న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. పారీ్టలన్నీ అస్త్రశ్రస్తాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కదన రంగంలోకి దూకబోతున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిసింది. మొట్టమొదటి బహిరంగ సభను బిహార్‌లో నిర్వహించబోతున్నారు. బిహార్‌లోని చంపారన్ జిల్లా బేటియా సిటీలో భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారని బీజేపీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి.
అదేవిధంగా బిహార్‌లో పలు ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారని తెలిపాయి. బిహార్‌లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అన్ని స్థానాలను గెలుచుకొనేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బిహార్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. జనవరి, ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో బేటియా, బెగూసరాయ్, ఔరంగాబాద్ సభల్లో మోదీ ప్రసంగించనున్నారు. బిహార్‌లో గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 39 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క స్థానం లభించింది.
..ఆ స్ఫూర్తితోనే నేర న్యాయ చట్టాలు
జైపూర్: ‘పౌరుడు ప్రథమం.. గౌరవం ప్రథమం.. న్యాయం ప్రథమం’ స్ఫూర్తితోనే మూడు నేర న్యాయ చట్టాలను తీసుకొచి్చనట్లు మోదీ చెప్పారు. ఆదివారం జైపూర్‌లో డీజీపీలు, ఐజీల 58వ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ చట్టాలతో దేశ నేర న్యాయ వ్యవస్థలో గుణాత్మక మార్పు వస్తుందన్నారు. మహిళ భద్రత, వారి హక్కుల పరిరక్షణకు కొత్త చట్టాల్లో పెద్దపీట వేశామన్నారు. ‘‘మహిళల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. వారు ఎక్కడైనా, ఎప్పుడైనా స్వేచ్ఛగా పని చేసుకొనే వాతావరణముండేలా చూడండి’’ అని సూచించారు. వికసిత భారత్‌లో భాగంగా పోలీసు వ్యవస్థ సైతం ఆధునికత సంతరించుకుని ప్రపంచ స్థాయి రక్షణ దళంగా మారాలన్నారు. అరేబియా సముద్రంలో సముద్రపు దొంగల చెర నుంచి భారత వాణిజ్య నౌకను క్షేమంగా విడిపించిన నావికాదళంపై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆదిత్య ఎల్1 మిషన్ విజయవంతంగా గమ్యాన్ని చేరుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment