
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్ నేపథ్యంలో మద్యం బంద్‌తో కొందరు గుడుంబా వైపు మళ్లే అవకాశం ఉందని, దీనిని అరికట్టేందుకు ప్రొహిబిషన్, ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులను అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ఎక్సైజ్ శాఖ ఉన్నత అధికారులతో మంత్రి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గుడుంబా తయారు చేసే వారిపై అవసరమైతే పీడీ యాక్టు కింద కేసులు పెట్టాలని సూచించారు.