
రేగోడ్ (మెదక్): టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజ లు అసంతృప్తితో ఉన్నారని అందోల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాబూ మోహన్ అన్నారు. మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. ముందస్తు ఎన్నికలతో అభివృద్ధి రెండేళ్లు వెనక్కిపోయిందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌పై ప్రజలు ఆవేశంగా ఉన్నారని, తగిన శాస్తి జరగడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు నలభై సీట్లు కూడా వచ్చేలా లేవని, కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment