సంగారెడ్డి క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలో అక్రమ మద్యంపై గట్టి నిఘా వేస్తున్నామని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కే రఘురామ్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా నాగర్ కర్నూల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ బదిలీపై ఇటీవల మెదక్ జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను దృష్టి లో పెట్టుకుని అక్రమ మద్యం సాగకుం డా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే జిల్లాలో కల్తీ కల్లు విక్రయాలపై కూడా కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు.
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషితో కలిసి జిల్లాలో దాడులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా నర్సాపూర్, అందోల్, జిన్నారం తదితర ప్రాంతాల్లో క్లోరల్ హైడ్రేట్ (సీహెచ్), డైజోఫాం, రా అడల్టరేషన్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో మరిన్ని ఎక్సైజ్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
నారాయణఖేడ్ ప్రాంతంలో సమావేశాలు ఏర్పాటు చేసి గంజాయి సాగు చేయవద్దంటూ పలుమార్లు అక్కడివారికి అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో బెల్ట్ షాప్‌లపై కూడా నిఘా వేశామని చెప్పారు. జిల్లాలో ఎక్సైజ్ శాఖలో మొత్తం 205 మంది కానిస్టేబుళ్లు అవసరం ఉండగా కేవలం 47 మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. ఖాళీల కొరత వల్ల కూడా విధులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఖాళీల భర్తీ విషయంలో ప్రభుత్వానికి ఇదివరకే విన్నవించామని తెలిపారు.
అక్రమ మద్యంపై కొర డా
Published Tue, Feb 11 2014 11:55 PM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM
Advertisement
Advertisement