Campaign Schedule
-
లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి... 13 నుంచి మోదీ శ్రీకారం!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. పారీ్టలన్నీ అస్త్రశ్రస్తాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కదన రంగంలోకి దూకబోతున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిసింది. మొట్టమొదటి బహిరంగ సభను బిహార్‌లో నిర్వహించబోతున్నారు. బిహార్‌లోని చంపారన్ జిల్లా బేటియా సిటీలో భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారని బీజేపీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. అదేవిధంగా బిహార్‌లో పలు ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారని తెలిపాయి. బిహార్‌లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అన్ని స్థానాలను గెలుచుకొనేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బిహార్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. జనవరి, ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో బేటియా, బెగూసరాయ్, ఔరంగాబాద్ సభల్లో మోదీ ప్రసంగించనున్నారు. బిహార్‌లో గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 39 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క స్థానం లభించింది. ..ఆ స్ఫూర్తితోనే నేర న్యాయ చట్టాలు జైపూర్: ‘పౌరుడు ప్రథమం.. గౌరవం ప్రథమం.. న్యాయం ప్రథమం’ స్ఫూర్తితోనే మూడు నేర న్యాయ చట్టాలను తీసుకొచి్చనట్లు మోదీ చెప్పారు. ఆదివారం జైపూర్‌లో డీజీపీలు, ఐజీల 58వ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ చట్టాలతో దేశ నేర న్యాయ వ్యవస్థలో గుణాత్మక మార్పు వస్తుందన్నారు. మహిళ భద్రత, వారి హక్కుల పరిరక్షణకు కొత్త చట్టాల్లో పెద్దపీట వేశామన్నారు. ‘‘మహిళల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. వారు ఎక్కడైనా, ఎప్పుడైనా స్వేచ్ఛగా పని చేసుకొనే వాతావరణముండేలా చూడండి’’ అని సూచించారు. వికసిత భారత్‌లో భాగంగా పోలీసు వ్యవస్థ సైతం ఆధునికత సంతరించుకుని ప్రపంచ స్థాయి రక్షణ దళంగా మారాలన్నారు. అరేబియా సముద్రంలో సముద్రపు దొంగల చెర నుంచి భారత వాణిజ్య నౌకను క్షేమంగా విడిపించిన నావికాదళంపై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆదిత్య ఎల్1 మిషన్ విజయవంతంగా గమ్యాన్ని చేరుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. -
సమయం లేదు మిత్రమా! అభ్యర్థుల హైరానా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: 'శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు మరో రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో అభ్యర్థులు మరింత హడావుడి పడుతున్నారు.' రేపు సాయంత్రం 5 గంటలకు ప్రచారం సమాప్తం కానుండడంతో భారీ ర్యాలీలతో ప్రధాన పార్టీలు హోరెత్తిస్తున్నాయి. స్టార్ క్యాంపెయినర్లతో అభ్యర్థులు గట్టి ప్రచారం చేయించుకుంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో జాతీయస్థాయి నేతలు పలుసార్లు రావడం గమనార్హం. బీజేపీ అగ్రనేతలు పీఎం మోదీ, అమిత్‌షా, జేపీ నడ్డాలు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఉమ్మడి జిల్లా లో మూడు సార్లు ప్రచారానికి రావడం విశేషం. సీఎం కేసీఆర్ సైతం అన్ని నియోజకవర్గాల్లో స భలు పూర్తి చేశారు. దీన్ని బట్టి జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు ఏ స్థాయి లో ఉందో తెలుస్తోంది. ఇప్పటికే ప్రచారం తారాస్థాయిలో నడుస్తోంది. ఇక ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంతో పాటు కులసంఘాలతో పలుసార్లు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ వచ్చారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఇంటింటి ప్రచారం సైతం నిర్వహిస్తూ వచ్చారు. మరోవైపు సోషల్ మీడియా ద్వారా భారీ ప్రచారం నిర్వహిస్తూ వచ్చారు. సోషల్ మీడియా ప్రచారం నేపథ్యంలో ఎక్కడ చూసినా సీ నియర్ సిటిజన్ల నుంచి ప్రతిఒక్కరూ ఎవరి విశ్లేషణ వారు చేస్తున్నారు. దీంతో ఓటరు నాడి అంతుపట్టని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పార్టీలు సోషల్ ఇంజినీరింగ్ పకడ్బందీగా చేస్తూ వస్తున్నారు. సవాళ్లు.. ప్రతి సవాళ్లు.. జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు ఇందూరు గడ్డ మీ ద నుంచి సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. మరోవైపు జిల్లాలోని నియోజకవర్గాల అభ్యర్థు లు సైతం సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటూ వచ్చారు. ఒకరిద్దరు నేతలైతే పరుష పదజాలం సైతం ఉపయోగంచడంతో రాజకీయ వాతావరణం మరింత వాడివేడిగా తయారైంది. ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్ మీద ప్రత్యేంగా దృష్టి పెట్టారు. సమయం తరిగిపోతుండడంతో అ భ్యర్థులు, నాయకులు ప్రతి నిమిషాన్ని పూర్తి స్థా యిలో సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళిక తో ముందుకు వెళ్తున్నారు. ఇవి కూడా చదవండి: ‘పేట’కు టెక్స్టైల్ పార్కు! : అమిత్ షా -
సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్.. 16 రోజులు 54 సభలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఇప్పటికే పలుచోట్ల ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఇక, తాజాగా రెండో విడతలో ప్రజా ఆశ్వీరాద సభలకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 13 నుంచి 28 వరకు 54 సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. ఈనెల 28న గజ్వేల్ సభతో ప్రచారం ముగించనున్నారు. దీంతో, రాష్ట్రంలో మొత్తం 95 నియోజకవర్గాల పర్యటన పూర్తికానున్నది. ఇప్పటి వరకు 30 నియోజకవర్గాల్లో సభలకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. మరోవైపు.. ఈనెల 9న గజ్వేల్, కామారెడ్డిలో సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. షెడ్యూల్ ఇదే.. ►13న దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేట్. ►14న పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నం. ►15న బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్. ►16న ఆదిలాబాద్, బోథ్, నిజామాబాద్ రూరల్, నర్సాపూర్. ►17న కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, పరకాల. ►18న చేర్యాల. ►19న అలంపూర్, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి. ►20. మానకొండూరు, స్టేషన్ ఘన్పూర్, నకిరేకల్, నల్గొండ. ►21. మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట. ►22న తాండూర్, కొడంగల్, మహబూబ్‌నగర్, పరిగి. ►23న మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్చెరు. ►24న మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి, ►25న హైదరాబాద్‌లో భారాస ప్రజా ఆశీర్వాదసభ. ►26న ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక. ►27న షాద్‌నగర్, చేవెళ్ల, అందోల్, సంగారెడ్డి. ►28న వరంగల్ (ఈస్ట్, వెస్ట్), గజ్వేల్. ఇది కూడా చదవండి: రెండు నియోజకవర్గాల్లో రేవంత్ పోటీ.. ఎక్కడంటే.. -
టార్గెట్ తెలంగాణ.. బీజేపీ బిగ్ ప్లాన్
సాక్షి, హైదరాబాద్: ‘మహా జన్‌సంపర్క్ అభియాన్’లో భాగంగా గురువారం నుంచి ‘ఇంటింటికీ బీజేపీ’పేరిట తొమ్మిదేళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ ఫలాల గురించి ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర బీజేపీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మొదలు పోలింగ్‌బూత్ స్థాయి కార్యకర్త దాకా మొత్తం పార్టీ యంత్రాంగం ఈ కార్యక్రమాల్లో నిమగ్నం కానుంది. 30 లక్షల ఇళ్లలో ప్రజలకు మోదీ సర్కార్ విజయాలు.. సాయంత్రం వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తారు. గురువారం నుంచి 30వ తేదీ వరకు చేపట్టబోయే కార్యక్రమాల్లో భాగంగా మొత్తం 119 శాసనసభా స్థానాల్లో సభలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని ప్రతీ పోలింగ్‌బూత్‌లో సగటున వంద ఇళ్ల తలుపులను తట్టి మొత్తం 30 లక్షల ఇళ్లలో ప్రజలకు మోదీ సర్కార్ విజయాలను తెలిపే కరపత్రాలను అందజేయనున్నారు. అలాగే ప్రధాని మోదీకి మద్దతు తెలిపేలా ప్రజలతో 9090902024 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ అభియాన్‌లో భాగంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటించేందుకు సమయాన్ని కేటాయించినట్టు పార్టీ వర్గాల సమాచారం. గుజరాత్, తదితర రాష్ట్రాల్లో తుపాను ప్రభావం కారణంగా ఇటీవల అమిత్‌షా ఖమ్మం బహిరంగసభ రద్దు కాగా, మళ్లీ ఆయనతో అక్కడే త్వరలోనే సభ నిర్వహించేందుకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెలాఖరులోగా ప్రధాని మోదీ కూడా రాష్ట్రంలోని ఒకటి, రెండు చోట్ల రోడ్‌షోలు నిర్వహించే అవకాశముందని పార్టీ వర్గాల సమాచారం. నేడు ముఖ్యనేతల పర్యటనలిలా.. గురువారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్లో పర్యటించి మోదీ పథకాలను ప్రచారం చేస్తారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అంబర్పేట్, నాంపల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లోని వివిధ పోలింగ్ బూత్‌ల పరిధిలో పర్యటిస్తారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చేవెళ్ల అసెంబ్లీ పరిధిలో, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ ముషీరాబాద్‌లోని గాం«దీనగర్ డివిజన్లో నిర్వహించే కార్యక్ర మాల్లో పాల్గొంటారని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది కూడా చదవండి: ఈనెల 26 నుంచే రైతుబంధు.. వారందరికీ గుడ్‌న్యూస్ -
మునుగోడులో ఎలాగైనా గెలవాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని, సర్వశక్తులూ ఒడ్డాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందుకు తగినట్టుగా వ్యూహాలను సిద్ధం చేస్తోంది. బూత్ స్థాయి నుంచి పార్టీ కేడర్‌ను కదిలించేలా ప్రచార షెడ్యూల్‌ను రూపొందించుకుంటోంది. ఉప ఎన్నిక ప్రచారం సమయంలోనే రాహుల్ గాంధీ పాదయాత్ర ఉండటంతో రెండు కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా షెడ్యూల్ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలు ఆదివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మునుగోడు ఉప ఎన్నిక ఇన్చార్జి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని, టీపీసీసీ ముఖ్య నాయకులందరూ ఈనెల 14 వరకు అక్కడే ఉండాలని నిర్ణయించారు. ఆ తర్వాత కూడా స్థానిక కేడర్‌తో కలిసి ఉధృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని తీర్మానించారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శంషాబాద్‌లో రాహుల్ గాంధీతో నిర్వహించనున్న మునుగోడు బహిరంగ సభ ద్వారా మంచి ఊపు తీసుకురావాలని, ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించారు. గెలుపు తమదేనంటున్న నేతలు సమావేశం అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మిత్రభేదమే తప్ప శత్రు వైరుధ్యం లేదన్నారు. వాటాల పంపకం విషయంలోనే టీఆర్ఎస్, బీజేపీ మ«ధ్య పంచాయితీ నడుస్తోందన్నారు. ఆ రెండు పార్టీలకు గట్టి బుద్ధి చెప్పాలని మునుగోడు ఓటర్లకు రేవంత్ పిలుపునిచ్చారు. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడులో విజయం కాంగ్రెస్ పార్టీదేనని, నవంబర్ ఆరో తేదీన అద్భుతమైన ఫలితం చూస్తారని పేర్కొన్నారు. పార్టీలోని ముఖ్య నాయకులందరం మునుగోడు ఉప ఎన్నికపైనే దృష్టి సారించామని, కచ్చితంగా గెలిచి తీరుతామని సీఎల్పీ నేత భట్టి ధీమా వ్యక్తం చేశారు. -
విజన్ 200; రజనీపై పరోక్ష విమర్శలు
సాక్షి, చెన్నై: 2021 అసెంబ్లీ ఎన్నికల్లో విజన్ 200 నినాదంతో ముందుకు వెళ్దామని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయాత్తం అవుతూ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కార్యదర్శులు, ముఖ్య నేతలతో ఆదివారం అన్నా అరివాలయంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకేకు వ్యతిరేకం నినాదంతో రూపొందించిన ప్రచార లఘు చిత్రాలను ఆవిష్కరించారు. చదవండి: నేను ఎంజీఆర్ రాజకీయ వారసుడ్ని: కమల్ 23 నుంచి గ్రామ సభలు ప్రజలకు మరింత చేరువయ్యే రీతిలో గ్రామ సభలకు డీఎంకే నిర్ణయించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ ఈ వివరాలను సమావేశంలో ప్రకటించారు. ఈనెల 23 నుంచి జనవరి 10వ తేది వరకు గ్రామ సభలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 16 వేల గ్రామాల్లో ఈ సభలు సాగనున్నట్టు, ఇందులో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ, జిల్లా ఇన్‌చార్జ్‌లు, కార్యదర్శులు, ముఖ్య నేతలు తప్పని సరిగా పాల్గొనాల్సిందేనని ఆదేశించారు. ఈ సభల్లో అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా రూపొందించిన లఘు చిత్రాలను ప్రదర్శించాలని సూచించారు. ఎన్నికలకు సిద్ధంకండి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ప్రసంగిస్తూ.. ముందుగానే ఎన్నికల నగారా మోగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి 200లకు పైగా స్థానాలను కైవశం చేసుకోవడమే లక్ష్యం అన్నారు. ప్రతి కార్యకర్త, నాయకుడు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. తాను జనవరి మొదటి వారం నుంచి ప్రచారం మొదలు పెడతానని తెలిపారు. డీఎంకే గెలుపు ఖాయమని.. దీనిని అడ్డుకునేందుకు కొత్త వాళ్లు పుట్టుకొస్తున్నారని అన్నారు. వారి చేత బలవంతంగా పార్టీలు ఏర్పాటు చేయిస్తున్నారని పరోక్షంగా రజనీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఇలాంటి వాళ్లు ఎందరు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలని నేతలకు పిలుపునిచ్చారు. -
ఇక టాప్‌గేర్‌లో ప్రచారం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ జోరు పెంచింది. కార్తీక పౌర్ణమి తరువాత నుంచి కేసీఆర్ పాల్గొనే ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్న కేసీఆర్ ఇకపై తన దాడిని మరింత ఉధృతం చేయనున్నారు. 26వ తేదీ నుంచి ప్రచార జోరును పెంచనున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ ఆయన పాల్గొనే సభల వివరాలను గురువారం విడుదల చేసింది. కేసీఆర్ ప్రచార షెడ్యూల్ వివరాలు 26వ తేదీన..: ఉదయం 11 గంటలకు కామారెడ్డిలో, 11:45కు నిజామాబాద్ రూరల్‌లో, 12:30కు బోధన్‌లో, 1:15 మోర్తాడు (బాల్కొండ నియోజకవర్గం)లో, 2 గంటలకు జగిత్యాలలో ధర్మపురి, కోరుట్ల, జగిత్యాల, చొప్పదండి నియోజకవర్గాల ఉమ్మడి సభ, 2:45కు కరీంనగర్లో మానుకొండూరు, కరీంనగర్ నియోజకవర్గాల ఉమ్మడి సభ, 3:30కు స్టేషన్ ఘన్‌పూర్‌లో, 4:15కు పరకాలలో, 5 గంటలకు వరంగల్‌లో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల ఉమ్మడి సభ. 27న తేదీన..: ఉదయం 11 గంటలకు కల్వకుర్తిలో, 11:45కు మహబూబ్‌నగర్‌లో, 12:30కు వనపర్తిలో, 1:15కు కొల్లాపూర్‌లో, 2 గంటలకు అచ్చంపేటలో, 2:45కు హాలియా (నాగార్జునసాగర్)లో, 3:30కు మునుగోడులో, 4:15కు ఆలేరులో సభలు. 28వ తేదీన..: ఉదయం 11 గంటలకు బాన్సువాడలో, 11:45కు జుక్కల్‌లో, 12:30కు నారాయణఖేడ్‌లో, 1:15కు జహీరాబాద్‌లో, 2 గంటలకు సంగారెడ్డిలో, 2:45కు అందోల్‌లో, 3:30కు నర్సాపూర్‌లో, 4:15 గజ్వేల్‌లో సభలు. -
నేడు కేసీఆర్ జీహెచ్ఎంసీ ప్రచార షెడ్యూల్ ఖరారు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ నేడు(మంగళవారం) ఖరారు కానుంది. ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచార షెడ్యూల్‌పై ముఖ్య నేతలతో ఆయన ఈ రోజు సమావేశమైయినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగం సభ నిర్వహించే యోచనలో ఉన్నట్టు తెలిసింది. గ్రేటర్ ప్రముఖులతో రెండు టీవీ లైవ్ షోలు చేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, గ్రేటర్ ఎన్నికలకు.. బరాక్ ఒబామా తరహా ఎలక్ట్రానిక్ ప్రచారానికి కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. -
వైఎస్ఆర్ సీపీ ప్రచార షెడ్యూల్ విడుదల
ఒంగోలు : ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార షెడ్యూల్‌ను శనివారం విడుదల చేసింది. పార్టీ అభ్యర్థి అట్లా చినవెంకటరెడ్డిని గెలిపించేందుకు ముమ్మరంగా ప్రచారం చేయాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి నిర్ణయించారు. ఆ మేరకు పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి శనివారం స్థానికంగా బాలినేని నివాసంలో సమావేశమయ్యారు. నియోజకవర్గాల వారీగా ఓటు హక్కు కలిగిన ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులను కలుసుకుని ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు తయారు చేసిన ప్రచార షెడ్యూల్‌ను పార్టీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి విడుదల చేశారు. ఇప్పటికే కందుకూరు, దర్శి నియోజకవర్గాల్లో ప్రచారం పూర్తి కావడంతో మిగిలిన పది నియోజకవర్గాలకు సంబంధించిన ప్రచార షెడ్యూలు విడుదల చేశారు. పార్టీకి చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు తప్పనిసరిగా ప్రచారానికి హాజరుకావాలని అశోక్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఓటుకు నోటుతో ప్రజాస్వామ్యం ఖూనీ : ఎంపీ వైవీ ఓటుకు నోటుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి టీడీపీపై ధ్వజమెత్తారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీడీపీ ఓటుకి నోటు అంటూ మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోందని, ఓటర్లు నిజాయితీగా వ్యవహరించాలని కోరారు. బాలినేని నివాసంలో జరిగిన సమావేశంలో బాలినేని, వైవీ, ముత్తుములతో పాటు పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అట్ల చినవెంకటరెడ్డి, సంతనూతలపాడు, అద్దంకి, కందుకూరు, మార్కాపురం ఎమ్మెల్యేలు ఆదిమూలపు సురేష్, గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు, జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ వరికూటి అశోక్‌బాబు పాల్గొన్నారు. ప్రచార కార్యక్రమాలపై నియోజకవర్గాల వారీగా వారంతా చర్చించారు. ప్రచారం షెడ్యూలు ఇదీ... 22వ తేదీ ఉదయం 11 గంటల నుంచి అద్దంకి, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి పర్చూరు, సాయంత్రం 4.30 గంటల నుంచి చీరాల నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. 23వ తేదీ ఉదయం 11 గంటల నుంచి గిద్దలూరు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి యర్రగొండపాలెం, సాయంత్రం 5 గంటల నుంచి మార్కాపురం, 24వ తేదీ మధ్యాహ్నం 10 గంటల నుంచి ఒంగోలు, సంతనూతలపాడు, మధ్యాహ్నం 12 గంటల నుంచి కొండపి, సాయంత్రం 3 గంటల నుంచి కనిగిరి నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు.