సాక్షి, హైదరాబాద్: ‘మహా జన్‌సంపర్క్ అభియాన్’లో భాగంగా గురువారం నుంచి ‘ఇంటింటికీ బీజేపీ’పేరిట తొమ్మిదేళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ ఫలాల గురించి ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర బీజేపీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మొదలు పోలింగ్‌బూత్ స్థాయి కార్యకర్త దాకా మొత్తం పార్టీ యంత్రాంగం ఈ కార్యక్రమాల్లో నిమగ్నం కానుంది.
30 లక్షల ఇళ్లలో ప్రజలకు మోదీ సర్కార్ విజయాలు..
సాయంత్రం వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తారు. గురువారం నుంచి 30వ తేదీ వరకు చేపట్టబోయే కార్యక్రమాల్లో భాగంగా మొత్తం 119 శాసనసభా స్థానాల్లో సభలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని ప్రతీ పోలింగ్‌బూత్‌లో సగటున వంద ఇళ్ల తలుపులను తట్టి మొత్తం 30 లక్షల ఇళ్లలో ప్రజలకు మోదీ సర్కార్ విజయాలను తెలిపే కరపత్రాలను అందజేయనున్నారు. అలాగే ప్రధాని మోదీకి మద్దతు తెలిపేలా ప్రజలతో 9090902024 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ అభియాన్‌లో భాగంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటించేందుకు సమయాన్ని కేటాయించినట్టు పార్టీ వర్గాల సమాచారం. గుజరాత్, తదితర రాష్ట్రాల్లో తుపాను ప్రభావం కారణంగా ఇటీవల అమిత్‌షా ఖమ్మం బహిరంగసభ రద్దు కాగా, మళ్లీ ఆయనతో అక్కడే త్వరలోనే సభ నిర్వహించేందుకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెలాఖరులోగా ప్రధాని మోదీ కూడా రాష్ట్రంలోని ఒకటి, రెండు చోట్ల రోడ్‌షోలు నిర్వహించే అవకాశముందని పార్టీ వర్గాల సమాచారం.
నేడు ముఖ్యనేతల పర్యటనలిలా..
గురువారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్‌లో పర్యటించి మోదీ పథకాలను ప్రచారం చేస్తారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అంబర్‌పేట్, నాంపల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లోని వివిధ పోలింగ్ బూత్‌ల పరిధిలో పర్యటిస్తారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చేవెళ్ల అసెంబ్లీ పరిధిలో, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ ముషీరాబాద్‌లోని గాం«దీనగర్ డివిజన్‌లో నిర్వహించే కార్యక్ర మాల్లో పాల్గొంటారని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇది కూడా చదవండి: ఈనెల 26 నుంచే రైతుబంధు.. వారందరికీ గుడ్‌న్యూస్
Comments
Please login to add a commentAdd a comment