Highways Development
-
రోడ్ల వాస్తవ పరిస్థితి అప్పుడేంటి..ఇప్పుడేంటి..?
-
ఏపీలో అద్భుతంగా రహదారుల నిర్మాణం
-
4 నెలల్లో 3,500 కి.మీ.రోడ్లు
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో రహదారుల పునరుద్ధరణను మరింత వేగవంతం చేసింది. కొత్తగా 3,500 కిలోమీటర్ల 437 రోడ్ల పనుల కోసం రూ.1,122 కోట్లు కేటాయించింది. ఆగస్టుకి టెండర్ల ప్రక్రియ చేపట్టి డిసెంబర్‌కి ఆ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. దీంతో టెండర్ల ప్రక్రియకు రోడ్లు, భవనాల (ఆర్ అండ్ బి) శాఖ చర్యలు చేపట్టింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికే నాలుగేళ్లలో రెండు దశల్లో రూ.4,492.99 కోట్లు వెచ్చించి 12,894 కి.మీ. రోడ్లు నిర్మించింది. ఇప్పుడు మూడో దశ పనులకు నిధులు కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా పునరుద్ధరించాల్సిన రోడ్లను శాస్త్రీయంగా ఎంపిక చేశారు. ఆర్ అండ్ బి శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి అత్యధిక రద్దీ ఉన్న రోడ్లను ఎంపిక చేశారు. వీరిచ్చిన నివేదికను ప్రభుత్వం ఆమోదించింది. జిల్లా కేంద్రాలను అనుసంధానించే రోడ్లు, మండల కేంద్రాలను జిల్లా కేంద్రంతో అనుంధానించే 437 రోడ్లను తగిన నిష్పత్తిలో నిర్ణయించారు. వాటిలో 1,289.80 కి.మీ. మేర 132 రాష్ట్ర రహదారులు ఉన్నాయి. వీటిని రూ.490.80 కోట్లతో పునరుద్ధరించనున్నారు. కొత్త జిల్లా కేంద్రాలకు మండల కేంద్రాలతో అనుసంధానించే రోడ్లకు ప్రాధాన్యమిచ్చారు. అందుకే జిల్లా ప్రధాన రహదారుల కేటగిరీలోని 2,210.20 కి.మీ. మేర 305 రోడ్లను రూ.631.20 కోట్లతో పునరుద్ధరించనున్నారు. ప్రాధాన్యక్రమంలో బిల్లుల చెల్లింపు రోడ్ల పునరుద్ధరణ పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు కోసం ఆర్ అండ్ బి అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇటీవల రూ.500 కోట్ల బిల్లులను చెల్లించారు. మిగిలిన బిల్లుల చెల్లింపును వేగవంతం చేశారు. ఇక మూడో దశ కింద చేపట్టనున్న రోడ్ల పనుల బిల్లుల చెల్లింపునకు కూడా ముందస్తు ప్రణాళిక రూపొందిస్తున్నారు. పనులు పూర్తి చేసి బిల్లులు అప్లోడ్ చేసిన వెంటనే ప్రాధాన్యక్రమంలో చెల్లించే విధానాన్ని రూపొందించారు. దీనిపై కాంట్రాక్టర్లకు అవగాహన కల్పిస్తున్నారు. -
ఏపీలో రూ.1,292.65 కోట్ల హైవే పనులకు ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో రూ.1,292.65 కోట్ల విలువైన జాతీయ రహదారి పనులకు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. భారతమాల పరియోజనలో భాగంగా బెంగళూరు–విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో చంద్రశేఖరపురం నుంచి పోలవరం వరకు 32 కిలోమీటర్ల మేర ఆరులేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హైవే అభివృద్ధి నిమిత్తం నిధులకు ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి వరస ట్వీట్లలో పేర్కొన్నారు. బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ బెంగళూరు ఎస్టీఆర్ఆర్ నుంచి ప్రారంభమవుతుందని, ఇప్పటికే ఉన్న బెంగళూరు–విజయవాడ (ఎన్‌హెచ్–44)లోని కొడికొండ చెక్‌పోస్ట్ వరకు రహదారిని వినియోగించుకుంటుందని తెలిపారు. ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ ఎకనామిక్ కారిడార్ కొడికొండ చెక్‌పోస్టు నుంచి ఎన్‌హెచ్–16లోని అద్దంకి వద్ద ముప్పవరం గ్రామం వరకు తదనంతరం విజయవాడ వరకు ఉన్న రహదారిని వినియోగించుకుంటుందని పేర్కొన్నారు. కొడికొండ చెక్‌పోస్టు నుంచి ముప్పవరం వరకు 342.5 కిలోమీటర్లు పూర్తిగా గ్రీన్‌ఫీల్డ్ హైవే అని తెలిపారు. ప్రకాశం జిల్లాలోని ఈ ప్రతిపాదిత అభివృద్ధిని 14 ప్యాకేజీలుగా చేపడతామని కేంద్రమంత్రి గడ్కరీ పేర్కొన్నారు. -
‘మౌలికం’ కీలకం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక అభివృద్ధికి చోదకశక్తి లాంటి మౌలిక వసతుల రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఇప్పటికే రూ.103 లక్షల కోట్లతో పలు ప్రాజెక్టులను ప్రారంభించిందని, తాజాగా రవాణా రంగంలో మౌలిక వసతులు, హైవేలను అభివృద్ధి చేసేందుకు బడ్జెట్లో రూ.1.70 లక్షల కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పౌరుల జీవనాన్ని సులభతరం చేసేందుకు 6,500 మౌలిక వసతుల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నట్లు చెప్పారు. మౌలిక వసతుల రంగంలో ఐదేళ్లలో రూ.100 లక్షల కోట్లకుపైగా వెచ్చిస్తామని ప్రధాని గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో చెప్పారని గుర్తు చేశారు. జాతీయ మౌలిక వసతుల పైప్‌లైన్ (ఎన్ఐపీ) కోసం ఇప్పటికే రూ.20 వేల కోట్లు కేటాయించామన్నారు. 2023కి ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం, నిర్వహణ రంగాల్లో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆర్థిక మంత్రి చెప్పారు. త్వరలోనే జాతీయ సరుకు రవాణా విధానాన్ని ప్రకటిస్తామని తెలిపారు. 2023 నాటికి ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్ వేతోపాటు మరో రెండు ప్యాకేజీలు పూర్తవుతాయన్నారు. చెన్నై–బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రహదారి పనులు కూడా ప్రారంభిస్తామన్నారు. 27,000 కి.మీ మేర విద్యుదీకరణను పూర్తి చేసే దిశగా రైల్వేలు కృష్టి చేస్తున్నాయని చెప్పారు. ‘రహదారుల నిర్మాణంలో వేగం గణనీయంగా పెరిగింది. 2015–16లో రోజుకు 17 కి.మీ మాత్రమే రోడ్ల నిర్మాణం జరగగా 2018–19 నాటికి ఇది 29.7 కి.మీ.కి పెరిగింది’అని ఆర్థిక మంత్రి తెలిపారు. బడ్జెట్లో మౌలిక వసతులకు పెద్దపీట వేయడంతో గృహ నిర్మాణం, చౌకగా పరిశుద్ధమైన ఇంధనం, ఆరోగ్యం, విద్యా సంస్థలు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, బస్ టెర్మినళ్లు, మెట్రో, రైల్వే రవాణా, గిడ్డంగులు, సాగునీటి ప్రాజెక్టులు తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు విస్తృతం కానున్నాయి. ఉపాధి అవకాశాలు విస్తృతం: గడ్కారీ మౌలిక వసతుల రంగానికి ఈ బడ్జెట్ గట్టి ఊతం ఇచ్చిందని కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ పేర్కొన్నారు. తాజా బడ్జెట్ పారిశ్రామిక అభివృద్ధికి జవసత్వాలు కల్పించి ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని, తద్వారా 2 కోట్లకుపైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉందన్నారు. బడ్జెట్లో ‘మౌలిక’వరాలు... ► పర్యాటక ప్రాంతాలను అనుసంధానించేలా మరిన్ని తేజాస్ రైళ్లు. ► ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైళ్లపై చురుగ్గా పరిశీలన. ► ‘ఉడాన్’పథకం ద్వారా 2024 నాటికి మరో వంద విమానాశ్రయాల అభివృద్ధి. ► ఇంధనం, పునరుత్పాదక వనరులకు బడ్జెట్లో రూ.22,000 కోట్లు ► 9,000 కి.మీ మేర ఆర్థిక కారిడార్ ► 2,000 కి.మీ మేర తీర ప్రాంత రహదారులు, హైవేల అభివృద్ధి. రైల్వే లైన్ల పక్కన సోలార్ ప్రాజెక్టులు రైల్వే నెట్వర్క్ కోసం సౌర విద్యుత్‌ను వినియోగించుకునేలా ట్రాక్‌ల పక్కన రైల్వేకు చెందిన భూమిలో పెద్ద ఎత్తున సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. పీపీపీ విధానంలో 150 ప్యాసింజర్ రైళ్ల ఏర్పాటు, 4 స్టేషన్ల పునరాభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రూ. 18,600 కోట్లు ఖర్చయ్యే 148 కి.మీల బెంగళూరు సబర్బన్ రవాణా ప్రాజెక్టును బడ్జెట్లో ప్రతిపాదించారు. మెట్రో తరహాలో టికెట్ రేట్లు ఉంటాయి. -
రోడ్ల నిర్మాణంలో అత్యంత వేగవంతమైన పురోగతి
న్యూఢిల్లీ: రోజుకు సగటున 27 కి.మీ మేర రహదారులు నిర్మిస్తూ ఈ రంగంలో భారత్ అత్యంత వేగవంతమైన వృద్ధిని నమోదు చేసిందని పీయూష్ గోయల్ చెప్పారు. వచ్చే 8 ఏళ్లలో 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని భారత్ ఉవ్విళ్లూరు తోందని చెప్పారు. మధ్యంతర బడ్జెట్ చారిత్రకమైనదని రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ స్వాగతించారు. దీని ద్వారా 40–50 కోట్ల మంది పేదలు, మధ్యతరగతి ప్రజలు నేరుగా ప్రయోజనం పొందుతారని చెప్పారు. మౌలిక వసతులకు కేటాయింపులు, ప్రతిపాదిత ప్రాజెక్టులు, పూర్తయిన ప్రాజెక్టులపై తాజా బడ్జెట్లో గోయల్ ప్రస్తావించిన విషయాలు.. ► రోడ్లు, రైల్వేలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, పట్టణ రవాణా, గ్యాస్–విద్యుత్ సరఫరా, జలరవాణా మార్గాల లాంటి రంగాల్లో తరువాతి తరం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ► ఢిల్లీ, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌లలో ఏళ్లుగా నిలిచి పోయిన వంతెన ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ► రోడ్ల నిర్మాణానికి రూ.83 వేల కోట్లు కేటాయించారు. ► బ్రహ్మపుత్ర నదిలో నౌకాయానాన్ని అభివృద్ధిచేస్తే.. ఈశాన్య ప్రాంతానికి కూడా జలమార్గం గుండా సరుకు రవాణా చేసేందుకు సాధ్యమవుతుంది. ► కోల్‌కతా నుంచి వారణాసికి తొలిసారిగా దేశీయంగా జలరవాణా ద్వారా సరుకు రవాణా ప్రారంభమైంది. ► రైల్వే చరిత్రలోనే ఈ ఏడాది అత్యంత సురక్షితమైనదిగా గడిచింది. ► సిక్కింలోని పాక్యాంగ్ విమానం అందుబాటులోకి వచ్చాక దేశంలో పనిచేస్తున్న విమానాశ్రయాల సంఖ్య 100కు చేరింది. ► స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి సెమీ హైస్పీడ్ రైలు ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’తో ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి సేవలు, వేగం, భద్రత అందుబాటులోకి వస్తాయి. ఈ సాంకేతికతతో మన ఇంజినీర్లు మేకిన్ ఇండియా కార్యక్రమానికి ఊతమిస్తున్నారు. తాజా బడ్జెట్లో రైల్వేలకు సమకూర్చిన మూలధనం: 64,587కోట్లు రైల్వేల మొత్తం మూలధన వ్యయం విలువ: 1,58,658 కోట్లు ► అరుణాచల్‌ప్రదేశ్‌లో విమానయాన సేవలు, మేఘాలయ, త్రిపుర, మిజోరంలలో రైల్వే మార్గాల అనుసంధానత ఇటీవలే ప్రారంభమయ్యాయి. ► ఈ మేరకు ఈశాన్య భారత్‌లో కేటాయింపులు 21 శాతం పెరిగి రూ.58, 166 కోట్లకు చేరుకున్నాయి. ► వచ్చే ఐదేళ్లలో లక్ష గ్రామాలను డిజిటల్ గ్రామాలుగా తీర్చిదిద్దాలని లక్ష్యం. ► 15.80 లక్షల ఇళ్లను పక్కా రోడ్లతో అనుసంధానించారు. మిగిలిపోయిన సుమారు 2 లక్షల ఇళ్లకు కూడా ఈ సౌకర్యం కల్పించేందుకు పనులు జరుగుతున్నాయి. ► ఈసారి పీఎంజీఎస్‌వైకి కేటాయించిన మొత్తం రూ.19,000 కోట్లు. ► 2014–18 మధ్యకాలంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 1.53 కోట్ల ఇళ్లను నిర్మించారు. -
మిగిలింది మూడు నెలలే
ఏలూరు, న్యూస్‌లైన్ :కొత్త సంవత్సరం వచ్చేసింది.. పాత ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇక మూడు నెలలే గడువు మిగిలి ఉంది. దీంతో లక్ష్యాలను చేరుకునేందుకు ప్రభుత్వ శాఖల అధికారులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. గడచిన ఏడాదిలో రాష్ట్ర విభజన ప్రక్రియ తెరపైకి రావటం, ప్రజాందోళనలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో మూడు నెలలపాటు పాలనా వ్యవస్థ స్తంభించింది. ఫలితంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడ్డాయి. ఆ తరువాత అయినా పనులు చేద్దామంటే డిసెంబర్ మొదటి వారం వరకూనిధులు మంజూరు కాలేదు. మరోవైపు ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వస్తోంది. ఈ పరిస్థితుల్లో హుటాహుటిన పనులు చేపడితేనే శాఖల వారీగా లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంటుంది. వ్యవసాయం, విద్యుత్, రహదారుల అభివృద్ధి, నిరుద్యోగాలకు ఉపాధి పథకాలు మందగించడంతో వాటిని వేగంగా పూర్తి చేసేందుకు కలెక్టర్ సిద్ధార్థజైన్ చర్యలు చేపట్టారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా పెండింగ్ పనులన్నిటినీ రానున్న మూడు నెలల్లో పూర్తి చేసేదిశగా యంత్రాంగం అడుగులు వేస్తోంది. శాఖల వారీగా ఇలా డెల్టా ఆధునికీకరణ పనుల కోసం కేటాయించిన నిధుల్లో ఇంకా రూ.వెయి కోట్లు మిగిలి ఉన్నాయి. రానున్న సీజన్లో రూ.200 కోట్లు ఖర్చు చేసేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. కనీసం ఆ మొత్తమైనా ఖర్చు చేయగలుగుతారా అనేది సందేహాస్పదంగానే ఉంది. ఇదిలావుండగా, ఇటీవల అభివృద్ధి చేసిన కాలనీలకు విద్యుత్ సౌకర్యం లేదు. ఇందుకోసం రూ.14.37 కోట్లు ఖర్చుకాగల పనులకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అవి గాడినపడితే కాలనీలకు విద్యుత్ సదుపాయం ఏర్పడుతుంది. మరోవైపు డ్వామా పరిధిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద రూ.120 కోట్లతో పనులు చేపట్టాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.70 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన రూ.50 కోట్ల విలువైన పనులను రానున్న మూడు నెలల్లోగా పూర్తిచేయూల్సి ఉంది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ విషయూనికి వస్తే.. వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.65 కోట్లను ఖర్చు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.25 కోట్ల విలువైన పనులు పూర్తయ్యూరుు. ఇంకా రూ.40 కోట్లతో రోడ్లు, వంతెనల్ని అభివృద్ధి చేయూల్సి ఉంది. గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారా 52 మల్టీ విలేజ్ వాటర్ స్కీమ్‌లను ప్రారంభించగా, ఇప్పటివరకు 11 స్కీములు మాత్రమే పూర్తయ్యూరుు. ఇంకా 28 మంచినీటి పథకాలకు సంబంధించిన పనులను చేపట్టి రూ.20 కోట్లు ఖర్చు చేయూల్సి ఉంది. వీటికి అదనంగా వివిధ పనుల కోసం రూ.148 కోట్లను వివిధ పథకాలకు మంజూరయ్యూయి. వీటిలో కొన్నిటికి టెండర్ల ప్రక్రియ పూర్తయియంది. రాజీవ్ విద్యామిషన్ కింద పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.128 కోట్లు మంజూరు కాగా, రూ.75 కోట్లు ఖర్చుచేశారు. ఇంకా రూ.53 కోట్లతో భవనాలను పూర్తి చేయాల్సి ఉంది. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు భవన నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. స్థలసేకరణ పూర్తయ్యే దశలో ఉన్నా.. మార్చి నాటికి ఈ నిర్మాణాలు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. ఉపాధికి మోక్షం ఎన్నడో? కొత్త సంవత్సరంలో అరుునా ఉపాధి పథకం కింద వివిధ యూనిట్లు ప్రారంభించవచ్చని నిరుద్యోగులు గంపెడాశతో ఉన్నారు. ఇందులోనూ పురోగతి కనిపించే పరిస్థితి లేదు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాల రూపంలో 5,410 మందికి రూ.45 కోట్లను రుణాలుగా ఇవ్వాల్సి ఉంది. అయితే, సబ్సిడీ మొత్తాన్ని రూ.30 వేల నుంచి గరిష్టంగా రూ.లక్షకు పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఇంకా మార్గదర్శకాలు విడుదల కాలేదు. బీసీ కార్పొరేషన్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ సంస్థ ద్వారా 4,700 మంది నిరుద్యోగులకు రూ.12.35 కోట్లను మంజూరు చేయూలనే నిర్ణయం ఇంకా కార్యాచరణకు నోచుకోలేదు. వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా 108 మందికి రూ.30 వేల చొప్పున రుణం ఇవ్వాల్సి ఉంది. ఇందులో 21 మందికి కేవలం రూ.6 లక్షలను రుణం ఇచ్చారు. మరోవైపు వికలాంగులను వివాహం చేసుకున్న వారికి ఇచ్చే రూ.50 వేల ప్రోత్సాహకం లబ్ధిదారులకు అందలేదు. మొత్తం 270 మంది ఇందుకోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల 30 జంటలకు రూ.15 లక్షలను విడుదల చేశారు. ఇంకా 240 దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇందులో మరో 10మందికి రూ.5 లక్షలు ఇచ్చేందుకు అంగీకారం లభించిందని వికలాంగుల సంక్షేమ శాఖ ఇన్చార్జి ఏడీ పెంటోజీరావు తెలిపారు. ఇదిలావుండగా, సెట్వెల్, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా 500కు పైగా ఉపాధి యూనిట్లు ప్రారంభించాల్సి ఉంది. మరోవైపు మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణాల లక్ష్యం సగం కూడా పూర్తికాలేదు. వారికి రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలనేది లక్ష్యం కాగా ఇప్పటివరకు రూ.500 కోట్లు లక్ష్యాన్ని కూడా అధిగమించలేదు. ఈ పనులన్నీ రాను న్న మూడు నెలలు కాలంలో పూర్తి చేయడం అనుమానంగానే కనిపిస్తోంది.