
మహిళల అరెస్టు చూపుతున్న ఎక్సైజ్ అధికారులు
సాక్షి, ఖిలా వరంగల్: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురు మహిళలపై కేసు నమోదు చేసి 18లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ చంద్రమోహన్ తెలిపారు. ఖిలా వరంగల్ ఎక్సైజ్ స్టేషన్ ఎస్సై సరిత ఆధ్వర్యంలో శుక్రవారం పడమర, తూర్పు, మధ్య కోటతోపాటు ఉర్సు, రంగశాయిపేట, కరీమాబాద్ ఎస్‌ఆర్‌ఆర్‌తోట ప్రాంతంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. రంగశాయిపేట ప్రాంతానికి చెందిన పత్తి మనెమ్మ, తూర్పుకోటకు చెందిన కనుకుంట్ల లావణ్య, ఉర్సు బీఆర్‌నగర్‌కు చెందిన చంద యాకమ్మ ఇంట్లో తనిఖీ చేయగా వారి వద్ద లభించిన 18లీటర్ల మద్యం స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment