మిగిలింది మూడు నెలలే
Published Thu, Jan 2 2014 3:39 AM | Last Updated on Wed, Sep 5 2018 2:25 PM
ఏలూరు, న్యూస్‌లైన్ :కొత్త సంవత్సరం వచ్చేసింది.. పాత ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇక మూడు నెలలే గడువు మిగిలి ఉంది. దీంతో లక్ష్యాలను చేరుకునేందుకు ప్రభుత్వ శాఖల అధికారులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. గడచిన ఏడాదిలో రాష్ట్ర విభజన ప్రక్రియ తెరపైకి రావటం, ప్రజాందోళనలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో మూడు నెలలపాటు పాలనా వ్యవస్థ స్తంభించింది. ఫలితంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడ్డాయి. ఆ తరువాత అయినా పనులు చేద్దామంటే డిసెంబర్ మొదటి వారం వరకూనిధులు మంజూరు కాలేదు. మరోవైపు ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వస్తోంది. ఈ పరిస్థితుల్లో హుటాహుటిన పనులు చేపడితేనే శాఖల వారీగా లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంటుంది. వ్యవసాయం, విద్యుత్, రహదారుల అభివృద్ధి, నిరుద్యోగాలకు ఉపాధి పథకాలు మందగించడంతో వాటిని వేగంగా పూర్తి చేసేందుకు కలెక్టర్ సిద్ధార్థజైన్ చర్యలు చేపట్టారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా పెండింగ్ పనులన్నిటినీ రానున్న మూడు నెలల్లో పూర్తి చేసేదిశగా యంత్రాంగం అడుగులు వేస్తోంది.
శాఖల వారీగా ఇలా
డెల్టా ఆధునికీకరణ పనుల కోసం కేటాయించిన నిధుల్లో ఇంకా రూ.వెయి కోట్లు మిగిలి ఉన్నాయి. రానున్న సీజన్‌లో రూ.200 కోట్లు ఖర్చు చేసేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. కనీసం ఆ మొత్తమైనా ఖర్చు చేయగలుగుతారా అనేది సందేహాస్పదంగానే ఉంది. ఇదిలావుండగా, ఇటీవల అభివృద్ధి చేసిన కాలనీలకు విద్యుత్ సౌకర్యం లేదు. ఇందుకోసం రూ.14.37 కోట్లు ఖర్చుకాగల పనులకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అవి గాడినపడితే కాలనీలకు విద్యుత్ సదుపాయం ఏర్పడుతుంది. మరోవైపు డ్వామా పరిధిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద రూ.120 కోట్లతో పనులు చేపట్టాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.70 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన రూ.50 కోట్ల విలువైన పనులను రానున్న మూడు నెలల్లోగా పూర్తిచేయూల్సి ఉంది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ విషయూనికి వస్తే..
వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.65 కోట్లను ఖర్చు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.25 కోట్ల విలువైన పనులు పూర్తయ్యూరుు. ఇంకా రూ.40 కోట్లతో రోడ్లు, వంతెనల్ని అభివృద్ధి చేయూల్సి ఉంది. గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారా 52 మల్టీ విలేజ్ వాటర్ స్కీమ్‌లను ప్రారంభించగా, ఇప్పటివరకు 11 స్కీములు మాత్రమే పూర్తయ్యూరుు. ఇంకా 28 మంచినీటి పథకాలకు సంబంధించిన పనులను చేపట్టి రూ.20 కోట్లు ఖర్చు చేయూల్సి ఉంది. వీటికి అదనంగా వివిధ పనుల కోసం రూ.148 కోట్లను వివిధ పథకాలకు మంజూరయ్యూయి. వీటిలో కొన్నిటికి టెండర్ల ప్రక్రియ పూర్తయియంది. రాజీవ్ విద్యామిషన్ కింద పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.128 కోట్లు మంజూరు కాగా, రూ.75 కోట్లు ఖర్చుచేశారు. ఇంకా రూ.53 కోట్లతో భవనాలను పూర్తి చేయాల్సి ఉంది. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు భవన నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. స్థలసేకరణ పూర్తయ్యే దశలో ఉన్నా.. మార్చి నాటికి ఈ నిర్మాణాలు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు.
ఉపాధికి మోక్షం ఎన్నడో?
కొత్త సంవత్సరంలో అరుునా ఉపాధి పథకం కింద వివిధ యూనిట్లు ప్రారంభించవచ్చని నిరుద్యోగులు గంపెడాశతో ఉన్నారు. ఇందులోనూ పురోగతి కనిపించే పరిస్థితి లేదు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాల రూపంలో 5,410 మందికి రూ.45 కోట్లను రుణాలుగా ఇవ్వాల్సి ఉంది. అయితే, సబ్సిడీ మొత్తాన్ని రూ.30 వేల నుంచి గరిష్టంగా రూ.లక్షకు పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఇంకా మార్గదర్శకాలు విడుదల కాలేదు. బీసీ కార్పొరేషన్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ సంస్థ ద్వారా 4,700 మంది నిరుద్యోగులకు రూ.12.35 కోట్లను మంజూరు చేయూలనే నిర్ణయం ఇంకా కార్యాచరణకు నోచుకోలేదు. వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా 108 మందికి రూ.30 వేల చొప్పున రుణం ఇవ్వాల్సి ఉంది. ఇందులో 21 మందికి కేవలం రూ.6 లక్షలను రుణం ఇచ్చారు.
మరోవైపు వికలాంగులను వివాహం చేసుకున్న వారికి ఇచ్చే రూ.50 వేల ప్రోత్సాహకం లబ్ధిదారులకు అందలేదు. మొత్తం 270 మంది ఇందుకోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల 30 జంటలకు రూ.15 లక్షలను విడుదల చేశారు. ఇంకా 240 దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇందులో మరో 10మందికి రూ.5 లక్షలు ఇచ్చేందుకు అంగీకారం లభించిందని వికలాంగుల సంక్షేమ శాఖ ఇన్‌చార్జి ఏడీ పెంటోజీరావు తెలిపారు. ఇదిలావుండగా, సెట్వెల్, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా 500కు పైగా ఉపాధి యూనిట్లు ప్రారంభించాల్సి ఉంది. మరోవైపు మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణాల లక్ష్యం సగం కూడా పూర్తికాలేదు. వారికి రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలనేది లక్ష్యం కాగా ఇప్పటివరకు రూ.500 కోట్లు లక్ష్యాన్ని కూడా అధిగమించలేదు. ఈ పనులన్నీ రాను న్న మూడు నెలలు కాలంలో పూర్తి చేయడం అనుమానంగానే కనిపిస్తోంది.
Advertisement