సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌.. 16 రోజులు 54 సభలు..  | CM KCR Election Campaign Schedule In Second Phase Details | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌.. 16 రోజులు 54 సభలు.. 

Published Sat, Nov 4 2023 9:09 PM | Last Updated on Sat, Nov 4 2023 9:19 PM

CM KCR Election Campaign Schedule In Second Phase Details - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రచారంలో స్పీడ్‌ పెంచారు. ఇప్పటికే పలుచోట్ల ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఇక, తాజాగా రెండో విడతలో ప్రజా ఆశ్వీరాద సభలకు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారైంది. 

ఈనెల 13 నుంచి 28 వరకు 54 సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొననున్నారు. ఈనెల 28న గజ్వేల్‌ సభతో ప్రచారం ముగించనున్నారు. దీంతో, రాష్ట్రంలో మొత్తం 95 నియోజకవర్గాల పర్యటన పూర్తికానున్నది. ఇప్పటి వరకు 30 నియోజకవర్గాల్లో సభలకు సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. మరోవైపు.. ఈనెల 9న గజ్వేల్‌, కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. 

షెడ్యూల్‌ ఇదే..
►13న దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేట్‌.
►14న పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నం.
►15న బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌, ఎల్లారెడ్డి, మెదక్‌.
►16న ఆదిలాబాద్‌, బోథ్‌, నిజామాబాద్‌ రూరల్‌, నర్సాపూర్‌.
►17న కరీంనగర్‌, చొప్పదండి, హుజూరాబాద్‌, పరకాల.
►18న చేర్యాల.
►19న అలంపూర్‌, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి.
►20. మానకొండూరు, స్టేషన్‌ ఘన్‌పూర్‌, నకిరేకల్‌, నల్గొండ.
►21. మధిర, వైరా, డోర్నకల్‌, సూర్యాపేట.
►22న తాండూర్‌, కొడంగల్‌, మహబూబ్‌నగర్‌, పరిగి.
►23న మహేశ్వరం, వికారాబాద్‌, జహీరాబాద్‌, పటాన్‌చెరు.
►24న మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి,
►25న హైదరాబాద్‌లో భారాస ప్రజా ఆశీర్వాదసభ.
►26న ఖానాపూర్‌, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక.
►27న షాద్‌నగర్‌, చేవెళ్ల, అందోల్‌, సంగారెడ్డి.
►28న వరంగల్‌ (ఈస్ట్‌, వెస్ట్‌), గజ్వేల్‌.

ఇది కూడా చదవండి: రెండు నియోజకవర్గాల్లో రేవంత్ పోటీ.. ఎక్కడంటే.. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement