సమయంలో కొన్ని దుకాణాలు తమకు కావాల్సిన వ్యక్తులకే దక్కేలా చేయించడం, వాహనాలు కొనుగోలు చేసి ఎక్సైజ్ శాఖకే అద్దెకివ్వడంలో సిబ్బంది పాత్ర లేకపోలేదని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. గత నెల పట్టణంలోని ఎస్వీఆర్ బార్ అండ్ రెస్టారెంట్లో సోదాలు నిర్వహించడం, ఆదిత్య దుకాణంలో సోదాలు జరపడం, సీజ్ చేయడం, నకిలీ మద్యం రాకెట్ విశాఖ జిల్లాకు విస్తరించడం వెనుక తమ శాఖ సిబ్బంది అండదండలు ఉన్నాయని ఇటీవలే అధికారులు గుర్తించారు. నకిలీ మద్యం రాకెట్ బయటపడిన తరువాత ఓ సీఐ ఇక్కడ నుంచి సెలవుపై వెళ్లిపోయేందుకు ప్రయత్నించడాన్నీ అధికారులు అనుమానిస్తున్నారు. తీగ లాగి డొంకను కదిలించేందుకు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. ఓరుగంటి వారి కిక్కు ఎస్వీఆర్ దుకాణంలో నకిలీ మద్యం బయటపడిన తరువాత యజమాని ఓరుగంటి ఈశ్వరరావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని అధికారులు చెబుతున్నారు. అయితే కొందరు అధికారులకు ఆయన కదలికలు తెలుసన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు నుంచి బయట పడే మార్గాలు, బెయిల్ పొందేందుకు అవసరమైన సలహాలను ఆయనకు వారే అందిస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో చక్రం తిప్పుతున్న ఓ మంత్రి వద్ద కూడా ఓరుగంటి సమాచారం ఉందని విశ్వసనీయ సమాచారం. ఈ పరిస్థితుల్లో ఎక్సైజ్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగితేనే ఓరిగంటి గుట్టు రట్టవుతుంది. -
అక్రమ మద్యం వ్యాపారం గుట్టురట్టు
రూ.12 లక్షల మద్యం నిల్వలు స్వాధీనం గుడ్లవల్లేరు నుంచి సరకు తెచ్చి అక్రమంగా విక్రయాలు నిర్వాహకులు తెలుగు తమ్ముళ్లే! మచిలీపట్నం : మచిలీపట్నంలో అక్రమ మద్యం వ్యాపారం గుట్టు రట్టయ్యింది. బైపాస్ రోడ్డులోని బైపాస్ వైన్స్‌లో పెద్ద మొత్తంలో అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్న మద్యాన్ని ఎక్సైజ్‌శాఖ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. బైపాస్ వైన్స్‌ను తెలుగు తమ్ముళ్లే నిర్వహించటం గమనార్హం. ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని అంచనా. ఎక్సైజ్ సీఐ రామశివ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నం బైపాస్ రోడ్డులోని బైపాస్ వైన్స్‌కు కేటాయించిన మద్యం కాకుండా గుడ్లవల్లేరు, గుడివాడ ప్రాంతంలోని మద్యం షాపులకు కేటాయించిన మద్యాన్ని ఇక్కడకు తీసుకువచ్చి విక్రయాలు జరుపుతున్నారనే ఫిర్యాదు అందిందింది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం ఎక్సైజ్ ఏఈఎస్ ఎం సునీత, సీఐ రామశివ, ఇతర సిబ్బంది బైపాస్ వైన్స్‌పై దాడి చేశారు. మద్యం దుకాణం వెనుక వైపు ఉన్న పెద్ద గదిలో మద్యాన్ని నిల్వ ఉంచారు. ఈ గదికి సంబంధించిన తాళాలు తెరవాలని ఎక్సైజ్ సిబ్బంది, అధికారులు కోరినా మద్యంషాపు యజమానులు తాళం తీసేందుకు అంగీకరించలేదు. దీంతో ఆ ప్రాంత వీఆర్వో సమక్షంలో తాళం పగలగొట్టి తనిఖీలు చేస్తామని అధికారులు చెప్పటంతో మద్యం షాపులో పనిచేస్తున్న సిబ్బంది ఎట్టకేలకు తాళం తీశారు. ఈ తతంగం మొత్తం రెండు గంటల పాటు కొనసాగింది. కప్పిపుచ్చేందుకు యత్నాలు... ఈ లోపుగానే మద్యం షాపుపై దాడులు చేయవద్దని, ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని కొందరు వ్యక్తులు రంగంలోకి దిగారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సొంత నియోజకవర్గంలోనే ఈ వ్యవహారం బయటపడటంతో విషయాన్ని కప్పిపుచ్చేందుకు టీడీపీ నాయకులు కసరత్తు చేశారు. అయితే బైపాస్ వైన్స్‌కు కేటాయించిన మద్యం కాకుండా వేరే ప్రాంతాల నుంచి మద్యాన్ని అక్రమంగా తీసుకువచ్చి ఇక్కడ విక్రయించటం, ఎక్సైజ్ అధికారులు దాడులు చేయటంతో ఎవరికి వారు మిన్నకుండిపోయారు. గురువారం రాత్రి 7.30 గంటలకు బైపాస్ వైన్స్‌లో 112 లిక్కర్ కేసులు, 102 బీరు కేసులు వేరే ప్రాంతం నుంచి ఇక్కడకు తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్న మద్యం కేసులకు సంబంధించి జారీ చేసిన తేదీ, లేబుల్ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మరికొన్ని మద్యం కేసులను పరిశీలించాల్సి ఉందని ఎక్సైజ్ సీఐ తెలిపారు. ఎక్సైజ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు రూ.12 లక్షల వరకు ఉంటుందని సమాచారం. నిబంధనలకు విరుద్దంగా వేరే ప్రాంతం నుంచి మద్యాన్ని మచిలీపట్నంకు తరలించి విక్రయించిన నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు పూర్తయిన అనంతరం బైపాస్ వైన్స్‌పై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని మచిలీపట్నం ఎక్సైజ్ కార్యాలయ ఏఈఎస్ సునీత తెలిపారు. షాపు యజమాని బయట ప్రాంతాల నుంచి మద్యం ఇక్కడ తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు అంగీకరించారని ఆమె తెలిపారు. -
బెల్టు షాపుందా.. ఉద్యోగం గోవిందా
కొవ్వూరు : అక్రమ మద్యం, సారా అమ్మకాలను నియంత్రిం చటం, బెల్టు షాపులు లేకుండా చర్యలు తీసుకోవడం, మద్యం దుకాణాల్లో అమ్మకాలు నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేలా చూడటం వంటి బాధ్యతలు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నిర్వర్తించాలి. విధి నిర్వహణలో అడ్డంకులు ఎదురైతే పోలీస్, రెవెన్యూ వంటి శాఖల సహకారం తీసుకోవడం సర్వసాధారణం. కలె క్టర్ సిద్ధార్థజైన్ బెల్టు షాపుల నియంత్రణకు కొత్త పంధాకు తెర లేపారు. గ్రామాల్లో బె ల్టు షాపులు ఉన్నాయా? లేదా? అనేది వీఆర్వోలు ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వాలి. వీఆర్ఏలు అందుకు సహకారం అందించాలి. తదనుగుణంగా వాటి నియంత్రణకు చర్యలు తీసుకుంటారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఆ గ్రామంలో తనిఖీ చేసిన సమయంలో నివేదికలో పొందుపరిచినట్టు కాకుండా బె ల్టు షాపులున్నట్టు తేలితే వీఆర్వోతో పాటు వీఆర్ఏను బాధ్యులను చే సి విధులను తొలగిస్తామని తహసిల్దార్లు అర్జంట్ నోటీసులు పంపారు. మద్యం బెల్టు షాపులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఈనెల 8న 263 నంబరు జీవోను విడుదల చేసింది. జీవో అమలు బాధ్యతను కలెక్టర్లు భుజాన వేసుకున్నారు. ఇప్పటికే ఆర్డీవో కార్యాలయాలకు కలెక్టర్ ఆదేశాలు అందాయి. ప్రస్తుతం తహసిల్దార్లు వీఆర్వోలకు రాతపూర్వకంగా నోటీసులు పంపే పనిలో నిమగ్నమయ్యారు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిందన్న చందంగా బెల్టుషాపుల నియంత్రణ వ్యవహారం వీఆర్వోలను బలి పశువులను చేసే విధంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాము అందించే గ్రామ నివేదిక లో వాస్తవ విషయాలు స్పష్టం చేసినా గుట్టుచప్పుడు కాకుండా బెల్టు షాపులు నిర్వహిస్తే తమ పరిస్థితి ఏమిటన్న భయం వీఆర్వో, వీఆర్ ఏలను వెంటాడుతోంది. అసలు బాధ్యత ఎవరిది! ఇన్నాళ్లు ఎక్సైజ్ అధికారులు గేట్లు ఎత్తేయడంతో మద్యం బెల్టుషాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయి. మద్యం విక్రయాలు పెంచేందుకు ప్రభుత్వం విధిం చిన లక్ష్యాలు, మామూళ్లకు ఆశపడి బె ల్టుషాపుల నిర్వహణకు ఎక్సైజ్ అధికారులే ఊతం ఇచ్చారు. మద్యం అమ్మకాలకు సంబందించి తమకు నిర్దేశించి న లక్ష్యాలను చేరుకోవడానికి వీటి నిర్వహణను బాగా ప్రోత్సహించడంతో వీధి, వీధిన బెల్టుషాపులు ఏర్పడ్డాయి. బెల్టు షాపులను పూర్తిగా తొలగించామని ఎక్సైజ్ అధికారులు ప్రకటిస్తున్నా గ్రామాల్లో నేటికీ గుట్టుచప్పుడు కాకుం డా మద్యం విక్రయాలు సాగుతూనే ఉన్నాయి. అది కూడా బాగా పరిచయస్తులకు మాత్రమే మద్యం అమ్ముతున్నట్టు సమాచారం. జూలై 1 నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభం కానున్నాయి. బె ల్టు షాపులు లేకపోవడంతో దుకాణదారులు గుట్టుచప్పుడు కాకుండా గ్రామాల్లో మద్యం వ్యాపారం చేసుకునేందుకు సన్నహాలు చేసుకుంటున్నారు. ఇందుకు అవసరమైతే అధికార పార్టీ పలుకుబడి ఉపయోగించి ఎక్సైజ్ అధికారులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి సిండికేటు వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ఎక్కడైనా బెల్టుషాపులు నిర్వహిస్తే ఆ పరిధిలో ఉండే మద్యం షాపు లెసైన్సును రద్దుచేస్తామంటున్నారు. ఇది ఎంత వరకు అమలు చేస్తారనేది వేచిచూడాలి. బెల్టుషాపుల నియంత్రణకు ఎక్సైజ్ శాఖకు ఎన్నో మార్గాలున్నాయి. పోలీస్ శాఖకు కూడా వీటి నిర్వహకులపై కేసులు నమోదు చేసే అధికారం ఉంది. వాటన్నింటిని కఠినతరం చేయడం ద్వారా బెల్టుషాపులను నియంత్రించే అవకాశం ఏర్పడుతుంది. ఇందుకు గ్రామస్థాయిలో సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకునేందుకు వీఆర్వోలు, వీఆర్ఏలతో పాటు పంచాయతీ కార్యద ర్శుల సేవలను వినియోగించుకోవచ్చు. అవ రసరమైతే సమాచారం అందించిన ఉద్యోగులు, స్థానికులకు తగిన ప్రోత్సహకాలు అందించడం ద్వారా బె ల్టుషాపులను పూర్తి స్థాయిలో నిర్మూలించే అవకాశం ఏర్పడుతుంది. ఇవన్నీ మరిచి బెల్టుషాపుల విషయంలో వీఆర్వో, వీఆర్ఏలపై చర్యలు తీసుకుంటామని ఆదేశాలు ఇవ్వడం పట్ల విమర్శలు వస్తున్నాయి. -
అక్రమ మద్యంపై గట్టి నిఘా
సంగారెడ్డి క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలో అక్రమ మద్యంపై గట్టి ని ఘా వేస్తున్నామని ఎన్నికల ప్రవర్తనా నియమావళి జిల్లా నోడల్ అధికారి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ (ఎన్ఫోర్స్మెంట్) సయ్యద్ యాసిన్ ఖురేషి తెలిపారు. శుక్రవారం ఆ యన న్యూస్‌లైన్‌తో మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి రాకుండా కట్టుదిట్టమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందులో భాగంగా జహీరాబాద్ శివారులోని చిరాగ్పల్లి చెక్‌పోస్టును మరింత బలోపేతం చేశామని వెల్లడించారు. ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్ఐలు, 12 మంది కానిస్టేబుళ్లను ఈ చెక్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. దీనితో పాటు ఒక ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లతో బార్డర్ మొబైల్ పెట్రోలింగ్ పార్టీని ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్, స్టాటిక్స్ సర్వేయల్ టీం బృందాలు నారాయణఖేడ్‌లో నాలుగు, జహీరాబాద్‌లో నాలుగు పనిచేస్తున్నాయని తెలిపారు. అలాగే జిల్లాలో నాలుగు ఇంటెలిజెన్స్ బృందాలున్నాయని, ఎక్సైజ్‌కు సంబంధించి నేర సమాచారాలను ఈ బృందాలు సేకరిస్తారని చెప్పారు. అలాగే జిల్లాలో ఇటీవల కొత్తగా 136 మంది కొత్తగా ఎక్సైజ్ కానిస్టేబుళ్లను నియమించామని, వీరందరినీ ఎన్నికల విధుల్లోకి తీసుకుంటామన్నారు. కాగా జిల్లాలోని మద్యం దుకాణదారులు ఎంఆర్ పీ ధరలకే మద్యం విక్రయించాలని సూచించారు. బెల్ట్ షాప్‌లకు మద్యం సరఫరా చేస్తే బెల్టుషాప్‌తో పాటు సరఫరా చేసిన మద్యం దుకాణ ంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంగారెడ్డి, మెదక్‌లో కంట్రోల్ రూమ్‌లు అక్రమ మద్యం నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఇందుకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే తమకు ఫోన్ చేయాలని ఖురేషి కోరారు. ఈ మేరకు సంగారెడ్డి (08455 - 276384), మెదక్ (08452 - 220301)లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని అన్నారు. మిథనాల్‌పై అప్రమత్తం మిథనాల్ అనే రసాయనంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖురేషి సూచించారు. ఇది చూడటానికి సారాయి లాగే ఉంటుందని, దీన్ని పరిశ్రమల్లో ఉపయోగిస్తారని చెప్పారు. కొందరు పరిశ్రమలకు ఈ రసాయనాన్ని తరలిస్తూ అమ్ముకుంటున్నారని, దీన్ని సేవిస్తే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. ఇటీవల ఖమ్మం జిల్లా పాలేరులో మిథనాల్ తాగి ఐదుగురు మృత్యువాత పడగా మరో ఐదుగురికి తీవ్ర అస్వస్థతకు గురైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే జిల్లాలో కల్తీ కల్లు విక్రయాలపై కూడా కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. నర్సాపూర్, అందోల్, సిద్దిపేట, దుబ్బాక, రామాయంపేట, జిన్నారం తదితర ప్రాంతాల్లో క్లోరల్ హైడ్రేట్ (సీహెచ్), డైజోఫాం, రా అడల్టరేషన్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. -
అక్రమ మద్యంపై కొర డా
సంగారెడ్డి క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలో అక్రమ మద్యంపై గట్టి నిఘా వేస్తున్నామని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కే రఘురామ్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా నాగర్ కర్నూల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ బదిలీపై ఇటీవల మెదక్ జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను దృష్టి లో పెట్టుకుని అక్రమ మద్యం సాగకుం డా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే జిల్లాలో కల్తీ కల్లు విక్రయాలపై కూడా కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషితో కలిసి జిల్లాలో దాడులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా నర్సాపూర్, అందోల్, జిన్నారం తదితర ప్రాంతాల్లో క్లోరల్ హైడ్రేట్ (సీహెచ్), డైజోఫాం, రా అడల్టరేషన్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో మరిన్ని ఎక్సైజ్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నారాయణఖేడ్ ప్రాంతంలో సమావేశాలు ఏర్పాటు చేసి గంజాయి సాగు చేయవద్దంటూ పలుమార్లు అక్కడివారికి అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో బెల్ట్ షాప్‌లపై కూడా నిఘా వేశామని చెప్పారు. జిల్లాలో ఎక్సైజ్ శాఖలో మొత్తం 205 మంది కానిస్టేబుళ్లు అవసరం ఉండగా కేవలం 47 మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. ఖాళీల కొరత వల్ల కూడా విధులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఖాళీల భర్తీ విషయంలో ప్రభుత్వానికి ఇదివరకే విన్నవించామని తెలిపారు.