తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ నేడు(మంగళవారం) ఖరారు కానుంది.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ నేడు(మంగళవారం) ఖరారు కానుంది. ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం కేసీఆర్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచార షెడ్యూల్‌పై ముఖ్య నేతలతో ఆయన ఈ రోజు సమావేశమైయినట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగం సభ నిర్వహించే యోచనలో ఉన్నట్టు తెలిసింది. గ్రేటర్ ప్రముఖులతో రెండు టీవీ లైవ్ షోలు చేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, గ్రేటర్ ఎన్నికలకు.. బరాక్ ఒబామా తరహా ఎలక్ట్రానిక్ ప్రచారానికి కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.