
సాక్షి, వైఎస్సార్: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నాయకులు డబ్బు పంచుతూ.. అడ్డంగా బుక్కయ్యారు. వైఎస్సార్ జిల్లాలో ఓటర్లను ప్రలోభపెట్టడానికి డబ్బులు పంచుతూ పోలీసులకు చిక్కారు. జిల్లాలో ఇప్పటికే చాలా గ్రామాల్లో ఏకగ్రీవాలు అయ్యాయి. ఈ క్రమంలో తెలుగుదేశం నేతలు తమ ఉనికిని కాపాడుకునేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కాజీపేట మండలం దుంపల గట్టు గ్రామంలో టీడీపీ తమ మద్దతుదారుడిని బరిలో నిలపడమే కాక అతడిని గెలిపించాలంటూ డబ్బు పంచుతూ గ్రామస్తులను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారు.
(చదవండి: పట్టాభి ఇంట్లో పచ్చ డ్రామా!)
టీడీపీ నాయకుల చర్యల గురించి గ్రామస్తులే పోలీసులకు ఫిర్యాదు చేయటంతో.. వారు రంగంలోకి దిగారు. పలువురు టీడీపీ నాయకులను అడ్డుకుని.. అదుపులోకి తీసుకున్నారు. ఇక వీరి వద్ద నుంచి 50 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment