
బాబుమోహన్‌కు ‘గ్రేటర్’ బాధ్యతలు
జోగిపేట: త్వరలో జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అందోలు ఎమ్మెల్యే పి.బాబూమోహన్‌కు ప్రచార బాధ్యతలను పార్టీ అధిష్టానవర్గం అప్పగించింది. ఈ ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలకు టీఆర్‌ఎస్ పార్టీ డివిజన్‌లవారీగా అభ్యర్థి తరపున ప్రచారం చేసి గెలిపించే బాధ్యతలను అప్పగిస్తున్న విషయం తెలిసిందే. తనకు రంగారెడ్డి జిల్లా పరిధిలోని చందానగర్ డివిజన్ ప్రచార బాధ్యతలను అప్పగించినట్లు బాబూమోహన్ తెలియజేశారు. చందానగర్‌తో పాటు పక్కనే ఉన్న శేరిలింగం పల్లి డివిజన్‌లోనూ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. ఈ రెండు డివిజన్‌లలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు శాయశక్తులా కషి చేస్తానని తెలిపారు. నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలు, నాయకులు సైతం తనవెంట ప్రచారాన్ని నిర్వహిస్తారని ఆయన చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మంత్రి కేటీఆర్‌లు తనకు ఈ బాధ్యతలను అప్పగించినట్లు చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.