కొవ్వూరు : అక్రమ మద్యం, సారా అమ్మకాలను నియంత్రిం చటం, బెల్టు షాపులు లేకుండా చర్యలు తీసుకోవడం, మద్యం దుకాణాల్లో అమ్మకాలు నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేలా చూడటం వంటి బాధ్యతలు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నిర్వర్తించాలి. విధి నిర్వహణలో అడ్డంకులు ఎదురైతే పోలీస్, రెవెన్యూ వంటి శాఖల సహకారం తీసుకోవడం సర్వసాధారణం. కలె క్టర్ సిద్ధార్థజైన్ బెల్టు షాపుల నియంత్రణకు కొత్త పంధాకు తెర లేపారు. గ్రామాల్లో బె ల్టు షాపులు ఉన్నాయా? లేదా? అనేది వీఆర్వోలు ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వాలి. వీఆర్‌ఏలు అందుకు సహకారం అందించాలి. తదనుగుణంగా వాటి నియంత్రణకు చర్యలు తీసుకుంటారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఆ గ్రామంలో తనిఖీ చేసిన సమయంలో నివేదికలో పొందుపరిచినట్టు కాకుండా బె ల్టు షాపులున్నట్టు తేలితే వీఆర్వోతో పాటు వీఆర్‌ఏను బాధ్యులను చే సి విధులను తొలగిస్తామని తహసిల్దార్‌లు అర్జంట్ నోటీసులు పంపారు.
మద్యం బెల్టు షాపులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఈనెల 8న 263 నంబరు జీవోను విడుదల చేసింది. జీవో అమలు బాధ్యతను కలెక్టర్లు భుజాన వేసుకున్నారు. ఇప్పటికే ఆర్డీవో కార్యాలయాలకు కలెక్టర్ ఆదేశాలు అందాయి. ప్రస్తుతం తహసిల్దార్లు వీఆర్వోలకు రాతపూర్వకంగా నోటీసులు పంపే పనిలో నిమగ్నమయ్యారు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిందన్న చందంగా బెల్టుషాపుల నియంత్రణ వ్యవహారం వీఆర్వోలను బలి పశువులను చేసే విధంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాము అందించే గ్రామ నివేదిక లో వాస్తవ విషయాలు స్పష్టం చేసినా గుట్టుచప్పుడు కాకుండా బెల్టు షాపులు నిర్వహిస్తే తమ పరిస్థితి ఏమిటన్న భయం వీఆర్వో, వీఆర్ ఏలను వెంటాడుతోంది.
అసలు బాధ్యత ఎవరిది!
ఇన్నాళ్లు ఎక్సైజ్ అధికారులు గేట్లు ఎత్తేయడంతో మద్యం బెల్టుషాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయి. మద్యం విక్రయాలు పెంచేందుకు ప్రభుత్వం విధిం చిన లక్ష్యాలు, మామూళ్లకు ఆశపడి బె ల్టుషాపుల నిర్వహణకు ఎక్సైజ్ అధికారులే ఊతం ఇచ్చారు. మద్యం అమ్మకాలకు సంబందించి తమకు నిర్దేశించి న లక్ష్యాలను చేరుకోవడానికి వీటి నిర్వహణను బాగా ప్రోత్సహించడంతో వీధి, వీధిన బెల్టుషాపులు ఏర్పడ్డాయి. బెల్టు షాపులను పూర్తిగా తొలగించామని ఎక్సైజ్ అధికారులు ప్రకటిస్తున్నా గ్రామాల్లో నేటికీ గుట్టుచప్పుడు కాకుం డా మద్యం విక్రయాలు సాగుతూనే ఉన్నాయి. అది కూడా బాగా పరిచయస్తులకు మాత్రమే మద్యం అమ్ముతున్నట్టు సమాచారం. జూలై 1 నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభం కానున్నాయి.
బె ల్టు షాపులు లేకపోవడంతో దుకాణదారులు గుట్టుచప్పుడు కాకుండా గ్రామాల్లో మద్యం వ్యాపారం చేసుకునేందుకు సన్నహాలు చేసుకుంటున్నారు. ఇందుకు అవసరమైతే అధికార పార్టీ పలుకుబడి ఉపయోగించి ఎక్సైజ్ అధికారులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి సిండికేటు వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ఎక్కడైనా బెల్టుషాపులు నిర్వహిస్తే ఆ పరిధిలో ఉండే మద్యం షాపు లెసైన్సును రద్దుచేస్తామంటున్నారు. ఇది ఎంత వరకు అమలు చేస్తారనేది వేచిచూడాలి. బెల్టుషాపుల నియంత్రణకు ఎక్సైజ్ శాఖకు ఎన్నో మార్గాలున్నాయి.
పోలీస్ శాఖకు కూడా వీటి నిర్వహకులపై కేసులు నమోదు చేసే అధికారం ఉంది. వాటన్నింటిని కఠినతరం చేయడం ద్వారా బెల్టుషాపులను నియంత్రించే అవకాశం ఏర్పడుతుంది. ఇందుకు గ్రామస్థాయిలో సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకునేందుకు వీఆర్వోలు, వీఆర్‌ఏలతో పాటు పంచాయతీ కార్యద ర్శుల సేవలను వినియోగించుకోవచ్చు. అవ రసరమైతే సమాచారం అందించిన ఉద్యోగులు, స్థానికులకు తగిన ప్రోత్సహకాలు అందించడం ద్వారా బె ల్టుషాపులను పూర్తి స్థాయిలో నిర్మూలించే అవకాశం ఏర్పడుతుంది. ఇవన్నీ మరిచి బెల్టుషాపుల విషయంలో వీఆర్వో, వీఆర్‌ఏలపై చర్యలు తీసుకుంటామని ఆదేశాలు ఇవ్వడం పట్ల విమర్శలు వస్తున్నాయి.
బెల్టు షాపుందా.. ఉద్యోగం గోవిందా
Published Mon, Jun 30 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM
Advertisement
Advertisement