SIDDHARTHA JAIN
-
క్యూఆర్ కోడ్‌లో భూమి
సాక్షి, అమరావతి: బ్రిటీష్ కాలం నాటి రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేసి వివాదాలకు శాశ్వతంగా తెరదించే లక్ష్యంతో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం ద్వారా భూముల రీ సర్వే కార్యక్రమాన్ని శరవేగంగా చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ ముద్రించనుంది. దీన్ని స్కాన్ చేయడం ద్వారా భూ కమతం, విస్తీర్ణం, ఎలాంటి భూమి, మ్యాప్ తదితర వివరాలన్నీ తెలుసుకోవచ్చు. రీ సర్వేలో ఆక్షాంశాలు, రేఖాంశాలతో (జియో కో–ఆర్డినేట్స్) భూమి హద్దులను నిర్ధారిస్తున్నారు. భూమికి నలువైపులా వీటిని సూచించడం ద్వారా విస్తీర్ణాన్ని కచ్చితంగా తెలుసుకోవచ్చు. వీటి ఆధారంగా రైతుల పట్టాదార్ పాస్ పుస్తకంలో క్యూఆర్ కోడ్ ముద్రిస్తారు. ప్రస్తుతం ఒక సర్వే నంబర్‌కి ఒక ఎఫ్ఎంబీ ఉండగా, నలుగురైదుగురు భూ యజమానులుంటే ఉమ్మడిగా ఒక మ్యాప్ కేటాయిస్తున్నారు. రీ సర్వే తర్వాత ప్రతి భూమిని (సెంటు భూమి విడిగా ఉన్నా సరే) సర్వే చేసి ప్రత్యేకంగా రాళ్లు పాతుతారు. దానికి ల్యాండ్ పార్సిల్ మ్యాప్ ఇస్తారు. ఆ సర్వే నంబర్లో ఎంత మంది ఉంటే అందరి మ్యాప్‌లు విడివిడిగా పొందుపరుస్తారు. ప్రతి భూ యజమానికి తమ భూములపై ఎవరూ సవాల్ చేయడానికి వీలు లేని శాశ్వత హక్కులు లభిస్తాయి. 70 బేస్ స్టేషన్లతో కార్స్ నెట్వర్క్ జీపీఎస్ కార్స్ నెట్వర్క్ (కంటిన్యుస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్ నెట్వర్క్) ద్వారా భూములను కొలుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 70 బేస్ స్టేషన్లు శాటిలైట్ రేడియో సిగ్నళ్లను స్వీకరించి కచ్చితమైన అక్షాంశ, రేఖాంశాలను సెంట్రల్ కంట్రోల్ స్టేషన్‌కు పంపుతాయి. కార్స్, డ్రోన్, రోవర్ సహాయంతో భూములను కచ్చితంగా కొలుస్తారు. తద్వారా ప్రతి స్థిరాస్తి కొల తలు, హద్దులు, విస్తీర్ణం, భూ కమత పటం ల్యాండ్ రిజిస్టర్లో డిజిటల్ రూపంలో నమోదవుతాయి. వీటితో మ్యాప్‌లో క్యూఆర్ కోడ్ రూపంలో పొందుపరుస్తారు. నకిలీలు, ట్యాంపరింగ్‌కు తెర ప్రతి భూమికి (ల్యాండ్ పార్సిల్) ఒక విశిష్ట సంఖ్య కేటాయించి భూమి వివరాలతోపాటు భూ యజమాని ఆధార్, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ సేకరించి భూ రికార్డులో భద్రపరుస్తారు. భూ యజమానికి తెలియకుండా రికార్డుల్లో ఎలాంటి మార్పులు చేయడానికి అవకాశం ఉండదు. డూప్లికేట్ రికార్డులు, ట్యాంపరింగ్‌కు అవకాశం ఉండదు. ఆయా భూముల క్రయ విక్రయాలు జరిగిన వెంటనే రికార్డుల్లో ఆటోమేటిక్‌గా మారిపోతాయి. తద్వారా భూ సమాచారాన్ని ఎవరైనా, ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా తెలుసుకోవచ్చు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కంప్యూటర్ ఆధారిత భూ సమాచార వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. దీనిద్వారా ఎవరైనా తమ భూమిని మ్యాప్‌తో సహా చూసుకోవడానికి వీలుంటుంది. సర్వేతో ఇవీ ప్రయోజనాలు.. ► ప్రతి ఆస్థికి యజమాని గుర్తింపు ► రికార్డుల్లో పదిలంగా ఆస్తి హక్కులు ► ఆ ఆస్తిని మరొకరు ఇతరులకు విక్రయించే అవకాశం ఉండదు ► పకడ్బందీగా హద్దులు, కొలతలు ► క్షేత్రస్థాయిలో భూమి ఏ ఆకారంలో ఉందో రికార్డుల్లో అలాగే ఉంటుంది ► ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా ఆస్తి వివరాలు తెలుసుకోవచ్చు ► హద్దు రాళ్లు తొలగించినా, గట్టు తెగ్గొట్టినా మీ ఆస్తి డిజిటల్ రికార్డుల్లో భద్రంగా ఉంటుంది. ► భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం, సంపూర్ణ హక్కుతో ఉంటుంది. సంపూర్ణ హక్కులు, రక్షణే లక్ష్యం స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా భూముల రీ సర్వే నిర్వహిస్తున్నాం. రీ సర్వేతో అస్తవ్యస్థంగా ఉన్న రికార్డుల ప్రక్షాళన జరుగుతుంది. వాస్తవంగా ఉన్న భూముల విస్తీర్ణం ప్రకారం డిజిటల్ రికార్డులు తయారవుతాయి. దళారీ వ్యవస్థకు ఆస్కారం ఉండదు. ప్రస్తుతం సర్వే నెంబర్ల వారీగా హద్దు రాళ్లు లేకపోవడంతో సరిహద్దు వివాదాలు తలెత్తుతున్నాయి. రీ సర్వేలో ప్రతి సర్వే నెంబరును ఉచితంగా సర్వే చేస్తున్నాం. వైఎస్సార్ జగనన్న హద్దురాళ్లు ఏర్పాటు చేస్తాం. ప్రతి భూమిపై సంబంధిత యజమానికి సంపూర్ణ హక్కు, రక్షణ కల్పించడమే రీ సర్వే ఉద్దేశం. – సిద్ధార్థ జైన్, కమిషనర్, సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ -
చురుగ్గా భూముల రీ సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే కార్యక్రమం చురుగ్గా జరుగుతోంది. దాదాపు వెయ్యి గ్రామాల్లో ఇప్పటికే రీ సర్వే పూర్తయ్యింది. ఆ మేరకు నంబర్ 13 నోటిఫికేషన్లు కూడా జారీ చేశారు. మరో వెయ్యి గ్రామాల్లో అక్టోబర్ నాటికి రీ సర్వే పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అప్పటికి మొత్తంగా 2 వేల గ్రామాల్లో సర్వే పూర్తి చేసి.. కొత్త భూముల రికార్డులు తయారు చేయాలనే లక్ష్యంతో సిబ్బంది, అధికారులు పనిచేస్తున్నారు. మరోవైపు ఇప్పటివరకు 1,977 గ్రామాల్లో ఓఆర్ఐ(ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్) జారీ ప్రక్రియను పూర్తి చేశారు. డ్రోన్ల ద్వారా భూములను కొలిచి.. వాటి చిత్రాలు జారీ చేసిన తర్వాతే సర్వే బృందాలు తమ పని ప్రారంభిస్తాయి. ఆ తర్వాత రైతుల సమక్షంలో క్షేత్ర స్థాయి నిజనిర్థారణ చేస్తారు. ఇలా ఇప్పటివరకు 1,200 గ్రామాల్లో క్షేత్రస్థాయి నిజనిర్ధారణ కూడా పూర్తయ్యింది. సర్వే పూర్తయ్యాక భూ యజమానుల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిష్కరించేందుకు కూడా వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం నియమించిన మొబైల్ మెజిస్ట్రేట్లు ఇప్పటివరకు 10,421 అభ్యంతరాలను సామరస్యంగా పరిష్కరించాయి. అలాగే రీ సర్వేను వేగంగా నిర్వహించేందుకు ఇటీవల ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్‌బుక్ రూల్స్‌కు సవరణలు చేయాలని నిర్ణయించి ప్రాథమిక నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. రీసర్వే పూర్తయిన తర్వాత తయారు చేసే కొత్త రెవెన్యూ రికార్డుల రూపకల్పనలో ఈ సవరణలు ఉపయోగపడతాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మరోవైపు మంత్రివర్గ ఉపసంఘం ప్రతి నెలా అప్పటివరకు జరిగిన సర్వేను సమీక్షించి అవసరమైన సూచనలిస్తోంది. సీఎం వైఎస్ జగన్ కూడా రీ సర్వే కార్యక్రమంపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ.. గడువు లోగా దాన్ని పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో రీ సర్వే కోసం ప్రస్తుతం 21 డ్రోన్లు పనిచేస్తుండగా, సకాలంలో పనులు పూర్తి చేసేందుకు మరో 10 డ్రోన్లు సమకూర్చుకోనున్నట్లు సర్వే సెటిల్మెంట్ కమిషనర్ సిద్దార్థ జైన్ తెలిపారు. -
జిల్లా కలెక్టర్‌గా సిద్ధార్థ జైన్
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్‌గా సిద్ధార్థ జైన్ నియమితులయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న కలెక్టర్ కె.రాంగోపాల్ విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఆరు నెలల కిందట చిత్తూరు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రాంగోపాల్ జిల్లా ప్రజలకు సమర్థవంతవంతమైన పాలనను అందించారు. వరుస ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా ఎన్నికలను నిర్వహించారు.కేవలం ఆరు నెలలోనే రాంగోపాల్‌ను బదిలీ చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. కొత్తగా రాబోతున్న సిద్ధార్థ జైన్ ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా కొనసాగుతున్నారు. -
తొలగని అయోమయం
భద్రాచలం : పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిప్పటికీ దీనిపై ఈ ప్రాంతవాసుల్లో ఇంకా అయోమయం తొలగలేదు. పార్లమెంటులో చట్టం చేసే సమయంలోనైనా తమ గోడు వినకపోతారా అనే కొండంత ఆశతో ఈ ప్రాంత వాసులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్డినెన్స్ రద్దు కోరుతూ ముంపు మండలాల్లో పలు ఆందోళనకార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయితే ఆర్డినెన్స్ చట్టం కాకున్నా.. ఈ మండలాలను తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ ఇప్పటికే బూర్గంపాడు మండల పరిధిలోని ఆరు రెవెన్యూ గ్రామాలను కుక్కునూరు మండలంలో విలీనం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. ఇక భద్రాచలం డివిజన్లోని కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలను తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో చేర్చుతూ అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా మండలంలోని మిగతా గ్రామాలకు నెల్లిపాక మండల కేంద్రంగా ఏర్పాటు చేసి, దీన్ని కూడా రంపచోడవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోకి చేర్చారు. ఇలా ముంపు మండలాల్లో తమ పాలన సాగించేందుకు ఆంధ్రప్రదేశ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రెవెన్యూ అధికారులు నెల్లిపాక గ్రామాన్ని సందర్శించి మండల కార్యాలయాలకు అనువైన భవనాలను పరిశీలించి వెళ్లారు. నెల్లిపాకలోని ఆర్అండ్బీ స్థలాన్ని, చిన నల్లకుంట వద్ద నిర్మిస్తున్న ఆశ్రమ పాఠశాల భవన సముదాయాలను కూడా పరిశీలించారు. ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్‌తో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, ఇవేమీ పట్టించుకోకుండా ఈ ప్రాంతాన్ని కలుపుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండటంపై ముంపు వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల్లో తొలగని సందిగ్ధత... ముంపు మండలాల ఉద్యోగులను ప్రస్తుత పరిణామాలు తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఆప్షన్ సౌకర్యాన్ని కల్పిస్తూ కమల్‌నాథన్ కమిటీ విధి విధానాలను వెలువరించేందుకు సిద్ధమవ్వగా, తమ పరిస్థితి ఏమిటని ముంపు ప్రాంత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మండలాల్లోని అన్ని కేడర్ల ఉద్యోగులు వారికి నచ్చిన రాష్ట్రంలో పనిచేసేలా ఆప్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఆందోళనకు కూడా ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి. జూలై వేతనాలు ఇచ్చేదెవరో... ముంపు మండలాల్లో పనిచేసే ఉద్యోగులకు వచ్చే నెల వేతనాలు ఏ ప్రభుత్వం చెల్లిస్తుందనే దానిపై స్పష్టత లేదు. ‘ముంపు’ ఉద్యోగులకు సంబంధించిన వచ్చే నెల వేతనాల బిల్లులు తాము తీసుకోబోమని ఖజానా శాఖ అధికారులు చెపుతుండటంతో తమ పరిస్థితి ఏంటని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. -
బెల్టు షాపుందా.. ఉద్యోగం గోవిందా
కొవ్వూరు : అక్రమ మద్యం, సారా అమ్మకాలను నియంత్రిం చటం, బెల్టు షాపులు లేకుండా చర్యలు తీసుకోవడం, మద్యం దుకాణాల్లో అమ్మకాలు నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేలా చూడటం వంటి బాధ్యతలు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నిర్వర్తించాలి. విధి నిర్వహణలో అడ్డంకులు ఎదురైతే పోలీస్, రెవెన్యూ వంటి శాఖల సహకారం తీసుకోవడం సర్వసాధారణం. కలె క్టర్ సిద్ధార్థజైన్ బెల్టు షాపుల నియంత్రణకు కొత్త పంధాకు తెర లేపారు. గ్రామాల్లో బె ల్టు షాపులు ఉన్నాయా? లేదా? అనేది వీఆర్వోలు ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వాలి. వీఆర్ఏలు అందుకు సహకారం అందించాలి. తదనుగుణంగా వాటి నియంత్రణకు చర్యలు తీసుకుంటారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఆ గ్రామంలో తనిఖీ చేసిన సమయంలో నివేదికలో పొందుపరిచినట్టు కాకుండా బె ల్టు షాపులున్నట్టు తేలితే వీఆర్వోతో పాటు వీఆర్ఏను బాధ్యులను చే సి విధులను తొలగిస్తామని తహసిల్దార్లు అర్జంట్ నోటీసులు పంపారు. మద్యం బెల్టు షాపులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఈనెల 8న 263 నంబరు జీవోను విడుదల చేసింది. జీవో అమలు బాధ్యతను కలెక్టర్లు భుజాన వేసుకున్నారు. ఇప్పటికే ఆర్డీవో కార్యాలయాలకు కలెక్టర్ ఆదేశాలు అందాయి. ప్రస్తుతం తహసిల్దార్లు వీఆర్వోలకు రాతపూర్వకంగా నోటీసులు పంపే పనిలో నిమగ్నమయ్యారు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిందన్న చందంగా బెల్టుషాపుల నియంత్రణ వ్యవహారం వీఆర్వోలను బలి పశువులను చేసే విధంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాము అందించే గ్రామ నివేదిక లో వాస్తవ విషయాలు స్పష్టం చేసినా గుట్టుచప్పుడు కాకుండా బెల్టు షాపులు నిర్వహిస్తే తమ పరిస్థితి ఏమిటన్న భయం వీఆర్వో, వీఆర్ ఏలను వెంటాడుతోంది. అసలు బాధ్యత ఎవరిది! ఇన్నాళ్లు ఎక్సైజ్ అధికారులు గేట్లు ఎత్తేయడంతో మద్యం బెల్టుషాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయి. మద్యం విక్రయాలు పెంచేందుకు ప్రభుత్వం విధిం చిన లక్ష్యాలు, మామూళ్లకు ఆశపడి బె ల్టుషాపుల నిర్వహణకు ఎక్సైజ్ అధికారులే ఊతం ఇచ్చారు. మద్యం అమ్మకాలకు సంబందించి తమకు నిర్దేశించి న లక్ష్యాలను చేరుకోవడానికి వీటి నిర్వహణను బాగా ప్రోత్సహించడంతో వీధి, వీధిన బెల్టుషాపులు ఏర్పడ్డాయి. బెల్టు షాపులను పూర్తిగా తొలగించామని ఎక్సైజ్ అధికారులు ప్రకటిస్తున్నా గ్రామాల్లో నేటికీ గుట్టుచప్పుడు కాకుం డా మద్యం విక్రయాలు సాగుతూనే ఉన్నాయి. అది కూడా బాగా పరిచయస్తులకు మాత్రమే మద్యం అమ్ముతున్నట్టు సమాచారం. జూలై 1 నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభం కానున్నాయి. బె ల్టు షాపులు లేకపోవడంతో దుకాణదారులు గుట్టుచప్పుడు కాకుండా గ్రామాల్లో మద్యం వ్యాపారం చేసుకునేందుకు సన్నహాలు చేసుకుంటున్నారు. ఇందుకు అవసరమైతే అధికార పార్టీ పలుకుబడి ఉపయోగించి ఎక్సైజ్ అధికారులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి సిండికేటు వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ఎక్కడైనా బెల్టుషాపులు నిర్వహిస్తే ఆ పరిధిలో ఉండే మద్యం షాపు లెసైన్సును రద్దుచేస్తామంటున్నారు. ఇది ఎంత వరకు అమలు చేస్తారనేది వేచిచూడాలి. బెల్టుషాపుల నియంత్రణకు ఎక్సైజ్ శాఖకు ఎన్నో మార్గాలున్నాయి. పోలీస్ శాఖకు కూడా వీటి నిర్వహకులపై కేసులు నమోదు చేసే అధికారం ఉంది. వాటన్నింటిని కఠినతరం చేయడం ద్వారా బెల్టుషాపులను నియంత్రించే అవకాశం ఏర్పడుతుంది. ఇందుకు గ్రామస్థాయిలో సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకునేందుకు వీఆర్వోలు, వీఆర్ఏలతో పాటు పంచాయతీ కార్యద ర్శుల సేవలను వినియోగించుకోవచ్చు. అవ రసరమైతే సమాచారం అందించిన ఉద్యోగులు, స్థానికులకు తగిన ప్రోత్సహకాలు అందించడం ద్వారా బె ల్టుషాపులను పూర్తి స్థాయిలో నిర్మూలించే అవకాశం ఏర్పడుతుంది. ఇవన్నీ మరిచి బెల్టుషాపుల విషయంలో వీఆర్వో, వీఆర్ఏలపై చర్యలు తీసుకుంటామని ఆదేశాలు ఇవ్వడం పట్ల విమర్శలు వస్తున్నాయి. -
మునిసిపల్ ఓట్ల లెక్కింపునకు భద్రతా ఏర్పాట్లు
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో ఈ నెల 12న ఏలూరు కార్పొరేషన్, ఏడు మునిసిపాలిటీలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా జిల్లాలోని మునిసిపల్ కమీషనర్లతో ఆయన కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రతి కౌంటింగ్ సెంటరులో లెక్కింపు నిర్వహణకు అన్ని ఏర్పాట్లను ఆయా మునిసిపల్ కమిషనర్లు ముందుగానే పూర్తి చేసుకోవాలన్నారు. అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బంది ఉదయం 5 గంటలకే కౌంటింగ్ సెంటర్‌కు హాజరు కావాలన్నారు. వారి సమక్షంలో ఈవీఎంల ర్యాండమైజేషన్ చేపట్టి ఉదయం 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించాలని చెప్పారు. కౌంటింగ్ సిబ్బంది ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు. కౌంటింగ్ సెంటర్లోకి సెల్ఫోన్లు అనుమతించేది లేదన్నారు. కౌంటింగ్ సెంటర్ వద్ద ప్రత్యేక రూమ్ ఏర్పాటు చేసి వాటిలో కంప్యూటర్, ఇంటర్నెట్, టెలిఫోన్ తదితర సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు వివరించేందుకు మీడియా సెంటరును ఏర్పాటు చేసి, అక్కడ ఓ ఉద్యోగిని నియమించాలని సూచించారు. కౌంటింగ్ సరళిని వీడియో తీయించాలని, సంబంధిత సీడీలు, డీవీడీలను భద్రపరచాలన్నారు. ఆరోజు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ఈపీడీసీఎల్ ఎస్ఈని కలెక్టర్ ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు స్థానిక ఎన్నికల పరిశీలకులు కె.ప్రవీణ్‌కుమార్, విజయమోహన్ వస్తారని తెలిపారు. కౌంటింగ్ సెంటర్లు ఇవి.. ఏలూరు- సీఆర్ఆర్ పబ్లిక్ స్కూల్ కొవ్వూరు- బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల తాడేపల్లిగూడెం- డీఆర్ గోయెంకా మహిళా డిగ్రీ కళాశాల నిడదవోలు- ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల భీమవరం- మునిసిపల్ కార్యాలయంలో పాత కౌన్సిల్ హాల్ తణుకు- ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల నరసాపురం-పాలకొల్లు రోడ్డులోని స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ కళాశాల పాలకొల్లు- సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాల జంగారెడ్డిగూడెం- ఏఎంసీ కార్యాలయం గోడౌన్ అదనపు పరిశీలకులుగా 9 మంది నియామకం కౌంటింగ్ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు 9 మంది అధికారులను అదనపు పరిశీలకులుగా కలెక్టర్ నియమించారు. ఏలూరుకు జెడ్పీ సీఈవో వెంకటరెడ్డి, కొవ్వూరుకు ఆర్డీవో గోవిందరావు, తాడేపల్లిగూడెంకు కేఆర్సీ ఎస్డీసీ కోగంటి ఉమారాణి, నిడదవోలుకు టీఎల్ఐఎస్ ఎస్డీసీ ఎం.సమజ, భీమవరానికి డ్వామా అదనపు పీడీ టి.సవరమ్మ, తణకుకు డీపీవో నాగరాజువర్మ, నరసాపురానికి ఆర్డీవో జె.ఉదయభాస్కర్, పాలకొల్లుకు మైక్రోఇరిగే షన్ పీడీ ఆర్వీ సూర్యనారాయణను నియమించారు. -
టెన్త్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్
ఏలూరు (ఫైర్‌స్టేషన్‌సెంటర్), న్యూస్‌లైన్ : జిల్లాలో పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో గురువారం మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురు విద్యార్థులను డిబార్ చేసినట్టు కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. విద్యార్థులకు సహకరించిన ఐదుగురు అధికారులను విధుల నుంచి సస్పెండ్ చేసినట్టు తెలిపారు. పూళ్లలో మాస్ కాపీయింగ్ చేస్తున్న ఇద్దరిని, ఇక్కడ ప్రోత్సహించిన పరీక్షా కేంద్ర చీఫ్ సూపరింటెండెంట్, డిపార్డుమెంటల్ అధికారులను, తాడిమళ్లలో స్లిప్‌లతో పరీక్ష రాస్తూ ఫ్లయింగ్ స్క్వాడ్‌కు పట్టుబడ్డ ముగ్గురిని డిబార్ చేసి ఆ పరీక్షా కేంద్ర చీఫ్ సూపరిం టెండెంట్, డిపార్టుమెంటల్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రగడవరంలో పరీక్షా కేంద్రం చుట్టూ వందలాది కాపీస్లిప్లు ఫ్లయింగ్ స్క్వాడ్‌కు దొరకడంతో దీనికి బాధ్యులుగా ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశామన్నారు. కొన్ని కేంద్రాల్లో సిబ్బంది ప్రోత్సాహంతోనే మాస్ కాపీయింగ్ జరగడంతో వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. విధుల్లోకి తీసుకోకపోతే బహిష్కరణ అస్త్రం సస్పెండ్ చేసిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోని పక్షంలో మిగిలిన పరీక్షల విధులను జిల్లాలోని ఉపాధ్యాయులంతా బహిష్కరిస్తారని ఉపాధ్యాయ సం ఘాల నాయకులు రెవెన్యూ శాఖను హెచ్చరించారు. ఏ తప్పూ చేయని ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడంతో మానసిక క్షోభకు గురవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఈ మేరకు హెడ్మాస్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు పి.సత్యనారాయణ, ఎస్టీయూ అధ్యక్షుడు డీవీఏవీ ప్రసాదరాజు, పీఆర్టీయూ అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు, ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి బీఏ సాల్మన్‌రాజు, యూటీఎఫ్ అధ్యక్షుడు ఎస్.శ్రీకాంత్ ఓ ప్రకటన చేశారు. -
కలెక్టర్ ఉత్తరువు..జనం చిత్తరువు
సాక్షి, ఏలూరు:నలభై లక్షల మందికి పెద్ద దిక్కు.. ఏ కష్టమొచ్చినా నిరుపేద నుంచి ధనవంతుల వరకు ప్రతి ఒక్కరూ ఆశ్రయించే న్యాయాలయం. నిత్యం వందలాదిమంది అధికారులు కార్యకలాపాలు సాగించే పరిపాలనా కేంద్రం జిల్లా కలెక్టరేట్. ఇన్నాళ్లూ ఎవరైనా ఇక్కడకు రావచ్చు. కానీ ఇక నుంచి ఆ అవకాశం లేదంటూ, గుర్తింపు కార్డు ఉంటేనే లోనికి అనుమతంటూ కలెక్టరేట్ గేటు ముందు రక్షక భటులు నిలువరిస్తున్నారు. కలెక్టరేట్లో ప్రవేశానికి తొలిసారిగా వచ్చిన ఈ ఆంక్షలు ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఇటీవల సమైక్యవాదులు జిల్లా కలెక్టరేట్ వద్ద సమైక్య నినాదాలు చేస్తుండగా కలెక్టర్ సిద్ధార్థజైన్ కారులో వచ్చారు. సమైక్యవాదులు కారుతో పాటే కలెక్టరేట్‌లోకి చొచ్చుకుని వెళ్లడం కలెక్టర్‌కు ఆగ్రహం తెప్పించింది. వెంటనే స్థానిక పోలీసును పిలిపించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు. అంతటి అధికారి ఆదేశించడంతో పోలీసు ఉన్నతాధికారులు చర్యలు ప్రారంభించారు. కలెక్టరేట్లో గేటును మూసేశారు. గుర్తింపు కార్డు ఉంటేనే అనుమతిస్తామంటూ హుకుం జారీ చేశారు. ఓటు వేసేటప్పుడు ఓటరు గుర్తింపు కార్డు లేదా ఫొటో ఉండే ఏదైనా గుర్తింపుకార్డు (రేషన్ కార్డు, బ్యాంక్‌బుక్, ఆధార్ కార్డు, పాన్‌కార్డు లాంటివి) తీసుకువస్తేనే ఓటు వేసే అవకాశం లభించినట్టు కలెక్టరేట్‌లోకి వెళ్లాలన్నా అలాంటి గుర్తింపుకార్డు తీసుకురావాల్సిందే. కలెక్టరేట్లో కలెక్టర్‌తో పాటు, జాయింట్ కలెక్టర్, అదనపు జాయింట్ కలెక్టర్, ఇతర ముఖ్య అధికారులతో పాటు, దాదాపు 30 ప్రభుత్వశాఖల అధికారులు, సిబ్బంది ఉంటారు. వీరిలో ఎవరిని కలవాలన్నా గుర్తింపు కార్డు ఉంటేనే లోపలికి వెళ్లేది. సర్వత్రా విమర్శలు ఎన్నడూ లేని ఈ కొత్త విధానం వల్ల అధికారులను కలవాలంటే ప్రజలు ముప్పుతిప్పలు పడుతున్నారు. కనీస సమాచారం లేకపోవడంతో జిల్లా ఉన్నతాధికారులు సైతం గుర్తింపు కార్డులు లేకుండా వచ్చి గేటు వద్ద భంగపడుతున్నారు. కలెక్టరేట్లో పని చేసే అవుట్ సోర్సింగ్ సిబ్బందిలో చాలా మందికి గుర్తింపు కార్డులు లేవు. వారు విధులకు హాజరయ్యేందుకు వచ్చి గేటు వద్దే నిలిచిపోతున్నారు. ఇక సామాన్యుల సంగతి వేరే చెప్పనవసరం లేదు. గుర్తింపు కార్డులేమీ లేకుండా జిల్లా నలుమూలల నుంచి వ్యయప్రయాసల కోర్చి వచ్చిన వారు కనీసం ఆ కార్యాలయం గేటు దాటి వెళ్లలేకపోతున్నారు. భద్రత కోసం ఇంతటి కఠిన నిర్ణయం తీసుకున్నారనుకున్నా మధ్యాహ్నం దాటాక గేట్లు తెరుస్తున్నారు. అప్పుడు మాత్రం ఎందుకో ఈ భద్రత కనిపించడం లేదు. దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు మధ్యాహ్నం లోపు తమ గోడును చెప్పుకుని వెనుదిరగకపోతే ఊరికి చేరలేరు. కానీ మధ్యాహ్నం దాటాక గేట్లు తెరిస్తే ఎప్పుడు అధికారులను కలుస్తారు. ఇళ్లకు ఎప్పుడు బయలుదేరతారు. సామాన్యుల్ని చేరదీయాల్సిన కలెక్టర్ ఇలా దూరం పెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రత కోసమే అయితే పాటించాల్సిన పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలానే ఉన్నాయని, ఇలా గుర్తింపు కార్డు విధానం పెట్టడం వల్ల ప్రజలు ఇబ్బంది పడటం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో చిరు ఉద్యోగి మొదలు ఉన్నతాధికారి వరకు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ సిద్ధార్థజైన్ హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేపల చెరువు బహిరంగ వేలాన్ని నిర్వహించిన కామవరపుకోట మండలం కళ్లచెరువు పంచాయతీ కార్యదర్శి వై.రఘునాథరావును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జిల్లా పంచాయతీ అధికారి అల్లూరి నాగరాజువర్మతో ఈ విషయంపై చర్చించారు. కళ్లచెరువు గ్రామంలో రజకులకు కేటాయించాల్సిన 2 ఎకరాల చెరువును గ్రామ కార్యదర్శి బహిరంగ వేలం ఎందుకు వేశాడని ప్రశ్నించారు. గ్రామ కార్యదర్శి తప్పు చేస్తే జంగారెడ్డిగూడెం డివిజినల్ పంచాయతీ అధికారి సాయిబాబాకు నిబంధనలు తెలియవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలను పాటించని సాయిబాబాకు మెమో జారీ చేయాలని డీపీవోను ఆదేశించారు. బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన ఉద్యోగులు ఇష్టానుసారం వ్యవహరిస్తే సహించబోనని కలెక్టర్ స్పష్టం చేశారు. డీపీవో నాగరాజువర్మ మాట్లాడుతూ కళ్లచెరువు గ్రామంలో రజకులకు కేటాయించాల్సిన 2 ఎకరాల చెరువును 2013 ఆగస్టు 12న గ్రామ కార్యదర్శి మూడేళ్లకు బహిరంగ వేలం నిర్వహించారని, దీనివల్ల 1.55 లక్షలు లీజుకు ఇచ్చినట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. తక్షణమే ఈ విషయంపై తగు చర్యలు తీసుకుని నివేదిక సమర్పిస్తానని చెప్పారు. బోద వ్యాధి నివారణ మాత్రల పంపిణీపై సమీక్ష జిల్లాలో మంగళవారం నిర్వహించే జాతీయ ఫైలేరియా దినోత్సవం సందర్భంగా బోదవ్యాధి నివారణ మందు ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో బోద వ్యాధి నివారణపై ప్రచార కార్యక్రమం అమలుపై ఆయన సమీక్షించారు. ఈ నెల 28న జిల్లాలోని ప్రతి ఒక్కరికీ ముందు జాగ్రత్త చర్యగా బోదవ్యాధి నివారణ మాత్రలను పంపిణీ చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ టి.శకుంతలను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 7,580 మంది బోదవ్యాధితో బాధ పడుతున్నారన్నారు. గతేడాది 16 మంది వ్యాధిబారిన పడ్డారన్నారు. వైద్య విద్యానపరిషత్ కో-ఆర్డినేటర్ డాక్టర్ శంకరరావు, జిల్లా మలేరియా నివారణాధికారి డాక్టర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల భర్తీకి వచ్చే నెల రెండో తేదీన నిర్వహించే పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ సిద్ధార్థజైన్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఉద్యోగాల కోసం 55 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని వారందరికీ రాత పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. మెరిట్ ప్రాతిపదికపై పోస్టుల భర్తీ జరుగుతాయన్నారు. అజ్జమూరు సర్పంచ్‌కు అభినందనలు వేసవిలో మంచినీటి ఎద్దడి నివారణకు ముందు జాగ్రత్త చర్యగా సొంత ఖర్చులతో గ్రామంలో పూడుకుపోయిన చెరువు తవ్వటానికి ముందు కు వచ్చిన ఆకివీడు మండలం అజ్జమూరు సర్పంచ్ బచ్చు సరళ కుమారిని కలెక్టర్ సిద్థార్ధజైన్ అభినందించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలిసి చెరువు పునరుద్ధరణకు సహకరించాలని ఆమె కోరారు. వెంట నే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సీసీఎల్ సమీక్షకు కలెక్టర్ పయనం రాష్ట్ర భూ పరిపాలనా కమిషనర్ (సీసీఎల్) మహంతి మంగళవారం నిర్వహించే సమీక్ష సమావేశానికి కలెక్టర్ సిద్ధార్థజైన్ సోమవారం హైదరాబాద్‌కు పయనమయ్యారు. కలెక్టర్ తిరిగి బుధవారం జిల్లాకు చేరుకోనున్నారు. -
ఓటు విలువ తెలుసుకో
ఏలూరు, న్యూస్‌లైన్ : ప్రతి ఒక్కరు ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించాలని కలెక్టర్ సిద్ధార్థ జైన్ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక సీఆర్ఆర్ రెడ్డి కళాశాల నుంచి పాత బస్టాండ్ వరకు ఓటర్ల అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ సిద్ధార్థజైన్ బెలూన్లను ఆకాశంలో ఎగురవేసి ఈ ర్యాలీని ప్రారంభించారు. వేలాది మంది విద్యార్థిని, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, తరలిరావడంతో నగరంలోని రోడ్లు కిక్కిరిసిపోయాయి. అనంతరం ఫైర్‌స్టేషన్ సెంటర్లో విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. పాతబస్టాండ్ డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద కలెక్టర్ ఓటర్ల ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిద్ధార్థజైన్ మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో 2.75లక్షల మంది ఓటర్లు కొత్తగా నమోదయ్యారని, ఇందులో 60వేల మంది యువ ఓటర్లు ఉండడం అభినందనీయమని అన్నారు. ఓటరుగా నమోదు కాబడిన ప్రతి ఒక్కరూ ఎన్నికల సమయంలో ఓటు హక్కును వినియోగించుకుని బలమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడేందుకు దోహదపడాలన్నారు. జేసీ టి.బాబూరావునాయుడు, ఏఎస్పీ ఎన్.చంద్రశేఖర్, డీఆర్వో కె.ప్రభాకర్‌రావు, జెడ్పీ సీఈవో వి నాగార్జున సాగర్, ఖజానాశాఖ డీడీ మోహన్‌రావు, ఏలూరు ఆర్డీవో బి.శ్రీనివాసరావు, డీఈవో ఆర్.నరసింహారావు, హౌసింగ్ పీడీ జి.సత్యనారాయణ, డ్వామా పీడీ ఎన్.రామచంద్రారెడ్డి, ప్రణాళిక శాఖ జేడీ కె.సత్యనారాయణ, డీఎస్పీ ఎం.సత్తిబాబు, వ్యవసాయశాఖ జేడీ వీడీవీ కృపాదాస్, ఐసీడీఎస్ పీడీ వి.వసంతబాల, సెట్వెల్ సీఈవో ఎండీ మెహర్రాజ్, నగర కమిషనర్ జి.నాగరాజు, డీఎస్డీవో బి.శ్రీనివాసరావు, తహసిల్దార్లు పాల్గొన్నారు. -
చెరువుల అనుమతికి ప్రత్యేక సెల్
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్: జిల్లాలో చేపలు, రొయ్యల చెరువుల తవ్వకాలకు సంబంధించి అనుమతులు ఇవ్వడానికి ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాయలంలోని సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో చేపల చెరువులకు అనుమతులు, సమస్యలపై అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే చేపల చెరువులకు అనుమతులు ఇవ్వాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. చేపల చెరువుల అనుమతుల్లో పారదర్శకతను పెంచి అవినీతిని తగ్గించాలన్నారు. వ్యవసాయ భూములను చెరువులుగా మార్చరాదని, కొల్లేరును పరిరక్షించాలని, అదే సమయంలో చిన్న రైతులను ఇబ్బందులకు గురిచేయకూడదని పేర్కొన్నారు. చెరువులు తవ్వేటప్పుడు సన్న, చిన్నకారు రైతుల అభిప్రాయాలను, సాగునీటి కాలువలు, మంచినీటి వనరులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. మండల స్థాయి కమిటీల నుంచి చేపల చెరువుల అనుమతుల ప్రతిపాదనలను డివిజన్‌స్థాయి కమిటీ పరిశీలించాలన్నారు. అనంతరం జిల్లాస్థాయి కమిటీ ద్వారా అనుమతులు పొందాలన్నారు. ఇరిగేషన్, ఏపీ ట్రాన్స్‌కో, అటవీ శాఖ, రెవెన్యూ తదితర శాఖలకు సంబంధించిన అనుమతులు పొందినదీ లేనిదీ సమీక్షించి ఈ నెల 29న నిర్వహించే జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో మత్స్య శాఖ డెప్యూటీ డెరైక్టర్ వీవీ కృష్ణమూర్తి, ఏడీ షేక్ లాల్ మహ్మద్, వ్యవసాయశాఖ జేడీ కృపాదాస్, బీసీ కార్పొరేషన్ ఈడీ, వికలాంగుల సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జి ఏడీ జి.పెంటోజీరావు పాల్గొన్నారు. -
మిగిలింది మూడు నెలలే
ఏలూరు, న్యూస్‌లైన్ :కొత్త సంవత్సరం వచ్చేసింది.. పాత ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇక మూడు నెలలే గడువు మిగిలి ఉంది. దీంతో లక్ష్యాలను చేరుకునేందుకు ప్రభుత్వ శాఖల అధికారులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. గడచిన ఏడాదిలో రాష్ట్ర విభజన ప్రక్రియ తెరపైకి రావటం, ప్రజాందోళనలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో మూడు నెలలపాటు పాలనా వ్యవస్థ స్తంభించింది. ఫలితంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడ్డాయి. ఆ తరువాత అయినా పనులు చేద్దామంటే డిసెంబర్ మొదటి వారం వరకూనిధులు మంజూరు కాలేదు. మరోవైపు ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వస్తోంది. ఈ పరిస్థితుల్లో హుటాహుటిన పనులు చేపడితేనే శాఖల వారీగా లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంటుంది. వ్యవసాయం, విద్యుత్, రహదారుల అభివృద్ధి, నిరుద్యోగాలకు ఉపాధి పథకాలు మందగించడంతో వాటిని వేగంగా పూర్తి చేసేందుకు కలెక్టర్ సిద్ధార్థజైన్ చర్యలు చేపట్టారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా పెండింగ్ పనులన్నిటినీ రానున్న మూడు నెలల్లో పూర్తి చేసేదిశగా యంత్రాంగం అడుగులు వేస్తోంది. శాఖల వారీగా ఇలా డెల్టా ఆధునికీకరణ పనుల కోసం కేటాయించిన నిధుల్లో ఇంకా రూ.వెయి కోట్లు మిగిలి ఉన్నాయి. రానున్న సీజన్లో రూ.200 కోట్లు ఖర్చు చేసేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. కనీసం ఆ మొత్తమైనా ఖర్చు చేయగలుగుతారా అనేది సందేహాస్పదంగానే ఉంది. ఇదిలావుండగా, ఇటీవల అభివృద్ధి చేసిన కాలనీలకు విద్యుత్ సౌకర్యం లేదు. ఇందుకోసం రూ.14.37 కోట్లు ఖర్చుకాగల పనులకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అవి గాడినపడితే కాలనీలకు విద్యుత్ సదుపాయం ఏర్పడుతుంది. మరోవైపు డ్వామా పరిధిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద రూ.120 కోట్లతో పనులు చేపట్టాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.70 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన రూ.50 కోట్ల విలువైన పనులను రానున్న మూడు నెలల్లోగా పూర్తిచేయూల్సి ఉంది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ విషయూనికి వస్తే.. వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.65 కోట్లను ఖర్చు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.25 కోట్ల విలువైన పనులు పూర్తయ్యూరుు. ఇంకా రూ.40 కోట్లతో రోడ్లు, వంతెనల్ని అభివృద్ధి చేయూల్సి ఉంది. గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారా 52 మల్టీ విలేజ్ వాటర్ స్కీమ్‌లను ప్రారంభించగా, ఇప్పటివరకు 11 స్కీములు మాత్రమే పూర్తయ్యూరుు. ఇంకా 28 మంచినీటి పథకాలకు సంబంధించిన పనులను చేపట్టి రూ.20 కోట్లు ఖర్చు చేయూల్సి ఉంది. వీటికి అదనంగా వివిధ పనుల కోసం రూ.148 కోట్లను వివిధ పథకాలకు మంజూరయ్యూయి. వీటిలో కొన్నిటికి టెండర్ల ప్రక్రియ పూర్తయియంది. రాజీవ్ విద్యామిషన్ కింద పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.128 కోట్లు మంజూరు కాగా, రూ.75 కోట్లు ఖర్చుచేశారు. ఇంకా రూ.53 కోట్లతో భవనాలను పూర్తి చేయాల్సి ఉంది. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు భవన నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. స్థలసేకరణ పూర్తయ్యే దశలో ఉన్నా.. మార్చి నాటికి ఈ నిర్మాణాలు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. ఉపాధికి మోక్షం ఎన్నడో? కొత్త సంవత్సరంలో అరుునా ఉపాధి పథకం కింద వివిధ యూనిట్లు ప్రారంభించవచ్చని నిరుద్యోగులు గంపెడాశతో ఉన్నారు. ఇందులోనూ పురోగతి కనిపించే పరిస్థితి లేదు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాల రూపంలో 5,410 మందికి రూ.45 కోట్లను రుణాలుగా ఇవ్వాల్సి ఉంది. అయితే, సబ్సిడీ మొత్తాన్ని రూ.30 వేల నుంచి గరిష్టంగా రూ.లక్షకు పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఇంకా మార్గదర్శకాలు విడుదల కాలేదు. బీసీ కార్పొరేషన్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ సంస్థ ద్వారా 4,700 మంది నిరుద్యోగులకు రూ.12.35 కోట్లను మంజూరు చేయూలనే నిర్ణయం ఇంకా కార్యాచరణకు నోచుకోలేదు. వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా 108 మందికి రూ.30 వేల చొప్పున రుణం ఇవ్వాల్సి ఉంది. ఇందులో 21 మందికి కేవలం రూ.6 లక్షలను రుణం ఇచ్చారు. మరోవైపు వికలాంగులను వివాహం చేసుకున్న వారికి ఇచ్చే రూ.50 వేల ప్రోత్సాహకం లబ్ధిదారులకు అందలేదు. మొత్తం 270 మంది ఇందుకోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల 30 జంటలకు రూ.15 లక్షలను విడుదల చేశారు. ఇంకా 240 దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇందులో మరో 10మందికి రూ.5 లక్షలు ఇచ్చేందుకు అంగీకారం లభించిందని వికలాంగుల సంక్షేమ శాఖ ఇన్చార్జి ఏడీ పెంటోజీరావు తెలిపారు. ఇదిలావుండగా, సెట్వెల్, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా 500కు పైగా ఉపాధి యూనిట్లు ప్రారంభించాల్సి ఉంది. మరోవైపు మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణాల లక్ష్యం సగం కూడా పూర్తికాలేదు. వారికి రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలనేది లక్ష్యం కాగా ఇప్పటివరకు రూ.500 కోట్లు లక్ష్యాన్ని కూడా అధిగమించలేదు. ఈ పనులన్నీ రాను న్న మూడు నెలలు కాలంలో పూర్తి చేయడం అనుమానంగానే కనిపిస్తోంది. -
దాళ్వాకు ఓకే
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రానున్న దాళ్వాలో పూర్తి విస్తీర్ణానికి సాగునీరు ఇవ్వాలని జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్ణయించింది. దాళ్వాకు పూర్తిస్థాయిలో నీరివ్వాలా.. పూర్తిగా పంట విరామం ప్రకటించాలా.. లేక ఆధునికీకరణ పనులకు అవకాశం కల్పిస్తూ కొంత ఆయకట్టుకు మాత్రమే నీరివ్వాలా? అనే సందిగ్ధ పరిస్థితుల నేపథ్యంలో కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా నీటిపారుదల సలహా మం డలి సమావేశమై సుదీర్ఘంగా చర్చించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాళ్వాకు నీరివ్వాల్సిందేనని రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో కోరడంతో, అందుకు అంగీకరిస్తూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ ప్రకటన చేశారు. దాళ్వాకు నీరివ్వాలనే నిర్ణయంతోపాటు వచ్చే సార్వా సాగుకు ఆలస్యంగా నీరిచ్చి, డెల్టా ఆధునికీకరణ పనులకు వెసులుబాటు కల్పించాలని తీర్మానించారు. దీర్ఘకాలికంగా సమస్యగా ఉన్న నందమూరు పాత అక్విడెక్ట్‌ను యనమదుర్రు డ్రెయిన్ ప్రక్షాళన పనులు పూర్తయ్యాక తొలగించాలని నిర్ణయించారు. మూడు ప్రతిపాదనల నడుమ... నీటిపారుదల సలహా మండలి చైర్మన్, కలెక్టర్ సిద్ధార్థజైన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో తొలుత ఇరిగేషన్ ఎస్ఈ వైఎస్ సుధాకర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సాగునీటి విడుదల, డెల్టా ఆధునికీకరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలను సమావేశం ముందుంచారు. జిల్లా యంత్రాంగం తరఫున ఆయన మూడు ప్రతిపాదనలు చేశారు. డెల్టా ప్రాంతంలో నికరంగా వరి సాగుచేసే 4.60 లక్షల ఎకరాలకు పూర్తిస్థాయిలో నీరివ్వాలనేది మొదటి ప్రతి పాదన కాగా, ఉప్పుటేరు బేసిన్‌లోని వెంకయ్యవయ్యేరు, ఉండి కాలువ, పాత వయ్యేరు కాలువ, గోస్తనీ పరిధిలోని ఆయకట్టుకు పంట విరామాన్ని ప్రకటించి.. మిగిలిన ఏడు కాలువలకు సాగు నీరందించాలనేది రెండో ప్రతిపాదన. తద్వారా పంట విరామం ప్రకటించిన నాలుగు కాలువల పరిధిలో రూ.167 కోట్ల ఆధునికీకరణ పనులు చేపడతామని ఎస్ఈ ప్రతిపాదించారు. దాళ్వా తర్వాత వచ్చే సంవత్సరం మార్చి 31న కాలువలు మూసివేసి, జూలై 31 తిరిగి నీరు విడుదల చేయూలనేది మూడో ప్రతిపాదన. తద్వారా 120 రోజుల్లో రూ.171 కోట్ల డెల్టా ఆధునికీకరణ పనులు చేపడతామని తెలిపారు. సమావేశంలో మొదటి, మూడు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. మూడు కాలువల పరిధిలో పంట విరామం లోసరి మెయిన్ కెనాల్, తోకతిప్ప బ్రాంచి కెనాల్, వీ అండ్ డబ్ల్యు కాలువ చివరి రీచ్‌తోపాటు మెరక ప్రాంతాలను సాగునీటి సరఫరా నుంచి మినహాయిస్తూ సమావేశం తీర్మానిం చింది. నీటి లభ్యత దృష్ట్యా తమ్మిలేరు, ఎర్రకాలువ, కొవ్వా డ కాలువ ఆయకట్టులో రబీ సాగుకు అనుమతించింది. రైతులతో సమావేశాలు నిర్వహించి వచ్చే దాళ్వాలో ఆరుతడి పంటలు వేసుకోవడానికి సిద్ధం చేయాలని తీర్మానించారు. రైతుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే : పితాని పూర్తి స్థాయి పంట విరామం బదులు కొంత ఆయకట్టుకు పంట విరామాన్ని ప్రకటించి ఆధునికీకరణ పనులు చేపట్టాలని తొలుత భావించామని, కానీ.. వరుస తుపానుల నేపథ్యంలో రైతుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు నిర్ణయాన్ని మార్చుకుని దాళ్వాకు పూర్తిస్థాయిలో నీరివ్వాలని నిర్ణయిం చామని మంత్రి పితాని తెలిపారు. రైతులు త్వరగా నారుమడులు వేసుకుని, నాట్లను త్వరితగతిన పూర్తి చేయూలని కోరారు. తుపాన్లకు దెబ్బతిన్న పంటలకు పరిహారాన్ని త్వరలో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, బీమా కూడా ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. దీర్ఘకాలి కంగా అపరిష్కృతంగా ఉన్న నందమూరు పాత ఆక్విడెక్టును జూన్ 30లోగా తొలగించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ సమయంలో రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. డెల్టా ఆధునికీరణ పనులు చేయడంలో ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు విఫలమయ్యారని పితాని పేర్కొన్నారు. ఇప్పటివరకూ కేవలం 30 శాతం పనులు మాత్రమే అయ్యాయమని తెలిపారు. ‘ఖరీఫ్‌కు ఆలస్యంగా నీరిస్తే కోర్టుకెళతాం’ ఖరీఫ్ సాగుకు సకాలంలో నీరిస్తామని ప్రభుత్వం హైకోర్టులో అంగీకరించిందని, అందుకు విరుద్ధంగా ఆలస్యంగా సాగు నీరిస్తే హైకోర్టులో కోర్టు ధిక్కారణ పిటీషన్ వేస్తామని రైతాంగ సమాఖ్య అధికార ప్రతినిధి ఎంవీ సూర్యనారాయణరాజు అధికారులను హెచ్చరించారు. ఆధునికీకరణ పనులపై ప్రజలకు నమ్మకం పోయిందని, దాళ్వా కావాలో, ఆధునికీకరణ కావాలో తేల్చుకోమనడం సరికాదని అన్నారు. నీటిపారుదల ఎస్ఈకి వ్యవసాయంపై అవగాహన లేదనిపిస్తోం దని, జూలై నెలలో ఖరీఫ్‌కు నీరిస్తే ఎలాగని ప్రశ్నించారు. జూన్ ఒకటో తేదీకల్లా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాగు ఆలస్యమైతే తుపానుల వల్ల కోట్లాది రూపాయల పంటల్ని నష్టపోవాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వానికి ముందుచూపు లేదు : దాళ్వా కావాలో, ఆధునికీకరణ కావాలో తేల్చుకోమనడం సరికాదని కౌలు రైతు సం ఘం నాయకుడు శ్రీనివాస్ విమర్శించారు. ఆధునికీకరణ పనుల విషయంలో ప్రభుత్వానికి ముందుచూపు లేదన్నారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా ఆధునికీరణ చేయాలన్నారు. తెలంగాణ వస్తే ఎలాగూ రబీ ఉండదు తెలంగాణ 15 రోజుల్లో ఇచ్చేస్తున్నట్లు చెబుతున్నారని, అదే జరిగితే వచ్చే దాళ్వా ఎలాగూ ఉండదని.. కాబట్టి ఈ సంవత్సరం దాళ్వా ఇవ్వాలని కాగుపాడు నీటి సంఘం నాయకులు అధికారులను కోరారు. కాలువ పైభాగం వారికి దాళ్వా ఇచ్చి కింది భాగంలో పనులు చేయాలని సూచించారు. పాత అక్విడెక్టును తొలగిస్తే నష్టం ఉండదు : ఈలి నాని నందమూరు పాత అక్విడెక్టును తొలగిస్తే ఎవరికీ నష్టం ఉండదని, రైతులు ఇబ్బంది పడకుండా ఈ సమస్యను పరిష్కరిం చాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఈలి నాని కోరారు. అమెరికాలో తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ తుపానులు వస్తున్నట్లు ఒక శాస్త్రవేత్త చెప్పారని, రైతుల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. దాళ్వా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఇన్పుట్ సబ్సిడీని కొన్ని బ్యాంకులు రైతుల అప్పులకు జమ చేస్తున్నాయని, అలా చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఆధునికీకరణకు దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి : కలెక్టర్ దీర్ఘకాలిక ప్రణాళిక లేకపోతే ఆధునికీకరణ పనులు సాగవని కలెక్టర్ సిద్ధార్థజైన్ స్పష్టం చేశారు. ఏటా సార్వాలో రైతులు నష్టపోతున్నారని, పేరుకు రెండు పంటలున్నా రైతులకు ఒక పంట మాత్రమే వస్తోందని తెలిపారు. ఈ పరిస్థితిని నివారిం చాలంటే ఆధునికీకరణే మార్గమన్నారు. ఇక్కడితో ఆగిపోకుండా వచ్చే సంవత్సరం ఏంచేయాలో కూడా నిర్ణయిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈసారి కాంట్రాక్టర్లు పనులు చేయకపోతే బ్లాక్ లిస్టులో పెట్టడంతోపాటు వారి బ్యాంక్ గ్యారంటీలను ఎన్‌క్యాష్ చేస్తామని హెచ్చరించారు. పంట విరామం లేకుంటే రూ.17 కోట్ల పనులే : ఇరిగేషన్ ఎస్ఈ పంటలకు ఎటువంటి విరామం ఇవ్వకపోతే రూ.17 కోట్ల విలువైన ఆధునికీకరణ పనులు మాత్రమే చేయగలుగుతా మని నీటిపారుదల శాఖ ఎస్ఈ సుధాకర్ చెప్పారు. జిల్లాలో దాళ్వా సాగుకు 48 టీఎంసీల నీరు సరిపోతుందని, నీటి లభ్యత బాగానే ఉందని తెలిపారు. సమావేశంలో ఏపీఐడీసీ చైర్మన్ ఘంటా మురళి, జాయింట్ కలెక్టర్ బాబూరావునాయుడు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ రుద్రరాజు పండురాజు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు డుమ్మా కీలకమైన నీటిపారుదల సలహా మండలి సమావేశానికి నలుగురైదుగురు ప్రజాప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు, నరసాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంత్‌కుమార్, డెల్టా ఎమ్మెల్యేలు కొత్తపల్లి సుబ్బారాయుడు, బంగారు ఉషారాణి, కారుమూరి నాగేశ్వరరావు, కలవపూడి శివ తదితరులు హాజరుకాలేదు. -
ధాన్యానికి మద్దతు ధర చెల్లించండి
ధాన్యానికి మద్దతు ధర చెల్లించండి ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్), న్యూస్‌లైన్ : జిల్లాలో ఖరీఫ్‌లో పండిన ప్రతి ధాన్యం బస్తాకు గిట్టుబాటు ధర అందించి రైతులను ఆదుకోవాలని రైస్ మిల్లర్లను కలెక్టర్ సిద్ధార్థ జైన్ కోరారు. కలెక్టరేట్లో మంగళవారం రాత్రి నిర్వహించిన రైస్‌మిల్లర్లు, మార్కెటింగ్, సహకార శాఖ అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన ధాన్యం కొనుగోళ్ల అంశంపై చర్చించారు. కలెక్టర్ మాట్టాడుతూ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు సందిగ్ధంలో ఉన్నారని, ఇటువంటి స్థితిలో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకన్నా ఎక్కువకే ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలబడాలని మిల్లర్లను కోరారు. జిల్లా రైస్‌మిల్లర్ల సంఘ అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ జిల్లాలో రైతుల దగ్గర కనీస మద్దతు ధరకన్నా రూ.70 నుంచి 100 వరకూ ఎక్కువకే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. ఎఫ్సీఐకు 8 కిలోమీలర్ల పైబడి దూరం నుంచి లేవీ తోలేటప్పుడు రవాణా ఛార్జీలు ఇవ్వడం లేదన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. సమావేశంలో జేసీ బాబూరావు నాయుడు, ఎప్సీఐ డెప్యూటీ జీఎం రాజు, డీఎస్వో శివశంకర్‌రెడ్డి, డీసీవో రామ్మెహన్, మార్కెటింగ్ ఏడీ శర్మ, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు ఉన్నమట్ల కబర్థి, బూరుగుపల్లి వీర రాఘవులు, నర్సిరెడ్డి, టి.లక్ష్మణరావు, వానపల్లి బాబూరావు పాల్లొన్నారు. 27,134 మందికి రేషన్ కూపన్ల పంపిణీ జిల్లాలో ఇప్పటివరకూ 34 మండలాలు, మునిసిపాలిటీలలో రచ్చబండ కార్యక్రమం ద్వారా 27,134 మంది లబ్ధిదారులకు రేషన్ కూపన్లను అందించామని కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. కొత్త రేషన్ కార్డుల కోసం వారం రోజుల్లో 41,510 దరఖాస్తులు రాగా, రేషన్ కార్డులలో మార్పుల కోసం 388 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఇప్పటివరకూ 15,729 మందికి పింఛన్లు అందించినట్టు చెప్పారు. 2,267 మంది వికలాంగులకు పింఛన్లు మంజారు చేసి పత్రాలను అందించామన్నారు. కొత్తగా వివిధ పింఛన్లు మంజారు కోరుతూ 25,570 దరఖాస్తులు అందాయని వివరించారు. ఇళ్ల మంజూరుకు 13,047 మందికి మంజారు పత్రాలు అందించగా మరో 21,681 మంది కొత్తగా దరఖాస్తులు చేసుకున్నారని చెప్పారు. కుటుంబ సహాయ పథకం కింద 647 మంది అర్హులను గుర్తించి ఇప్పటివరకూ 281 మందికి మంజూరు చేశామని కలెక్టర్ సిద్ధార్థ జైన్ వివరించారు.