సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ పార్టీ జోరు పెంచింది. కార్తీక పౌర్ణమి తరువాత నుంచి కేసీఆర్ పాల్గొనే ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్న కేసీఆర్ ఇకపై తన దాడిని మరింత ఉధృతం చేయనున్నారు. 26వ తేదీ నుంచి ప్రచార జోరును పెంచనున్నారు. ఈ మేరకు టీఆర్‌ఎస్ ఆయన పాల్గొనే సభల వివరాలను గురువారం విడుదల చేసింది.
కేసీఆర్ ప్రచార షెడ్యూల్ వివరాలు
26వ తేదీన..: ఉదయం 11 గంటలకు కామారెడ్డిలో, 11:45కు నిజామాబాద్ రూరల్‌లో, 12:30కు బోధన్‌లో, 1:15 మోర్తాడు (బాల్కొండ నియోజకవర్గం)లో, 2 గంటలకు జగిత్యాలలో ధర్మపురి, కోరుట్ల, జగిత్యాల, చొప్పదండి నియోజకవర్గాల ఉమ్మడి సభ, 2:45కు కరీంనగర్‌లో మానుకొండూరు, కరీంనగర్ నియోజకవర్గాల ఉమ్మడి సభ, 3:30కు స్టేషన్ ఘన్‌పూర్‌లో, 4:15కు పరకాలలో, 5 గంటలకు వరంగల్‌లో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల ఉమ్మడి సభ.
27న తేదీన..: ఉదయం 11 గంటలకు కల్వకుర్తిలో, 11:45కు మహబూబ్‌నగర్‌లో, 12:30కు వనపర్తిలో, 1:15కు కొల్లాపూర్‌లో, 2 గంటలకు అచ్చంపేటలో, 2:45కు హాలియా (నాగార్జునసాగర్)లో, 3:30కు
మునుగోడులో, 4:15కు ఆలేరులో సభలు.
28వ తేదీన..: ఉదయం 11 గంటలకు బాన్సువాడలో, 11:45కు జుక్కల్‌లో, 12:30కు నారాయణఖేడ్‌లో, 1:15కు జహీరాబాద్‌లో, 2 గంటలకు సంగారెడ్డిలో, 2:45కు అందోల్‌లో, 3:30కు నర్సాపూర్‌లో, 4:15 గజ్వేల్‌లో సభలు.
ఇక టాప్‌గేర్‌లో ప్రచారం
Published Fri, Nov 23 2018 2:52 AM | Last Updated on Fri, Nov 23 2018 6:32 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment