సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: 'శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు మరో రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో అభ్యర్థులు మరింత హడావుడి పడుతున్నారు.'
రేపు సాయంత్రం 5 గంటలకు ప్రచారం సమాప్తం కానుండడంతో భారీ ర్యాలీలతో ప్రధాన పార్టీలు హోరెత్తిస్తున్నాయి. స్టార్ క్యాంపెయినర్లతో అభ్యర్థులు గట్టి ప్రచారం చేయించుకుంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో జాతీయస్థాయి నేతలు పలుసార్లు రావడం గమనార్హం. బీజేపీ అగ్రనేతలు పీఎం మోదీ, అమిత్‌షా, జేపీ నడ్డాలు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఉమ్మడి జిల్లా లో మూడు సార్లు ప్రచారానికి రావడం విశేషం. సీఎం కేసీఆర్ సైతం అన్ని నియోజకవర్గాల్లో స భలు పూర్తి చేశారు. దీన్ని బట్టి జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు ఏ స్థాయి లో ఉందో తెలుస్తోంది.
ఇప్పటికే ప్రచారం తారాస్థాయిలో నడుస్తోంది. ఇక ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంతో పాటు కులసంఘాలతో పలుసార్లు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ వచ్చారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఇంటింటి ప్రచారం సైతం నిర్వహిస్తూ వచ్చారు. మరోవైపు సోషల్ మీడియా ద్వారా భారీ ప్రచారం నిర్వహిస్తూ వచ్చారు. సోషల్ మీడియా ప్రచారం నేపథ్యంలో ఎక్కడ చూసినా సీ నియర్ సిటిజన్ల నుంచి ప్రతిఒక్కరూ ఎవరి విశ్లేషణ వారు చేస్తున్నారు. దీంతో ఓటరు నాడి అంతుపట్టని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పార్టీలు సోషల్ ఇంజినీరింగ్ పకడ్బందీగా చేస్తూ వస్తున్నారు.
సవాళ్లు.. ప్రతి సవాళ్లు..
జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు ఇందూరు గడ్డ మీ ద నుంచి సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. మరోవైపు జిల్లాలోని నియోజకవర్గాల అభ్యర్థు లు సైతం సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటూ వచ్చారు. ఒకరిద్దరు నేతలైతే పరుష పదజాలం సైతం ఉపయోగంచడంతో రాజకీయ వాతావరణం మరింత వాడివేడిగా తయారైంది. ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో అభ్యర్థులు పోల్ మేనేజ్‌మెంట్ మీద ప్రత్యేంగా దృష్టి పెట్టారు. సమయం తరిగిపోతుండడంతో అ భ్యర్థులు, నాయకులు ప్రతి నిమిషాన్ని పూర్తి స్థా యిలో సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళిక తో ముందుకు వెళ్తున్నారు.
ఇవి కూడా చదవండి: ‘పేట’కు టెక్స్‌టైల్ పార్కు! : అమిత్ షా
Comments
Please login to add a commentAdd a comment