జిల్లా కలెక్టర్‌గా సిద్ధార్థ జైన్ | district New collector to Siddhartha Jain | Sakshi
Sakshi News home page

జిల్లా కలెక్టర్‌గా సిద్ధార్థ జైన్

Published Wed, Jul 9 2014 5:08 AM | Last Updated on Sat, Oct 20 2018 7:44 PM

జిల్లా కలెక్టర్‌గా సిద్ధార్థ జైన్ - Sakshi

జిల్లా కలెక్టర్‌గా సిద్ధార్థ జైన్

సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్‌గా సిద్ధార్థ జైన్ నియమితులయ్యారు.  ఇక్కడ పనిచేస్తున్న కలెక్టర్ కె.రాంగోపాల్ విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఆరు నెలల కిందట చిత్తూరు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రాంగోపాల్ జిల్లా ప్రజలకు సమర్థవంతవంతమైన పాలనను అందించారు.

వరుస ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా ఎన్నికలను నిర్వహించారు.కేవలం ఆరు నెలలోనే రాంగోపాల్‌ను బదిలీ చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. కొత్తగా రాబోతున్న సిద్ధార్థ జైన్ ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా కొనసాగుతున్నారు.
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement